రైల్వే మంత్రిత్వ శాఖ

జూన్‌ 2, 2020 ఉదయం 10 గం. వరకు 4155 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడిపిన రైల్వే శాఖ

గమ్యస్థానాలకు చేరిన 57 లక్షలకు పైగా ప్రయాణీకులు
ఒక్క మే నెలలోనే 50 లక్షలకు పైగా ప్రజల ప్రయాణం
మే 12వ తేదీ నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ
జూన్‌ 1వ తేదీ నుంచి పరుగులు పెడుతున్న 200 ఇతర ప్రత్యేక రైళ్లు

Posted On: 02 JUN 2020 7:45PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు, ఇతర ప్రజలను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చిన తర్వాత, మే 1వ తేదీ నుంచి రైల్వే శాఖ శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది.

    జూన్‌ 2వ తేదీ నాటికి మొత్తం 4155 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నడుపుతున్నారు. శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు ప్రారంభమైన నాటి నుంచి జూన్‌ 2 వరకు, ఈ 33 రోజుల్లో 57 లక్షలకుపైగా వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించారు. 

    వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ 4155 రైళ్లు నడుస్తున్నాయి. అత్యధికంగా రైళ్లు మొదలువుతున్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్ (1027 రైళ్లు), మహారాష్ట్ర (802 రైళ్లు), పంజాబ్ (416 రైళ్లు), బిహార్ (294 రైళ్లు), ఉత్తరప్రదేశ్ (288 రైళ్లు).
    
    ఇవన్నీ దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుతున్నాయి. అత్యధిక రైళ్ల గమ్యస్థానాలుగా ఉన్న రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ (1670 రైళ్లు), బిహార్ (1482 రైళ్లు), ఝార్ఖండ్ (194 రైళ్లు), ఒడిశా (180 రైళ్లు), పశ్చిమ బెంగాల్ (135 రైళ్లు). ఇవన్నీ
ప్రస్తుతం ఎలాంటి రద్దీ సమస్యలు లేకుండా నడుస్తున్నాయి.

    శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లకు అదనంగా, మే 12వ తేదీ నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. జూన్‌ 1వ తేదీ నుంచి 200కు పైగా ఇతర రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.



(Release ID: 1628830) Visitor Counter : 188