గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వన్ ధన్ స్కీమ్ మీద వెబినార్: గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో కోవిడ్-19 అనంతర పరిణామాలపై చర్చ

Posted On: 26 MAY 2020 5:49PM by PIB Hyderabad

"మీ పథకం గురించి తెలుసుకొండి " సిరీస్ లో భాగంగా " వన్ దన్ పథకం - కోవిడ్-19 అనంతర పరిణామాలు" పై శాస్త్ర సాంకేతిక విభాగం, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజనవ్యవహారాల మంత్రిత్వశాఖ  వారి ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఈ రోజు వెబినార్ జరిగింది. ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణ కీలకోపన్యాసం చేస్తూ,  కోవిడ్ అనంతర పరిణామాలు నేర్పిన పాఠాలను ప్రస్తావించారు. ఈ వెబినార్ కు రాజస్థాన్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి కుమారి ముగ్ధా సిన్హా సమన్వయకర్తగా వ్యవహరించారు.

ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ సంక్షోభం దేశ వ్యాప్తంగా ముందెన్నడూ ఎరుగని భయాలు సృష్టించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీని బారిన పడ్డాయి. ఈ పరిస్థితి ప్రభావం వలన పేద కుటుంబాల జీవనోపాథికి పెద్ద దెబ్బతగిలింది. ఇది అనేకప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయం కావటంతో  సంచార జాతులైన గిరిజనులు  చాలా దెబ్బతిన్నారు. గిరిజనులు ఎదుర్కుంటున్న ఈ పరిస్థితులను ప్రస్తావిస్తూ, చేతి వృత్తులమీద ఆధార్పడిన గిరిజనులు దాదాపు ఐదు లక్ష్జలమంది ఉన్నారని మంత్రి శ్రీ ప్రవీర్ కృష్ణ గుర్తు చేశారు. ఇందులో చేనేత, హస్త కళాకారులు కూడా ఉన్నారన్నారు. వీరు ప్రధానంగా మార్కెటింగ్ సమస్య ఎదుర్కుంటున్నారని కూడా ప్రస్తావించారు. అయితే, గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ట్రైఫెడ్ సంస్థ గిరిజన ఉత్పత్తుల సేకరణలో కీలకపాత్రపోషిస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా 120 శాశ్వత అమ్మకం కేంద్రాలు, ఈకామర్స్ వేదికలు, ప్రదర్శనలు ప్రారంభించటం ద్వారా అమ్మకాలు వేగవంతం చేస్తున్నామన్నారు. అదేసమయంలో హస్తకళానిపుణులకు ప్రత్యేక శిక్షణాకార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పారు.

 


అటవీఉత్పత్తులమీద 50 లక్షలమందికి పైగా గిరిజనులు ఆధారపడి ఉన్నారని, వాళ్లలో నిబిడీకృతంగా ఉన్న నైపుణ్యాలతో ఏటా దాదాపు టన్ను  ఉత్పత్తులు సేకరిస్తారని వివరించారు. వాళ్ళ నైపుణ్యాలను వెలికితీస్తూ వారిని చిన్నపాటి వ్యాపారులుగా తయారుచేయటం మీద దృష్టిపెట్టాలని అభిప్రాయపడ్దారు. కనీస మద్దతు ధర ద్వారా ఏడాదికి ఒక్కొక్కరికి కనీసం రూ. 20,000 నుంచి 30,000 దాకా ఆదాయం సమకూరేలా చేయవచ్చునన్నారు. ఇప్పటివరకూ దళారులు కీలపాత్ర పోషిస్తూ ఉండగా వన్ ధన్ యోజన వలన ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతున్నదన్నారు. ఉత్పత్తుల సేకరణలో  పాలుపంచుకునే గిరిజనులకు నేరుగా ధనం సమకూరుతుందన్నారు. మణిపూర్, నాగాలండ్ లాంటి చోట్ల గిరిజనులు ఈ విధంగా లబ్ధిపొందటాన్ని శ్రీ కృష్ణ ప్రస్తావించారు.

ఏయే ఉత్పత్తులను ప్రభుత్వం సేకరిస్తుందో, వాటి కనీస మద్దతు ధర ఎంతో ప్రకటించటంతోబాటు గిడ్డంగులవంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రోత్సహించటం ఒక వైపు, వారిలో వ్యాపార లక్షణాలున్నవారిని గుర్తించి సొంత వ్యాపారాన్ని ప్రోత్సహించటం మరోవైపు ఆశించిన ఫలితాలనిచ్చిందన్నారు. ప్రముఖ ఐఐటి లు, ఐఐఎమ్ ల సహకారంతో ట్రైఫెడ్ సంస్థ వ్యాపార, సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నదన్నారు. అదే సమయంలో సమాచార వ్యాప్తి సజావుగా సాగుతున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, వన్ ధన్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు డాష్ బోర్డులు ఏర్పాటు చేసిందని కూండా మంత్రి తెలియజేశారు.

అనంతరం కోవిడ్ -19 పరిస్థితిని ప్రస్తావిస్తూ , ట్రైఫెడ్ తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. లాక్ డౌన్ సమయం పొడిగించినా సరే ఎలా ముందుకు సాగాలో కూడా సన్నద్ధంగా ఉండాలన్నారు. ఇందుకోసం దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు. కశ్మీర్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాలలో గిరిజనులకు రేషన్  కిట్స్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. మిగిలిన ప్రాంతాలలో పంపిణీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యునిసెఫ్ తో కలిసి ట్రైఫెడ్ సంస్థ వన్ ధన్ సామాజిక్ దూరి జాగ్ రూకతా అభియాన్ నిర్వహిస్తోందని చెప్పారు. ఇంటింటికీ తిరిగి గిరిజనుల ఉత్పత్తులను సేకరించటం లాంటి చర్యలు చత్తీస్ గడ్ లో సత్ఫలితాలనిచ్చిందన్నారు. రాజస్థాన్ లో అదనంగా145 వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెబుతూ ఆత్మనిర్భర్ భారత్ కింద గిరిజన స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు కూడా మెరుగైన అవకాశాలున్నాయన్నారు. రాజస్థాన్ లోని అన్ని జిల్లాలకూ వన్ ధన్ పథకాన్ని విస్తరించటం ద్వారా అందులోకి జొన్నలు, చిరుధాన్యాలు కూడా చేరుస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వన్ ధన్ యోజనతో భాగస్వామ్యానికి, ట్రైఫెడ్ తో కలసి పనిచేయటానికి ఆసక్తి కనబరచింది.


 

 


 
ఫొటో:    2020 మే 26 న వెబినార్ లో ప్రసంగిస్తున్న శ్రీ ప్రవీర్ కృష్ణ  


(Release ID: 1627138) Visitor Counter : 270