విద్యుత్తు మంత్రిత్వ శాఖ
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ సమావేశం
లడఖ్‌లో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు సమర్పణ
మూడు జల విద్యుత్, ఒక సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని వెల్లడి
Posted On:
29 MAY 2020 6:38PM by PIB Hyderabad
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో జల, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేసే చర్యలు మొదలయ్యాయి. జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సీఎండీ శ్రీ ఎ.కె.సింగ్, దిల్లీలోని జమ్ము&కశ్మీర్ భవన్‌లో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కె.మాథుర్‌తో సమావేశమయ్యారు. లెహ్-లడఖ్ ప్రాంతంలో జల, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలు, కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
లడఖ్ ప్రాంతంలో జల విద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఎన్‌హెచ్‌పీసీ ఘనతను ఎ.కె.సింగ్ ఈ సమావేశంలో వివరించారు. లెహ్‌లో 45 మెగావాట్లు, కార్గిల్‌లో 44 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి చెప్పారు. లెహ్‌లోని కాల్సిలో 80 మెగావాట్లు, కనైవుంచేలో 45 మెగావాట్లు, తక్మాచింగ్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టులు, పైయాంగ్‌లో 50 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల సాంకేతిక-వాణిజ్య సాధ్యాసాధ్యాలను వివరిస్తూ.. లడఖ్ ప్రాంతంలో సౌర వెలుగుల వికిరణ ప్రయోజనాన్ని పొందడం; జల, సౌర విద్యుత్ ప్రాజెక్టులను కలపడం వంటి ప్రతిపాదనలను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె.మాథుర్ ఎదుట ఎ.కె.సింగ్ ఉంచారు.
రెండు జల విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి, కఠిన పరిస్థితుల్లోనూ వాటిని సాఫీగా నడుపుతున్న ఎన్‌హెచ్‌పీసీని లెఫ్టినెంట్ గవర్నర్ అభినందించారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుల సాంకేతిక-వాణిజ్య సాధ్యాసాధ్యాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె.మాథుర్ హామీ ఇచ్చారు.
(Release ID: 1627766)
Visitor Counter : 214