శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి) పరిధిలోని విజ్ఞాన మరియు ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు (ఎస్ ఈ ఆర్ బి) నిర్మాణ ఆధార వైరస్‌ నిరోధాలను గుర్తించి అధ్యయనం చేయడాన్ని బలపరచింది

Posted On: 27 MAY 2020 5:36PM by PIB Hyderabad

 

సార్స్ - కోవ్2  వైరస్ ను ఎదుర్కోవడానికి నిర్మాణ-ఆధార, శక్తివంతమైన  వైరస్ నిరోధాలను గుర్తించి వాటిపై  అధ్యయనం చేస్తానని ఐ ఐ టి -రూర్కీకి చెందిన ప్రొఫెసర్ ప్రవీంద్ర కుమార్ చేసిన ప్రతిపాదనను ఇటీవల డి ఎస్ టి- ఎస్ ఈ ఆర్ బి బలపరచింది    

ప్రాధాన్యతా క్షేత్రాలలో పరిశోధనను తీవ్రం చేయడంలో భాగంగా ఈ అధ్యయనానికి నిధులు కేటాయిస్తారు.  మన శరీరంలో ప్రవేశించి మనల్ని శక్తిహీనుల్ని చేసే వ్యాధికారక వైరస్ లపై దాడి చేసి వాటి చురుకుదనాన్ని తగ్గించే  చిన్న అణువులను ఈ అధ్యయనం ద్వారా శోధిస్తారు.  వైరస్  ప్రతికృతి కిణ్వంలను వైరస్‌ నిరోధాలు ఎదుర్కొంటాయి.  

ఈ అధ్యయనంలో ముందుగా కంప్యూటర్ ఆధార కాల్పనిక స్క్రీనింగ్ పద్ధతిలో వివిధ సమ్మేళనాల నుంచి వైరస్ వ్యతిరేక అణువులను గుర్తించి  వాటి వైరస్ వ్యతిరేక సామర్ధ్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రామాణికం చేస్తారు. పరిశోధనలో గుర్తించిన  వైరస్ నిరోధక అణువులకు   సార్స్ - కోవ్2 వైరస్ ను ఎదిరించగల శక్తి సామర్ధ్యాలు ఏ మేరకు ఉన్నాయో  తేల్చడానికి జరిపే ప్రయోగాలలో ప్రొఫెసర్ ప్రవీంద్ర కుమార్ కు ఐ ఐ టి -రూర్కీకి చెందిన డాక్టర్ శైలీ తోమర్ మరియు  బరేలీ ఇండియన్ వెటరినరీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్  కు చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ సహకారం అందిస్తారు.  

ఈ పరిశోధనలో ప్రాధమికంగా ఇప్పటివరకు తయారైన,  ఎఫ్ డి ఏ ఆమోదించిన వైరస్ నిరోధకాలను పరిశోధకులు కంప్యూటర్ నమూనాలు ఉపయోగించి పరీక్షించారు.  


కంప్యూటర్ నమూనాలను ఉపయోగించి వైరస్ వ్యతిరేక అణువుల శక్తి సామర్ధ్యాలను పరీక్షించడం వల్ల వైరస్ వ్యతిరేక ఔషధాలు , వ్యాక్సిన్లను సత్వరం గుర్తించడానికి, సరైనవి ఎంపికచేసుకోవడానికి  వీలవుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ తెలిపారు.  

 
కోవిడ్ -19 మహమ్మారికి కారణం సార్స్  - కోవ్2 వైరస్.  దీని కారణంగా  ప్రపంచవ్యాప్తంగా  రోగవ్యాప్తి, మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.   దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా  అనేక దేశాలలో సమర్ధవంతమైన వ్యాక్సిన్ గుర్తించడానికి,  కోవిడ్ -19 వ్యాప్తిని అదుపుచేయడానికి లేక చికిత్సకు అవసరమైన, అందుకు సంబంధించిన  వైరస్ వ్యతిరేక ఔషధాలు కనుగొనేందుకు ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి.  

శక్తివంతంగా ఉండే అణు నిర్మాణ-ఆధార వైరస్ నిరోధాలను గుర్తించడం ద్వారా వాటి సామర్ఢ్యముతో కోవిడ్ -19 వైరస్ ఆట కట్టించడానికి మార్గం సుగమం కాగలదని భావిస్తున్నారు.  

(మరిన్ని వివరాల కోసం దయచేసి డాక్టర్ ప్రవీంద్ర కుమార్ ను ఈ మెయిల్ pravshai[at]gmail[dot]com ద్వారా సంప్రదించవచ్చు)  

***



(Release ID: 1627348) Visitor Counter : 209