రక్షణ మంత్రిత్వ శాఖ
పీపీఈ కిట్లు, ఇతర సామగ్రిని క్రిమిరహితం చేసే "అల్ట్రా స్వచ్ఛ్"కు రూపకల్పన
కొత్త వ్యవస్థను రూపొందించిన డీఆర్‌డీవో
పారిశ్రామిక అవసరాల కోసం విభిన్న పరిమాణాల్లో క్యాబినెట్లు
Posted On:
01 JUN 2020 5:55PM by PIB Hyderabad
సూక్ష్మక్రిములను నాశనం చేసే సరికొత్త వ్యవస్థను "రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ" (డీఆర్‌డీవో) రూపొందించింది. దానికి "అల్ట్రా స్వచ్ఛ్" అని పేరు పెట్టింది. దీని ద్వారా పీపీఈ కిట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, భారీ స్థాయిలో ఇతర సామగ్రిని క్రిమిరహితం చేయవచ్చు.
డీఆర్‌డీవోకు చెందిన, దిల్లీలోని "ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్&అలైడ్ సైన్సెస్" ఈ వ్యవస్థను రూపొందించింది. ఘజియాబాద్‌కు చెందిన పారిశ్రామిక భాగస్వామి "జెల్ క్రాఫ్ట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్"తో కలిసి వృద్ధి చేసింది. 'ఓజోనేటెడ్ స్పేస్ టెక్నాలజీ'ని ఉపయోగించిన 'మల్టీపుల్ బ్యారియర్ డిస్రప్షన్' విధానంలో, అధునాతన ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా వస్తువులను క్రిమిరహితం చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఓజోన్ లేపన పరిజ్ఞానంతో "అల్ట్రా స్వచ్ఛ్"ను రెండు పొరలుగా రూపొందించారు.
పారిశ్రామిక, వృత్తిగత, వ్యక్తిగత, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. అల్ట్రా స్వచ్ఛ్‌ను రెండు వేరియంట్లలో తీసుకురానున్నారు. వాటి పేర్లు 'ఓజోనేటెడ్ స్పేస్', 'త్రినేత్ర టెక్నాలజీ'. ఓజోనేటెడ్ టెక్నాలజీ, రాడికల్ డిస్పెన్సర్ కలయికగా త్రినేత్ర టెక్నాలజీని రూపొందిస్తారు.
15 ఆఫియర్, 220 ఓల్టులు, 50 హెడ్జ్ వద్ద అల్ట్రా స్వచ్ఛ్ పని చేస్తుంది. అత్యవసర షట్‌డౌన్, డోర్లు లోపలి నుంచే మూసుకుపోవడం, రెండు ద్వారాలు, లీక్‌ల పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు కూడా ఈ వ్యవస్థలో ఉన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో సామగ్రిని క్రిమిరహితం చేయడానికి పారిశ్రామిక క్యాబినెట్‌కు కావలసిన కొలతలు 7’x4’x3.25’. పారిశ్రామిక అవసరాల కోసం విభిన్న పరిమాణాల్లో క్యాబినెట్లు అందుబాటులోకి తెస్తున్నారు.
(Release ID: 1628459)
Visitor Counter : 278