వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఉత్తర భారతదేశం అంతటా మిడుతల దండు ఉద్ధృతితో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నియంత్రణ కార్యకలాపాలు వేగవంతం
సర్వే, నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 200 లోకస్ట్ సర్కిల్ కార్యాలయాలు, తాత్కాలిక శిబిరాలు
యుకె నుండి అదనంగా 60 స్ప్రేయర్లను సేకరించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి ఆమోదం; త్వరలో డ్రోన్లను మోహరింపు
Posted On:
27 MAY 2020 8:42PM by PIB Hyderabad
పశ్చిమ మరియు వాయువ్య భారతదేశం అంతటా మిడుత దాడి ప్రభావిత రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డిఎసి & ఎఫ్ డబ్ల్యూ) మిడుత నియంత్రణ కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఈనాటికి, బార్‌మెర్, జోధ్‌పూర్, నాగౌర్, బికానెర్, గంగానగర్, హనుమన్‌ఘర్, సికార్, రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లోని సత్నా, గ్వాలియర్, సీదీ, రాజ్ ఘర్, బైతుల్, దేవాస్, అగర్ మాల్వా జిల్లాల్లో అపరిపక్వ మిడుతలు ఉన్నాయి.
ప్రస్తుతం 200 లోకస్ట్ సర్కిల్ కార్యాలయాలు (ఎల్‌సిఓ) బాధిత రాష్ట్రాల జిల్లా పరిపాలన, వ్యవసాయ క్షేత్ర యంత్రాంగాల సమన్వయంతో సర్వే & నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్ లో 21 జిల్లాలు, మధ్యప్రదేశ్ లో 18 జిల్లాలు, గుజరాత్ లో రెండు, పంజాబ్ లో ఒక జిల్లా ప్రస్తుతం మిడతల నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 303 ప్రదేశాలలో 47,308 హెక్టార్ల ప్రాంతంలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు జరిగాయి.
సాధారణంగా, మిడుత సమూహాలు జూన్ / జూలై నెలలలో రుతుపవనాల ఆగమనంతో వేసవి పెంపకం కోసం పాకిస్తాన్ ద్వారా భారతదేశ షెడ్యూల్డ్ ఎడారి ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. గత సీజన్లో వచ్చి ఉండిన పాకిస్తాన్ లో మిగిలి ఉన్న్డ మిడుతలు అప్పటికే ఉన్నందున చాలా ముందుగానే ఈ సంవత్సరం, మిడుత దండు, చిన్నపురుగుల సమూహాల విరుచుకు పడ్డాయి. గత సీజన్లో వాటిని సరిగా నియంత్రించకపోవడం వల్ల ముందుగగానే అక్కడ ఈ పరిస్థితి దాపురించింది. ఈ పురుగులు రాత్రిళ్ళు చెట్లపై ఉండి, పగలు ఎగురుకుంటూ వెళ్తాయి.
ఈ సంవత్సరం మిడుత సమూహాలపై ముందస్తు దాడి గురించి ఆందోళన చెందుతున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ 2020 మే 6 న పురుగుమందుల తయారీదారులు, అన్ని సంబంధిత వాటాదారులతో సమావేశం నిర్వహించి మిడుతల నియంత్రణ సంసిద్ధతను సమీక్షించారు. వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్ ఆదేశాల మేరకు కార్యదర్శి (డిఎసి & ఎఫ్‌డబ్ల్యూ) శ్రీ సంజయ్ అగర్వాల్ అధ్యక్షతన 2020 మే 22 న వీడియో సమావేశం నిర్వహించారు, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ జిల్లాల పరిపాలన, మిడుత ప్రభావిత జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు ఎన్‌డీఎంఏ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం లోకస్ట్ కంట్రోల్ కార్యాలయాలలో 21 మైక్రోనైర్ మరియు 26 ఉల్వామాస్ట్ (47 స్ప్రే పరికరాలు) ఉన్నాయి, ఇవి మిడుత నియంత్రణ కోసం ఉపయోగించబడుతున్నాయి. వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్ ఆమోదం మేరకు అదనంగా 60 స్ప్రేయర్లకు సరఫరా ఆర్డర్‌ను మెస్సర్స్ మైక్రాన్, యునైటెడ్ కింగ్‌డమ్ ముందుంచడం జరిగింది. ఎత్తైన చెట్లు, మారుమూల ప్రాంతాలపై సమర్థవంతమైన నియంత్రణ కోసం పురుగుమందుల విమానాల ద్వారా పై నుండి చల్లడం కోసం డ్రోన్ల సేవలను అందించడానికి ఎంపానెల్లింగ్ ఏజెన్సీలకు ఇ-టెండర్ ఆహ్వానించారు. 21 మే, 2020 న సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ "రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టంను మిడుత నియంత్రణ కార్యకలాపాల కోసం ఉపయోగించటానికి ప్రభుత్వ సంస్థ (డిపిపిక్యూఎస్) కు షరతులతో కూడిన మినహాయింపు" ను ఆమోదించింది. ఈ ఉత్తర్వు ప్రకారం, రెండు సంస్థలను టెండర్ ద్వారా ఖరారు చేశారు. మిడుత నియంత్రణ కోసం పురుగుమందుల పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తారు.
లోకస్ట్ కంట్రోల్ సంస్థలతో పురుగుమందుల తగినంత నిల్వ (53,000 లీటర్ల మలాథియాన్) నిర్వహించబడుతోంది. వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్ కింద, రాజస్థాన్ కోసం 800 ట్రాక్టర్ల మౌంటెడ్ స్ప్రే పరికరాలకు రూ.2.86 కోట్లు సహాయం మంజూరు చేయబడింది. అలాగే, వాహనాలు, ట్రాక్టర్లు, పురుగుమందుల కొనుగోలుకు ఆర్కేవీవై అనుమతి కింద రాజస్థాన్‌కు రూ. 14 కోట్లు. వాహనాల కొనుగోలుకు ఆర్కెవివై మంజూరు కింద, స్ప్రే పరికరాలు, భద్రతా యూనిఫాం, ఆండ్రాయిడ్ అప్లికేషన్ మరియు శిక్షణ కూడా గుజరాత్‌కు రూ. 1.80 కోట్లు మంజూరయ్యాయి.
2020 మే 21 న ఎఫ్ఏఓ తాజా పరిస్థితి నివేదిక ప్రకారం, తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుత పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ ఇది ఆహార భద్రత మరియు జీవనోపాధికి అసాధారణమైన ముప్పునాకు దారి తీస్తోంది. కొత్త సమూహాలు ఇండో-పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న వేసవి సంతానోత్పత్తి ప్రాంతాలతో పాటు సుడాన్ మరియు పశ్చిమ ఆఫ్రికాకు వలసపోతాయి. వృక్షసంపద ఎండిపోతున్నప్పుడు, ఇండో-పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ఎక్కువ సమూహాలు ఈ ప్రాంతాల నుండి వేసవి సంతానోత్పత్తి ప్రాంతాలకు తరలిపోతాయి. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులో జూన్ మొదటి అర్ధభాగంలో మంచి వర్షాలు పడతాయని అంచనా వేసింది, ఇవి గుడ్లు పొదుగడానికి వాటికి సరైన సమయం.
2019-20లో, భారతదేశం భారీ మిడుత దాడిని విజయవంతంగా నియంత్రించింది. 2019 మే 21 నుండి 2020 ఫిబ్రవరి 17 వరకు మొత్తం 4,03,488 హెక్టార్ల విస్తీర్ణంలో మిడుతలు నియంత్రించబడ్డాయి.
***
(Release ID: 1627383)
Visitor Counter : 282