విద్యుత్తు మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ వేళ 19000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అభ్యసన మరియు అభివృద్ధి అవకాశాల్ని మరింతగా చేరువ చేసిన ఎన్‌టీపీసీ
- ప్రపంచ బ్యాంక్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’తో సహా పలు ఇతర సంస్థలతో జట్టుకట్టిన మహారత్న
- శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆయా ధ్రువపత్రాలను అందజేసేలా చర్యలు
Posted On:
01 JUN 2020 2:37PM by PIB Hyderabad
విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తిదారు అయిన 'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్' (ఎన్‌టీపీసీ) లాక్‌డౌన్ సమయంలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నైపుణ్యతలను పెంపొందించుకొని మరింత దృఢంగా తయారయ్యేలా పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ -19 వేళ ఎన్‌టీపీసీ దాదాపు 19,000లకు పైగా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకూ అభ్యాసన అవకాశాలను చేరువ చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వేళ ఇంటెన్సివ్ డిజిటలైజేషన్ మరియు ఆన్‌లైన్ శిక్షణల ద్వారా ఉద్యోగుల విజ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఎన్‌టీపీసీ సంస్థ తన లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఎల్ అండ్ డి) వ్యూహాన్ని తాజా పరిస్థితులకు తగ్గట్టుగా అనుకూలీకరించింది.
వివిధ ప్రముఖ సంస్థలతో జట్టు..
ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఈ లెర్నింగ్ సేవలను పొందటానికి సంస్థ వీలు కల్పించింది. అంతే కాకుండా, సంస్థ తన సిబ్బంది వివిధ కఠిన ఆన్‌లైన్ సాంకేతిక కోర్సుల్లో స్థానం కల్పిండానికి, వర్చువల్ తరగతులకు హాజరు కావడానికి, తగి మదింపులను ఇవ్వడానికి మరియు శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువప్రతాలు అందజేసేందుకు ప్రపంచ బ్యాంకుతో జట్టుకట్టింది. ఎన్‌టీపీసీ అత్యున్నత ఎల్ అండ్ డీ కేంద్రమైన పవర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వివిధ రకాల సాంకేతిక అంశాలతో మొదలుకొని క్రియాత్మక, ఆరోగ్య మరియు భద్రతకు సంబంధించిన విభిన్న విభాగాల్లో 250కి పైగా శిక్షణా సెషన్లను నిర్వహించింది. దీనికి తోడు విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ ప్రాజెక్టులలో ఉన్న ఎన్‌టీపీసీ ప్రాంతీయ అభ్యాస మరియు అభివృద్ధి కేంద్రాలలోనూ దాదాపు 100కు పైగా ఆన్‌లైన్ అభ్యాస అవకాశాలను కల్పించింది.
వినూత్నంగా ‘45-డే లెర్నింగ్ ఛాలెంజ్’..
ఎన్‌టీపీసీ తన సిబ్బందిలో నైపుణ్యత పెంపొందించేందుకు వీలుగా నిరంతరాయంగా నెర్చుకొనే అవకాశం కల్పించేలా పలు తరగతులను ఏర్పాటు చేసింది. వివిధ ప్రత్యేక దృశ్యాల్ని ఏకకాలంలో పునరుద్ధరించడం మరియు అనుకూలీకరించే పద్ధతులందు నిరంతరాయంగా నేర్చుకునే సెషన్లను ఏర్పాటు చేయడం ద్వారా తన సిబ్బందిలోనూ నైపుణ్యతలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వపు
మహారత్న సంస్థ ఎన్‌టీపీసీ నిర్ణయించింది. సంక్షోభ సమయంలో సంస్థ నైపుణ్యతల పెంపు అవసరాన్ని గుర్తించి సంస్థ ఈ దిశగా తగిన చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ ‘45 -డే లెర్నింగ్ ఛాలెంజ్’ ను నిర్వహించింది. టెక్నికల్, ఫైనాన్స్ మరియు హెచ్ఆర్ వంటి విభిన్న విభాగాలలో 45 రోజుల పాటు తన సిబ్బందికి సమగ్రమైన అభ్యాసాన్ని అందించింది. ఇంటి వద్ద ఉంటూనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి తగు ధ్రువీకరణ పత్రాలను అందించేలా ఎన్‌టీపీసీ తగిన ప్రత్యేక సహకార కార్యక్రమాన్ని చేపట్టింది. సిబ్బంది అత్యాధునిక సెషన్లను అందించేందుకు గాను సంస్థ పలు ఇతర సంస్థలతో జట్టుకట్టింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సహకారంతో సంపూర్ణ సంక్షేమ కార్యక్రమం నిరంతరం కొనసాగించనుంది.
ఉద్యోగుల కుటుంబ సభ్యలకు ‘స్నేహల్ 2.0’ విస్తరణ..
ప్రస్తుత అనిశ్చితపు సమయంలోనూ అన్ని వయసుల ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకొని దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఆరు నెలల ప్రత్యేక చొరవలో భాగంగా.. సంస్థ ‘స్నేహల్ 2.0’ ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ విస్తరించింది. ఈఏపీ (ఎంప్లాయీస్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్) ద్వారా కౌన్సెలింగ్ సేవల ఆధారంగా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు దీనిని విస్తరించారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈఏపీ ఆయా సేవలను గోప్యంగా ఉంచడంతో పాటు ఎంపిక చేసిన వారికి మాత్రమే అందించబడుతుంది. అదేవిధంగా, పవర్ ప్లాంట్ అత్యవసరాలైన టర్బైన్, బాయిలర్, వాటర్ కెమిస్ట్రీ, పునరుత్పాదక ఇంధన మరియు ఇతర ముఖ్యమైన ఓ అండ్ ఎం (ఆపరేషన్స్ & మెయింటెనెన్స్) తదితర అంశాలపై అంతర్గత మరియు అతిథి అధ్యాపకుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించడమైంది. ఆన్‌లైన్ ఫోరమ్‌లు, వెబ్‌నార్లతో పాటుగా సంస్థ అంతర్గతంగా-అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ‘సంవాద్’ వంటి కొత్త అభ్యాస పద్ధతులతో పాటు.. ఇంటర్నెట్ మరియు అంతర్గత అభ్యాస పోర్టల్ ద్వారా కనెక్ట్ కావడం ద్వారా లబ్ధి పొందేందుకు వీలుగా సంస్థ పలు చర్యలను చేపట్టింది.
(Release ID: 1628447)
Visitor Counter : 279