రక్షణ మంత్రిత్వ శాఖ
సైనిక కంమాండర్ల సదస్సు 2020 మే నెల 27, 28, 29 తేదీలలో జరిగింది.
Posted On:
29 MAY 2020 4:48PM by PIB Hyderabad
2020 ఏప్రిల్ నెలలో జరగవలసిన, అత్యున్నత స్థాయి ద్వైవార్షిక కార్యక్రమమైన సైనిక కమాండర్ల సదస్సు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడి, ఇప్పుడు రెండు దశల్లో నిర్వహించబడుతోంది. ఇది ఊహాత్మక స్థాయి చర్చను సులభతరం చేస్తూ, ముఖ్యమైన విధాన నిర్ణయాలతో ముగుస్తుంది. ఈ సదస్సు మొదటి దశ 2020 మే నెల 27, 28, 29 తేదీలలో న్యూ ఢిల్లీ లోని సౌత్ బ్లాక్ లో జరిగింది.
ఈ మూడు రోజులలో, భారత సైన్యానికి చెందిన అత్యున్నత నాయకత్వం ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్లకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. వీటితో పాటు, మానవ వనరుల నిర్వహణ సమస్యలు, మందుగుండు సామగ్రి నిర్వహణకు సంబంధించిన అధ్యయనాలు, సహ-శిక్షణా సంస్థల విలీనంతో పాటు, సైనిక శిక్షణ డైరెక్టరేట్‌ను, హెచ్.క్యూ. సైనిక శిక్షణా కమాండ్‌తో విలీనం చేయడం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైనిక సంక్షేమ గృహ నిర్మాణ సంస్థ (ఏ.డబ్ల్యూ.హెచ్.ఓ.) తో పాటు, సైనిక సంక్షేమ విద్యా సంస్థ (ఏ.డబ్ల్యూ.ఈ.ఎస్.) ల గవర్నర్ల మండలి సమావేశాలు కూడా నిర్వహించారు.
ఈ సదస్సు రెండవ దశ సమావేశాలు 2020 జూన్ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరుగుతాయి. ఈ రెండవ దశలో డి.ఎం.ఎ. & డి.ఓ.డి. తో పరస్పర చర్చలతో పాటు, కమాండ్ హెడ్ క్వార్టర్స్ సూచించిన ఎజెండాపై చర్చలు జరుగుతాయి. అదేవిధంగా లాజిస్టిక్స్ మరియు పరిపాలనా సమస్యలపై కొనసాగుతున్న అధ్యయనాలపై కూడా చర్చలు ఉంటాయి. ఈ దశలో గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి తో పాటు సి.డి.ఎస్. కూడా సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంది.
***
(Release ID: 1627709)
Visitor Counter : 336