వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

"వన్ నేషన్ వన్ కార్డ్ పథకం" లో మరో మూడు రాష్ట్రాలు చేరాయి.

వలసదారులకు ప్రయోజనం చేకూర్చడానికి జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ లావాదేవీలను ప్రారంభించాలని ఆహార, పౌర సరఫరా శాఖల మంత్రి "వన్ నేషన్ వన్ కార్డ్ పథకం" పరిధిలోని మొత్తం 20 రాష్ట్రాలను కోరారు.


వలసదారులు 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు : శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

Posted On: 01 JUN 2020 3:14PM by PIB Hyderabad

‘ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ (ఐ.ఎం-పి.డి.ఎస్) పథకంలో ఒడిశా, సిక్కిం, మిజోరం అనే మరో మూడు రాష్ట్రాలను చేర్చుతున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు ప్రకటించారు.  ఈ వ్యవస్థలో, "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" ప్రణాళిక ద్వారా ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కింద ప్రయోజనాలు పొందడానికి దేశవ్యాప్త పోర్టబిలిటీ అమలు చేయబడుతుంది, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ రేషన్ కార్డుదారులకు తమ పేరుపై లభించే సబ్సిడీ కలిగిన ఆహార ధాన్యాల కోటాను ఈ-పి.ఓ.ఎస్. తో అనుసంధానమైన ఎఫ్.పి.ఎస్.  నుండి ఈ-పి.ఓ.ఎస్. పరికరంలో ఆధార్ నెంబరును అనుసంధానించిన తర్వాత ఉన్న / అదే రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. 

ఈ సౌకర్యం ఇప్పటివరకు 17 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో అమలులోఉంది. అవి -  ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా & నగర్ హవేలీ, డయ్యు & డామన్,  గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, త్రిపుర మరియు ఉత్తరప్రదేశ్.  వీటితో పాటు, ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాల సహకారంతో జాతీయ పోర్టబిలిటీని విస్తరించడానికి ఈ ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.  ఈ ప్రయత్నంలో, ఈ మూడు కొత్త రాష్ట్రాలను జాతీయ క్లస్టర్‌తో అనుసంధానించడానికి అవసరమైన సన్నాహక కార్యకలాపాలు. ఈ-పి.ఓ.ఎస్. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్, సెంట్రల్ ఐ.ఎమ్.-పి.డి.ఎస్. మరియు అన్నవితరణ్ పోర్టళ్ళతో అనుసంధానం, సెంట్రల్ రిపోజిటరీలో రేషన్ కార్డులు / లబ్ధిదారుల డేటా లభ్యత, జాతీయ పోర్టబిలిటీ లావాదేవీల యొక్క అవసరమైన పరీక్ష కూడా కేంద్ర ఎన్.ఐ.సి బృందం సహకారంతో పూర్తయింది.  ఈ  ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసిన తరువాత, ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ ప్రణాళిక కింద జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ లావాదేవీలు ఈ రాష్ట్రాల్లో పంపిణీ 2020 జూన్ నుండి ప్రారంభం కానుంది.   2020 ఆగస్టు నాటికి మరో మూడు రాష్ట్రాలు - ఉత్తరాఖండ్, నాగాలాండ్ మరియు మణిపూర్ కూడా జాతీయ క్లస్టర్‌లో చేర్చబడతాయి.  మిగిలిన 13 రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఢిల్లీ, జమ్మూ & కశ్మీర్, లడఖ్, చండీగఢ్, పుదుచ్చేరి, తమిళనాడు, ఛత్తీస్‌ గఢ్, అండమాన్ & నికోబార్ మరియు లక్షద్వీప్ ద్వీపాలను జాతీయ క్లస్టర్‌లో చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు డిపార్ట్‌మెంట్ చేస్తోంది.  2021 మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాలు "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" పథకంలో చేర్చబడతాయని మరియు ఈ పథకం భారతదేశం అంతటా పనిచేస్తుందని ధృవీకరించబడింది.

సాంకేతిక బృందానికి అవసరమైన పునశ్చరణ, శిక్షణలను కేంద్ర సాంకేతిక బృందం ఇచ్చిందని శ్రీ పాశ్వాన్ చెప్పారు.  జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ అమలుకు అవసరమైన మార్గదర్శకాలు / సూచనలను కూడా  ఈ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు చెందిన సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించినట్లు శ్రీ పాశ్వాన్ ప్రత్యేకంగా తెలియజేశారు.   గత 6 నెలల్లో కనీసం ఒక ఆధార్ ప్రామాణీకరించిన లావాదేవీని నమోదు చేసిన ఎన్.ఎఫ్.ఎస్.ఎ. రేషన్ కార్డులు ఈ ప్రణాళిక ప్రకారం జాతీయ పోర్టబిలిటీ లావాదేవీలకు అర్హులు అని పునరుద్ఘాటించారు.  రేషన్ కార్డులు / లబ్ధిదారుల సెంట్రల్ రిపోజిటరీ ద్వారా ఈ విధానం ఎన్.‌ఐ.సి. చేత నిర్వహించబడుతుంది.  అంతేకాకుండా, పోర్టబిలిటీ లావాదేవీల వివరాలను సెంట్రల్ డాష్ బోర్డ్‌కు నివేదించడానికి అవసరమైన వెబ్-సేవలు కూడా ఈ రాష్ట్రాలకు తక్షణమే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా, ఈ  రాష్ట్రాల్లో 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'  ప్రణాళిక అమలుకు అవసరమైన సహాయాన్ని కూడా కేంద్ర ఎన్.‌ఐ.సి. బృందం నిరంతరం అందిస్తుంది.

2020 జూన్ నెలలో జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ లావాదేవీలను ప్రారంభించాలని శ్రీ పాశ్వాన్ ఈ రాష్ట్రాలన్నింటినీ అభ్యర్థించారు.  ఈ రాష్ట్రాలలోని లబ్ధిదారులకు జాతీయ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆహార ధాన్యాల కోటాను జాతీయ పోర్టబిలిటీ ద్వారా తక్షణమే అమలులోకి తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది.  ఈ విషయంలో, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులు మరియు ఎఫ్.పి.ఎస్. డీలర్లలో అవసరమైన అవగాహన కల్పించే ప్రయత్నాలు / కార్యకలాపాలు కూడా ప్రాధాన్యతపై చేపట్టవచ్చు.

****


(Release ID: 1628456) Visitor Counter : 410