జల శక్తి మంత్రిత్వ శాఖ

2020-21 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ ‌లో జల్ జీవన్ మిషన్ అమలు కోసం 445 కోట్ల రూపాయలు మంజూరు చేసిన - భారత ప్రభుత్వం.

Posted On: 29 MAY 2020 7:23PM by PIB Hyderabad

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం 2020-21 సంవత్సరానికి వారి వార్షిక కార్యాచరణ ప్రణాళికను జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిశీలన మరియు ఆమోదం కోసం సమర్పించింది.  2024 నాటికి దేశవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన సమృద్ధిగా నాణ్యమైన త్రాగునీటిని అందించాలానే ఉద్దేశ్యంతో జల్ శక్తి మంత్రిత్వశాఖ కింద జల్ జీవన్ మిషన్ ప్రారంభించడం జరిగింది.  ఈ పథకానికి 3.60 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. 

గ్రామీణ జీవితాల్లో ఎంతో మార్పును తీసుకువచ్చే ఈ కార్యక్రమం కింద, 2023-24 నాటికి రాష్ట్రవ్యాప్తంగా నూరు శాతం గృహాలకు ట్యాప్ వాటర్ కనెక్షన్ (ఎఫ్.హెచ్.‌టి.సి.) కలిగి ఉండాలని ఛత్తీస్ గఢ్ రాష్ట్రం యోచిస్తోంది.  రాష్ట్రంలోని మొత్తం 45 లక్షల గృహాల్లో, 20 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించాలని నిర్ణయించారు.  రాష్ట్రవ్యాప్తంగా  ఇంటికీ ఈ సదుపాయం కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసే సమయంలో, నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నాణ్యమైన స్వచ్ఛమైన మంచినీరు లభ్యంకాని ప్రాంతాలు, ఎస్సీ / ఎస్టీ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాలు, గ్రామాలు, ఆశాజనక జిల్లాలు, సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన గ్రామాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుకు భారత ప్రభుత్వం 445 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిఘాపై రాష్ట్రం ప్రాధాన్యత ఇస్తోంది.  చాలా సంవత్సరాల నుండి నీటిలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఐరన్ మొదలైన వాటి యొక్క వేగవంతమైన భూగర్భ జలాల క్షీణత మరియు రసాయన కాలుష్యం సమస్యలతో ఛత్తీస్ ‌గఢ్ పోరాడుతోంది; అందువల్ల, ఇక్కడ పరిస్థితిని తెలుసుకుని, ఈ నివాసాలలో త్రాగునీటిని అందించేలా చూడాలని రాష్ట్రానికి సూచించారు.  జల్ జీవన్ మిషన్ కింద, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ  చురుకుగా పాల్గొనడం ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటి నాణ్యతను పరీక్షించడానికి క్షేత్ర స్థాయి పరీక్షా పరికరాలను ఉపయోగించాలని, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ప్రోత్సహిస్తున్నారు.

ప్రతి గ్రామ పంచాయతీ, జి.పి. లేదా వారి ఉప కమిటీలో అనగా  గ్రామ స్థాయిలో ప్రణాళిక కోసం గ్రామ నీటి, పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేశారు.  గ్రామాల కోసం గ్రామ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, వీటి ఆధారంగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.  నీటి వనరుల బలోపేతం, జలాశయాల రీఛార్జ్, గ్రే నీటి నిర్వహణ మొదలైన పనులను చేపట్టడానికి ఎం.జి.ఎన్.‌ఆర్.ఈ.జి.ఎస్., గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్లు, ఎస్‌.బి.ఎం., వంటి వివిధ వనరుల నుండి నిధుల కలయికకు  రాష్ట్రం భరోసా ఇస్తోంది. 

నీటి వనరుల బలోపేతం, ఆక్విఫెర్ రీఛార్జ్, గ్రె నీటి నిర్వహణ మొదలైన పనులను చేపట్టడానికి ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్లు, ఎస్‌బిఎం, వంటి వివిధ వనరుల నుండి నిధుల కలయికను రాష్ట్రం భరోసా ఇస్తుంది.  సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాలు తమ ఇంటి ప్రాంగణంలో ట్యాప్ కనెక్షన్ల ద్వారా నీటిని పొందాలనీ, మరియు వీధి కుళాయిల వద్ద  గంటల తరబడి నిలబడకుండా, సామాజిక దూరం నిబంధన ఖచ్చితంగా పాటించేలా ఉండాలనీ, తద్వారా గ్రామీణ సమాజాలు సంక్రమణకు గురికాకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. .

వేసవికాలం పూర్తిస్థాయిలో, రుతుపవనాలు సమీపిస్తున్నాయి, మరియు కోవిడ్-19 మహమ్మారి దేశంలో విస్తరించడంతో, వారి స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు జీవనోపాధి కల్పించడం మరింత అవసరం.  ఈ వలస కూలీల్లో ప్రాథమికంగా నైపుణ్యం కలవారు, పాక్షిక నైపుణ్యం కలిగినవారు ఉన్నారు. ప్రతి గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన ప్లంబింగ్, ఫిట్టింగ్, నీటి సంరక్షణ మొదలైన పనులకు సంబంధించిన ఉద్యోగాలను అందించడం ద్వారా గ్రామాల్లో వారి సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. నీటి భద్రత, వ్యవసాయానికి నీటి లభ్యత మరియు ముఖ్యంగా ప్రతి గ్రామీణ గృహాలకు తాగునీటిని అందించడంలో వీరి సేవలను ఉపయోగించుకోవచ్చు. 

*****



(Release ID: 1627847) Visitor Counter : 238