రైల్వే మంత్రిత్వ శాఖ

30 ప్రత్యేక రాజధాని స్పెషల్ రైళ్ళు మరియు 200 స్పెషల్ మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు (మొత్తం 230 రైళ్ళు)కు సంబంధించిన 12.05.2020 మరియు 01.06.2020 నుంచి అమలులో ఉన్న సూచనలను సవరించిన భారతీయ రైల్వే

· నోటిఫై చేసిన అన్ని ప్రత్యేక రైళ్ళ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ఎ.ఆర్.పి)ని 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలని నిర్ణయించిన రైల్వే మంత్రిత్వ శాఖ

· ఈ 230 రైళ్ళలో పార్సిల్ మరియు సామాను బుకింగ్ అనుమతించబడుతుంది.

· పై మార్పులు రైలు బుకింగ్ తేదీ 2020 మే 31, 8 గంటల నుంచి అమల్లోకి వస్తాయి

Posted On: 28 MAY 2020 9:00PM by PIB Hyderabad

2020 మే 12 నుంచి మొదలైన 30 ప్రత్యేక రాజధాని రకం రైళ్ళ కోసం, 2020 జూన్ 1 నుంచి మొదలు కానున్న 200 స్పెషల్ మెయిల్ ఎక్స్ ప్రెస్ కోసం ఇచ్చిన సూచనలను భారతీయ రైల్వే సవరించింది. వీటిపై అన్ని స్పెషల్ అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధి(ఎ.ఆర్.పి)ని 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ 230 రైళ్ళలో పార్సిల్ మరియు సామాను బుకింగ్ కూడా అనుమతించబడుతుంది.

నోటిఫై చేసిన అన్ని స్పెషల్స్ అడ్వాన్స్

పై మార్పులు 2020 మే 31 ఉదయం 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. అదే విధంగా ఇతర నిబంధనలు అంటే ప్రస్తుత బకింగ్, తత్కాల్ కోటా, రోడ్ సైడ్ స్టేషన్లకు సీట్ల కేటాయింపు మొదలైనవి రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్ళలో మాదిరిగానే ఉంటాయి.

ఈ సూచనలను ట్రాఫిక్ కమర్షియల్ డెరక్టరేట్ లోని వాణిజ్య సర్క్యులర్ కింద భారతీయ రైల్వే వెబ్ సైట్ www.indianrailways.gov.in లో చూడవచ్చు. 

 

--



(Release ID: 1627613) Visitor Counter : 194