రైల్వే మంత్రిత్వ శాఖ
"శ్రామిక్ రైళ్ల" గురించిన ప్రణాళిక, సమన్వయాల్ని మరింత పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించిన రైల్వే శాఖ
- లాక్‌డౌన్ కారణంగా ఒంటరిగా మిగిలిపోయిన వారిని రైలు మార్గం ద్వారా తరలించేందుకు అంచనా వేసి డిమాండ్‌ను తగు విధంగా విభజించి నిర్ధారించాలి
- ఆయా ప్రాంతాలలోని నిలిచిపోయిన వారిని తరలించేందుకు గాను అవసరమైన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సంఖ్యను రాష్ట్రాలు సూచించాలి
- ఈ తరహా రైళ్ల కదలిక కోసం తాత్కాలిక షెడ్యూళ్లనూ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలి
- భవిష్యత్తులో ఏవైనా అవసరాల నిమిత్తం అదనపు శ్రామిక్ స్పెషల్ రైళ్లను అందించడానికి భారత రైల్వే సిద్ధంగా ఉంది
Posted On:
30 MAY 2020 6:47PM by PIB Hyderabad
శ్రామిక్ రైళ్ల అవసరం గురించిన సరైన ప్రణాళిక మరియు సమన్వయాన్ని నిర్ధారించాలని రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించింది. కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని రైలు మార్గంలో తరలించేందుకు అంచనా వేసిన డిమాండ్‌ను
తగు విధంగా నిర్ధారించి దానిని తగు విధంగా విభజించాలని భారతీయ రైల్వే కోరింది. దేశంలో విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు, ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్ తదితర అవసరమైన సరుకులను రవాణా చేసే అత్యంత రద్దీ కలిగిన రవాణా కారిడార్లలో “శ్రామిక్ స్పెషల్స్” రైళ్లు
నడుస్తున్నాయి.అత్యవసరాల సరఫరా నిరంతరాయంగా కొనసాగించేలా చూసేందుకు గాను రైల్వే అధిక స్థాయిలో సరుకులను లోడ్ చేస్తోంది. ఇదే సమయంలో భారతీయ రైల్వే వ్యవసాయపు ఉత్పత్తులు, ఔషధాలు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులను దేశ ప్రజలకు అందించడానికి పెద్ద సంఖ్యలో టైమ్-టేబుల్ పార్శిల్ రైళ్లను నడిపింది. "శ్రామిక్ స్పెషల్స్" కోసం రాష్ర్టాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రైల్వే తగిన ర్యాకులను అందుబాటులో ఉంచగలిగింది. అయితే చాలా
సార్లు ప్రయాణీకులను స్టేషనుకు తీసుకురాలేకపోవడం కారణంగా నోటిఫైడ్ రైళ్లు రద్దు చేయబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు వలసదారులను పంపే రాష్ట్రాలకు తగిన సమ్మతి ఇవ్వడం లేదు. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ఆయా రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో వలస కార్మికుల రవాణాను నిరోధించాయి.
54 లక్షల మంది తరలింపు..
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) 01.05.2020 మరియు 19.05.2020 తేదీలలో జారీ చేసిన ఆదేశాల మేరకు భారతీయ రైల్వే రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆయా రాష్ట్రాలలో నిలిచిపోయిన వేలాది మంది వలసదారుల ప్రయాణం కోసం శ్రామిక్ ప్రత్యేక రైలు సర్వీసుల్ని నడుపుతోంది. ఇప్పటి వరకు దాదాపు 4000 ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా సుమారు 54 లక్షల మంది వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారు వలసదారులను వారి గమ్యస్థానపు రాష్ట్రాలకు రవాణా చేసింది. హోం మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ వీరి తరలింపు కార్యక్రమం
ముందుకు సాగుతోంది. ఒంటరిగా చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు పంపే రాష్ట్రాల నుండి
ఈ రోజు వరకు వచ్చిన అన్ని అభ్యర్థనలను రైల్వే సమకూర్చగలిగింది. అనేక రాష్ట్రాలిప్పుడు వారి అవసరాలను క్రమంగా తగ్గించేస్తుండడంతో ప్రయాణికుల తరలింపునకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశకు చేరిందనే సూచిస్తోంది.
శ్రామిక్ రైళ్లలో దాదాపు 75% రైళ్లు రెండు రాష్ర్టాల వైపే..
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో దాదాపు 75% రైళ్లు ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ వైపునకు బయలుదేరి వెళ్లగా మిగతా రైళ్లు చాలా వరకు తూర్పు భారత దేశం వైపు వెళ్తుండడాన్ని గమనించవచ్చు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఇటువంటి రైళ్లను నిర్వహించడం ద్వారా అంతర్-రాష్ట్ర ప్రజా రవాణా యొక్క అవసరాలను తీర్చడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు భారత రైల్వే ముందుకు వచ్చింది. గౌరవనీయ సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ అంచనా వేసిన కాల వ్యవధి మరియు ఒంటరిగా ఉన్న కార్మికులందరి రవాణా ప్రణాళికను గురించి తెలియజేయాలని కోరింది. మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పంపిన లేఖలో రైల్వే యొక్క నామినేటెడ్ నోడల్ అధికారులు ఆయా రాష్ట్రాలతో సంభాషిస్తూ సుమారుగా రైళ్ల అవసరాలపై అంచనాలను రూపొందిస్తున్నారు. శ్రామిక్ ప్రత్యేక రైళ్ల అవసరాల యొక్క లక్ష్యం అంచనాను రూపొందించడం అవసరం.
అధికారిక సమాచారం పంపాలి..
తరలింపు ప్ర్రక్రియలో సొంత ప్రాంతాలకు వెళ్లలేక చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు గాను అవసరమైన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సంఖ్యను, తాత్కాలిక షెడ్యూలుతో సహా అధికారిక కమ్యూనికేషన్ ద్వారా రాష్ర్టాలు తెలియ జేయాలని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అంచనా వేసిన అవసరాన్ని బట్టి నోడల్ అధికారులతో సంప్రదించి భారతీయ రైల్వే శ్రామిక్ రైళ్లను వెనువెంటనే షెడ్యూల్ చేస్తుందని తెలిపింది. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు అదనపు శ్రామిక్ స్పెషల్ రైళ్లను అందిస్తామని భారత రైల్వే హామీ ఇచ్చింది.
(Release ID: 1628018)
Visitor Counter : 266