ఆర్థిక సంఘం
విద్యుత్ రంగ సంస్కరణలపై విద్యుత్ మంత్రిత్వ శాఖతో సమావేశం నిర్వహించిన - ఆర్థిక కమిషన్.
Posted On:
29 MAY 2020 6:34PM by PIB Hyderabad
శ్రీ ఎన్.కే.సింగ్ నేతృత్వంలోని ఆర్థిక కమిషన్, దాని సభ్యులు మరియు ఉన్నతాధికారులతో సహా ఈ రోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ను కలిసి, రాష్ట్రాల్లో విద్యుత్ రంగ సంస్కరణలకు సంబంధించిన సమస్యలపై సవివరంగా చర్చలు జరిపారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక కమిషన్ తన నివేదికలో విద్యుత్ రంగంపై చేసిన సిఫారసులకు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.
2021-2026 ఆర్థిక సంవత్సరానికి కమిషన్ యొక్క తదుపరి నివేదికకు ముందుగానే మరియు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్ లు) కు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చేసిన 90,000 కోట్ల రూపాయల లిక్విడిటీ ఇంజెక్షన్ ప్రకటనను పరిగణలోకి తీసుకుని కమీషన్ ఈ సిఫార్సులు చేయడం జరిగింది. విద్యుత్ డిస్కామ్‌ల యొక్క ఆర్ధికవ్యవస్థను ఇది విస్తరించింది. కరోనావైరస్ లాక్‌డౌన్ వల్ల సంభవించిన ఆర్ధిక అంతరాయాన్ని ఎదుర్కోవటానికి ఐదు ట్రాన్చెస్‌లో చేపట్టిన మొదటి 15 చర్యలలో ఇది ఒకటి. విద్యుత్ రంగ సంస్కరణలను వేగవంతం చేయడంలో మరియు విద్యుత్ రంగాన్ని స్థానికంగా దెబ్బతీసే సమస్యలను పరిగణలోకి తీసుకోవడంలో ప్రధానమంత్రి ప్రాధాన్యతను ఆర్థిక మంత్రి ప్రకటన ప్రతిబింబించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మరియు దాని యొక్క ఆర్థిక పరిణామాల మధ్య విద్యుత్ వ్యవస్థ యొక్క నిర్మాణాలలో ప్రస్తుత డిస్‌కనెక్ట్‌ను విద్యుత్ మంత్రి కమిషన్‌కు వివరించారు. వీటిని డిస్కామ్‌లు భరించడంతో అవి నష్టాలకు దారితీస్తున్నాయి. పూర్తిగా తమ యాజమాన్యంలో ఉన్న డిస్కామ్‌ల ఆర్థిక పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరాన్ని మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ దిశగా ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణ పరిమితులు, ఈ బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవడానికి క్రమాంకనం చేయాల్సిన అవసరం ఉంది. డిస్కామ్‌లు ఎవరి నియంత్రణలో పనిచేస్తాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను ఇది తెరపైకి తెస్తుంది. ఆర్థిక పారదర్శకత తో పాటు, డిస్కామ్‌లకు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మరియు యాజమాన్య పరమైన బాధ్యతాయుత ప్రవర్తనను కూడా ఇది తెర పైకి తెస్తుంది.
డిస్కామ్‌లకు పూర్వవైభవం కోసం చేపడుతున్న సంస్కరణలను గురించి మంత్రి కమిషన్‌కు వివరించారు. ఆమోదం కోసం పరిశీలనలో ఉన్న కొత్త టారిఫ్ విధానం ఇందులో ఉంది. ఇందులో విద్యుత్ రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే సంస్కరణలు ఉన్నాయి. 2003 విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించబడ్డాయి. మంత్రిత్వ శాఖ యొక్క పాత పథకాలను కొత్త పథకంగా విలీనం చేస్తున్నట్లు మంత్రి కమిషన్‌కు తెలియజేశారు. ఇందు కోసం ఐదేళ్ల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల మేర సహాయం అందించాలని కమిషన్ను కోరారు. ఈ పథకం ప్రధానంగా నష్టాలను తగ్గించే చర్యలు, వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్ మరియు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లపై దృష్టి పెడుతుంది.
నియంత్రణ స్వాధీనం, ఆర్థికపరమైన ఇంజనీరింగ్, సంస్కరణల సుస్థిరత మొదలైన అంశాలపై విద్యుత్ రంగంలో అమలుచేస్తున్న వివిధ చర్యలపై విద్యుత్ మంత్రిత్వ శాఖకు ఉపయోగకరమైన సూచనలు, సలహాలు అందజేసినందుకు చైర్మన్ మరియు సభ్యులు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని అభినందించారు.
2016-17లో ఉజ్వల్ డిస్కామ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) అమలు చేసిన తరువాత, చాలా రాష్ట్రాలు కొంతవరకు వాటి మొత్తం సాంకేతిక మరియు వాణిజ్య (ఏ.టి.&సి.) నష్టాలను తగ్గించాయని మరియు సగటు సరఫరా వ్యయం మరియు సగటు వాస్తవిక ఆదాయం (ఏ.సి.ఎస్.-ఏ.ఆర్.ఆర్.) మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాయని, 15వ ఆర్ధిక సంఘం 2020-21 ఆర్ధిక సంవత్సరం కోసం తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఏదేమైనా, విద్యుత్ రంగంలో దైహిక సమస్యలను తగిన విధంగా పరిష్కరించకపోతే పురోగతి స్థిరమైనదిగా కనిపించదు. ఇంతవరకు చర్చించుకున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ రంగం పరిస్థితిని మెరుగుపరిచేందుకు బలమైన మరియు దైహిక సంస్కరణలు అవసరమని మంత్రి మరియు కమిషన్ అభిప్రాయపడ్డారు.
తన చర్చల సమయంలోనూ, మరియు దాని తుది నివేదికను తయారుచేసేటప్పుడు, మంత్రిత్వ శాఖ సూచనలను పూర్తిగా పరిగణ లోకి తీసుకోవడం జరుగుతుందని కమీషన్ ఈ సందర్భంగా విద్యుత్ మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చింది.
******
(Release ID: 1627770)
Visitor Counter : 248