విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ముందు వరుస ఆరోగ్య కార్యకర్తలకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు తాజ్ సాట్స్ తో కలిసి పని చేయనున్న ఆర్.ఈ.సి. లిమిటెడ్

మే 24 నాటికి 4.58 లక్షల కిలో గ్రాముల ఆహార ధాన్యాలు, 1.26 లక్షల భోజన ప్యాకెట్లు, 9600 లీటర్ల శానిటైజర్లు, 3400 పి.పి.ఈ. కిట్లు మరియు 83,000 మాస్క్ లను పంపిణీ చేసిన పి.ఎస్.యు.

Posted On: 26 MAY 2020 12:02PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న కేంద్ర పి.ఎస్.యు మరియు భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఫైనాన్షియర్లలో ఒకరైన ఆర్.ఈ.సి. లిమిటెడ్, కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్య సిబ్బందికి, దేశవ్యాప్త పేద రోజువారీ కూలీ కార్మికులకు ఆహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఆర్.ఈ.సి. లిమిటెడ్ యొక్క సి.ఎస్.ఆర్.కు చెందిన ఆర్.ఈ.సి. ఫౌండేషన్, న్యూఢిల్లీలోని సఫ్దార్ జంగ్ హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాలతో కూడిన భోజన ప్యాకెట్లను పంపిణీ చేయడానికి తాజ్ సాట్స్ (ఐ.హెచ్.సి.ఎల్. మరియు సాట్స్ లిమిటెడ్ ఉమ్మడి భాగస్వామ్యంలో) తో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని ముందు వరుస ఆరోగ్య కార్యకర్తలకు ప్రతి రోజు 300 ఆహార పొట్లాల పంపిణీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ చొరవ ద్వారా న్యూఢిల్లీలోని 18,000 మందికి పైగా భోజనం అందించబడుతుంది.

అదే సమయంలో వివిధ జిల్లాల అధికారులు, ఎన్జీఓలు మరియు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కామ్స్) సహకారంతో ఆర్.ఈ.సి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పేదలకు వండిన భోజనం మరియు రేషన్ సామగ్రిని అందిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చొరవ తీసుకున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ ఇది కొనసాగుతుంది. 2020 మే 24 నాటికి, కార్పొరేషన్ 4.58 లక్షల కిలోగ్రాముల ఆహార ధాన్యాలు, 1.26 లక్షల భోజన ప్యాకెట్లు, 9600 లీటర్ల శానిటైజరు, 3400 పి.పి.ఈ. కిట్లు మరియు 83,000 మాస్క్ లను పంపిణీ చేసింది.

ఆర్.ఈ.సి. లిమిటెడ్ (గతంలో గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్) భారతదేశమంతటా నవరత్న ఎన్.బి.ఎఫ్.సి విద్యుత్ రంగ ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధి పై దృష్టి సారించింది. 1969లో స్థాపించబడిన ఆర్.ఈ.సి. లిమిటెడ్ తన కార్యకలాపాలను యాభై ఏళ్ళకు పైగా నిర్వహిస్తోంది. ఇది విద్యుత్ రంగ్ విలువ గొలుసు అంతటా ఆర్థిక సహాయం అందిస్తుంది. అంతే కాకుండా, విద్యుత్ రంగంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డి.డి.యు.జి.వై), సౌభాగ్య వంటి ప్రధాన పథకాలకు ఆర్.ఈ.సి. కూడా ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీ.  

 

***



(Release ID: 1627099) Visitor Counter : 214