మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

45,000 ఉన్నత విద్యా సంస్థల అధిపతులతో న్యూఢిల్లీ నుండి వెబి‌నార్ ద్వారా సంభాషించిన - కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి.

ఎన్.ఏ.ఏ.సి. గుర్తింపు ప్రక్రియలో పాల్గొనాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలను కోరిన - శ్రీ నిశాంక్.


కోవిడ్- 9 కారణంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తలెత్తే విద్యార్థుల వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని తప్పక నెలకొల్పాలని అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించిన - శ్రీ నిశాంక్.

Posted On: 28 MAY 2020 7:37PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు దేశవ్యాప్తంగా 45,000 కు పైగా ఉన్నత విద్యాసంస్థల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ వెబినార్ ను బెంగుళూరుకు చెందిన జాతీయ మదింపు మరియు గుర్తింపు మండలి (ఎన్.ఏ.ఏ.సి.) నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు వైస్ ఛాన్సలర్లు, రిజిష్ట్రార్లు, ప్రొఫెసర్లు, ఐ.క్యూ.ఏ.సి. అధిపతులు, ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులతో కూడిన విద్యావేత్తలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు, వారితో సంభాషించారు. 

మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఎన్‌.ఏ.ఏ.సి చేపట్టిన కార్యక్రమాలను శ్రీ పోఖ్రియాల్ ప్రశంసించారు. వ్యవస్థలో పరిమితులను అధిగమించే అవకాశంగా ప్రస్తుత పరిస్థితులను పరిగణించాలని దేశంలోని హెచ్.‌ఇ.ఐ.లకు  ఆయన పిలుపునిచ్చారు. విద్యావంతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్ పద్ధతికి మారాలనీ, అదేవిధంగా అకాడెమిక్ సెషన్‌కు అంతరాయం కలగకుండా ఉండటానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులు మరియు హెచ్.ఈ.ఐ. ‌లకు పిలుపునిచ్చారు.

భారతదేశంలో ఆన్‌ లైన్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉందనీ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్ ‌లైన్ విద్య మరింతగా విస్తరించేలా విద్యావేత్తలు తోడ్పడాలని ఆయన కోరారు

https://twitter.com/DrRPNishank/status/1265938551075532802?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1265938551075532802&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1627487  

దాదాపు గంటకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, అకడమిక్ క్యాలెండర్, ఆన్ ‌లైన్ విద్య, పరీక్షలు, ఫీజులు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యార్థుల సమస్యలు, ఫెలోషిప్‌లు, నీట్, ప్రవేశ పరీక్షలు మొదలైన వాటికి సంబంధించి, విద్యావేత్తలు లేవనెత్తిన వివిధ సమస్యలు మరియు ఆందోళనలపై కేంద్ర మంత్రి ప్రతి స్పందించారు.  స్వయం ప్రభ, దీక్షారంభ్, పరామర్ష్ సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల గురించి, అదేవిధంగా, మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో తీసుకున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాల గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు.  ఎన్.ఏ.ఏ.సి. గుర్తింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆయన అన్ని ఉన్నత విద్యా సంస్థలను కోరారు.   భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉన్నత విద్యా సంస్థల శ్రేయస్సు గురించి చాలా ఎక్కువగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థినీ, విద్యార్థుల విద్యా కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించడానికి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కోవిడ్-19 కారణంగా తలెత్తే ప్రత్యేక పరిస్థితులవల్ల అకాడెమిక్ క్యాలెండర్ కు, పరీక్షలకు సంబంధించి, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఒక సాధికార ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి అన్ని విశ్వవిద్యాలయాలను కోరారు.  విద్యార్థులు ఎదుర్కొనే వివిధ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా యు.జి.సి. లోనూ మరియు ఎన్.సి.ఈ.ఆర్.‌టి. లోనూ ఒక టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.   సంక్షోభ సమయంలో విద్యార్థులకు అవసరమైన పూర్తి సహాయం అందించడానికి తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని శ్రీ నిశాంక్ హామీ ఇచ్చారు. నూతన విద్య సంవత్సరం ఎలా ప్రారంభమవుతుందనే ప్రక్రియను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు. అదే సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.

విద్యా సమాజానికి చెందిన వారందరినీ శ్రీ నిశాంక్ కరోనా యోధులుగా సంబోధించారు. ఎందుకంటే ఈ అసాధారణ పరిస్థితిలో వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 24 గంటలూ పనిచేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో యు.జి.సి.  చైర్మన్ ప్రొఫెసర్ డి.పి. సింగ్, ఎన్‌.ఏ.ఎ.సి చైర్మన్, ఈ.సి. ప్రొఫెసర్ వీరేందర్ ఎస్.చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఎన్.ఏ.ఏ.సి. డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.సి. శర్మ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు మరియు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

*****


(Release ID: 1627573) Visitor Counter : 330