వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో దేశమంతా విస్తారంగా ప్రతి ఒక్కరికీ, ఉచిత ఆహార ధాన్యాలను రవాణా చేయడానికి, పంపిణీకి భారీ కసరత్తు, గత ఒక సంవత్సరంలో మంత్రిత్వ శాఖ సాధించిన అతిపెద్ద విజయం: శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు దిశగా ప్రగతి .. ఈ రెండూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహరం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సాధించిన ప్రధాన విజయాలు, కార్యక్రమాలలో ఒకటని వెల్లడించిన మంత్రి

Posted On: 30 MAY 2020 5:53PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గత ఏడాది కాలంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, కార్యక్రమాలను వివరించారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల రవాణా, పంపిణీని ప్రభుత్వం భరోసాగా  ఇవ్వడం అతిపెద్ద విజయమని అన్నారు. 

వినియోగరుల పరిరక్షణ చట్టం, 2019, సిడబ్ల్యుసి అత్యధిక టర్నోవర్ సాధించిందని, ఎఫ్‌సిఐ అధీకృత మూలధనాన్ని రూ .3,500 కోట్ల నుంచి రూ .10 వేల కోట్లకు పెంచడం, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వైపు మార్చ్ సాధించటం వంటివి తమ మంత్రిత్వ శాఖ గడచినా ఏడాది సాధించిన వాటిలో ముఖ్యమైనవని శ్రీ పాశ్వాన్  అన్నారు.

కోవిడ్-19 సంక్షోభ సమయంలో దేశంలో పెరిగిన డిమాండ్‌ను నెరవేర్చడానికి బఫర్ స్టాక్‌లో తగినంత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయని శ్రీ పాశ్వాన్ అన్నారు. 2020 మే 28 నాటికి ఎఫ్‌సిఐలో  272.29 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్‌ఎమ్‌టి) బియ్యం, 479.40 ఎల్‌ఎమ్‌టి గోధుమలు ఉన్నాయని మంత్రి తెలియజేశారు. అందువల్ల, మొత్తం 751.69 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యం నిల్వ అందుబాటులో ఉంది (గోధుమలు మరియు వరి కొనుగోలును మినహాయించి, ఇవి ఇంకా గోడౌన్‌కు చేరుకోలేదు).

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రాష్ట్రాలు / యుటిలు ఇప్పటికే 2.06 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను వినియోగించుకున్నట్టు శ్రీ పాశ్వాన్ తెలిపారు. పంపిణీ ప్రారంభమైంది, షెడ్యూల్‌లో పూర్తవుతుందని అయన అన్నారు.

"ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్" ప్రణాళిక ప్రకారం ఎన్ఎఫ్ఎస్ఎ రేషన్ కార్డుల హోల్డర్ల జాతీయ పోర్టబిలిటీని ప్రవేశపెట్టినట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు. 2021 జనవరి నాటికి ఈ పథకం కింద ఆధార్‌ 100% రేషన్ కార్డులతో అనుసంధానం అయ్యేలా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

భారతా ఆహార సంస్థ అధీకృత మూలధనాన్ని రూ.3,500 కోట్ల నుండి రూ.10,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. 

కేంద్ర గిడ్డంగుల సంస్థ అత్యధికంగా రూ.1710 కోట్ల టర్న్ ఓవర్ సాధించినట్టు ఆయన చెప్పారు

రూ .125,05.34 లక్షలు ఉన్న రుణ దరఖాస్తులు ఆమోదించబడ్డాయి, 01.04.2019 నుండి 31.03.2020 వరకు 15 చక్కెర కర్మాగారాలకు రూ .188,58.91 లక్షల రుణాన్ని పంపిణీ చేసినట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు

దేశవ్యాప్తంగా 165 డిస్టిలరీలు మరియు 962 స్వతంత్ర తయారీదారులకు హ్యాండ్-శానిటైజర్లను ఉత్పత్తి చేయడానికి లైసెన్సులు ఇచ్చినట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు, దీని ఫలితంగా 87,20,262 లీటర్ల హ్యాండ్-శానిటైజర్ల ఉత్పత్తి (11.5.2020 నాటికి) జరిగింది. 

వినియోగదారుల పరిరక్షణ బిల్లు, 2019 లోక్‌సభలో, రాజ్యసభ లో 30.07.2019, 06.08.2019 న ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి తన అంగీకారం ఇచ్చారుకన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 ను అధికారిక గెజిట్‌లో 09.08.2019 న ప్రచురించారు.

***** 



(Release ID: 1628071) Visitor Counter : 175