మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రాథమిక విధుల పట్ల యువతలో చైతన్యం కల్పించడానికి పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈబిఎస్బి క్లబ్ " గుర్తు చేసుకోవాల్సిన ప్రాథమిక విధులు" అనే లఘు చిత్రాన్ని విడుదల చేసింది
28 రాష్ట్రాల నుండి 28 మంది విద్యార్థులు పాల్గొని, తమ ప్రాంతీయ భాష లోకి ప్రాథమిక విధులను అనువదించారు
Posted On:
31 MAY 2020 12:44PM by PIB Hyderabad
మన ప్రాథమిక విధుల గురించి యువతను చైతన్యపరిచేందుకు, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, భటిండా (సియుపిబి), “ప్రాథమిక విధులపై ఒక రిమైండర్” పేరుతో లఘు చిత్రాన్ని విడుదల చేసింది. ఎంహెచ్ఆర్డి, యుజిసి ఆదేశాల మేరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో, వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.కె. కోహ్లీ మార్గదర్శనంలో సియుపిబి ఇబిఎస్బి క్లబ్ రూపొందించింది. ఈ వీడియో లక్ష్యం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా మన చట్టబద్ధమైన విధులను పాటించమని ప్రోత్సహించడం, ప్రతి వ్యక్తి కోవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం జారీ చేసిన నివారణ మార్గదర్శకాలను అనుసరించడానికి ప్రేరేపించడం. అలాగే ప్రతి ఒక్కరు "సంకల్ప్ సే సిద్దీ కే ఓర్" ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం దీని ఉద్దేశం. ఈ వీడియోలో, దేశవ్యాప్తంగా 28 వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 28 సియుపిబి ఇబిఎస్బి క్లబ్ విద్యార్థి వాలంటీర్లు పాల్గొని తమ రాష్ట్రాల ప్రాంతీయ భాషలలో ప్రాథమిక విధులను అనువదించారు.
https://twitter.com/EBSB_MHRD/status/1265896852232134656
****
(Release ID: 1628187)
Visitor Counter : 336