ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జాతీయ ఎఐ పోర్టల్ - www.ai.gov.in ను ప్రారంభించి ఐటీ మంత్రి
స్కూలు విద్యార్థుల్లో ఎఐపై ఆదరణ పెంచడానికి ఉద్దేశించిన ఇంటెల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి
Posted On:
30 MAY 2020 7:20PM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో టెర్మ్ పాలనలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా జాతీయ ఎఐ పోర్టల్ - www.ai.gov.in ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, న్యాయ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ, ఐటీ పరిశ్రమలు కలిసి ఈ పోర్టల్ ను ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఈ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు. ఎఐకి సంబంధించి మన దేశంనుంచి వెలువడే సమస్త విషయాలు ఇందులోనే వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఇ- గవర్నెన్స్ విభాగం, నాస్కామ్ లు ఉమ్మడిగా నిర్వహిస్తాయి.
ఈ సందర్భంగా యువతకు పనికి వచ్చే విధంగా యువతకోసం బాధ్యతాయుతమైన ఎఐ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంబించారు. దేశంలోని యువత డిజిటల్ పరంగా ఎదగడానికి వీలుగా వారు భవిష్యత్ లో అన్ని విధాలుగా సిద్ధంగా వుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇంటెల్ ఇండియా కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహిస్తున్నాయి.
యువతకోసం బాధ్యతాయుతమైన ఎఐ అనే కార్యక్రమంద్వారా వారిలో నైపుణ్యాలను పెంచడం జరుగుతుంది. సామాజికంగా ప్రభావితం చూపే పరిష్కారాలను యువత కనుగొనడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు. తద్వారా వారు నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులుగా అవతరిచాలనేది లక్ష్యం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారతదేశం తప్పకుండా అగ్రభాగాన నిలవబోతుందని కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. యువతలో ఇంటర్ నెట్‌కు ఆదురణ పెరగడం, డాటా ఉపయోగం బాగా పెరుగుతుండడంవల్ల ఎఐ విషయంలో భారతదేశం ఈ రంగంలో ఉన్నతమైన రీతిలో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. భారతదేశ ఎఐ విధానం అనేది ప్రజలను సాధికారులను చేసే విధంగా వుంటుంది తప్ప వారిని నిరుపయోగులుగా చేసే విధంగా వుండదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు రంగాల్లో ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితులనుంచి గట్టెక్కించడానికి ఎఐని విరివిగా వాడడం జరుగుతోందని అన్నారు.
(Release ID: 1628251)
Visitor Counter : 262