ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం


వలస కార్మికులు ఎక్కువగా తిరిగి వస్తున్న 5 రాష్ట్రాలతో సంభాషించిన - ఆరోగ్య కార్యదర్శి

Posted On: 26 MAY 2020 2:02PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతీ సుడాన్, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ.ఎస్.డి. శ్రీ రాజేష్ భూషణ్ తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన సీనియర్ అధికారులతో కలిసి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్యశాఖ కార్యదర్శులు, ఎన్.హెచ్.ఎం. డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.   లాక్ డౌన్ నియమాలు సడలించబడి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలసలు అనుమతించడంతో, ఈ రాష్ట్రాలలో గత మూడు వారాల నుండి కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. 

కేసు మరణాల రేటు, కేసుల వ్యాప్తి రెట్టింపు సమయం, ఒక మిలియన్ ‌కు ఎంత మందికి పరీక్షలు చేయడం జరుగుతోంది మరియు నిర్ధారణ శాతానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలను ఆయా రాష్ట్రాలకు వివరించడం జరిగింది.  నిర్ణీత పరిధిలో నియంత్రణ, ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ప్రతి ఇంటి సర్వే, పరీక్ష, క్రియాశీల కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రభావవంతమైన నియంత్రణ వ్యూహంపై దృష్టి సారించాల్సిన అంశాలను వారికి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది.  సూక్ష్మ ప్రణాళికలను సరైన ఏర్పాటుతో అమలు చేయడం ద్వారా హెచ్చు తగ్గులను తనిఖీ చేయడానికి, కోర్సు దిద్దుబాటు చర్యలను అవలంబించడానికి వీలుగా  ప్రతి కంటైన్మెంట్ జోన్ ‌ను విశ్లేషించాల్సి ఉందని కూడా హెచ్చరించడం జరిగింది.  బఫర్ జోన్ పరిధిలోని కార్యకలాపాలను కూడా సమీక్షించడం జరిగింది. 

క్వారంటైన్ కేంద్రాలు, ఐసియు / వెంటిలేటర్ / ఆక్సిజన్ పడకలతో ఉన్న ఆసుపత్రులు వంటి అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను అంచనా వేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. రానున్న రెండు నెలల అవసరాలను అంచనా వేయడం ద్వారా కూడా వాటిని బలోపేతం చేయాలని సూచించడం జరిగింది.  ఆరోగ్య సేతు యాప్ నుండి వెలువడుతున్న సమాచారాన్ని ఎలా వాడుకోవాలనే విషయంపై కూడా సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలకు సూచించడం  జరిగింది. 

కోవిడ్ కాని ముఖ్యమైన ఆరోగ్య సేవలకు సంబంధించి, టి.బి, కుష్టు వ్యాధి, సి.ఓ.పి.డి. ల తో పాటు, రక్తపోటు, మధుమేహం, గాయాలకు చికిత్స మరియు ప్రమాదాల వల్ల కలిగే గాయాలు వంటి సంక్రమణేతర వ్యాధులకు అవసరమైన ఆరోగ్య కార్యక్రమాలను కొనసాగించడానికి తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాష్ట్రాలకు గుర్తు చేయడం జరిగింది.  

సంచార వైద్య యూనిట్లు (ఎంఎంయు) ను క్వారంటైన్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని సలహా ఇచ్చారు. ఇప్పటికే ఉన్న భవనాలలో తాత్కాలిక ఉప-ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చుననీ,  ఆర్.బి.ఎస్.కే. బృందాల వంటి అదనపు ఫ్రంట్ లైన్ కార్మికులను ఉపయోగించుకోవచ్చుననీ సూచించడం జరిగింది.  ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలతో సంబంధాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు, తద్వారా తక్షణ ఆరోగ్య పరీక్షలను ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు.  ఈ కేంద్రాల నుండి టెలి మెడిసిన్ సేవలను కూడా ప్రారంభించవచ్చు.  అదనంగా ఆరోగ్య కార్యకర్తలను నియోగించుకుని ప్రస్తుత భవనాలలో తాత్కాలిక ఉప ఆరోగ్య కేంద్రాలను కూడా నిర్వహించుకోవచ్చునని సూచించారు. 

పెరుగుతున్న వలస కార్మికుల ఒత్తిడిని ఎదుర్కోడానికి, ఆశా లు మరియు ఏ.ఎన్.ఎమ్. లకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు.  అవుట్ రీచ్  బృందాలకు సంబంధించి పి.పి.ఇ.  మార్గదర్శకాల అమలును నిర్ధారించాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది.  ప్రభుత్వేతర సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, స్వచ్చంద కార్యకర్తల బృందాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్రాలను కోరడం జరిగింది.  గర్భిణీ స్త్రీలు, ఐదేళ్ల లోపు పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకోసం జిల్లాల్లోని  అంగన్‌వాడీ సిబ్బందిని సమీకరించాలని రాష్ట్రాలకు సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలలో పోషకాహారాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉందనీ, వారిని పోషకాహార పునరావాస కేంద్రాలకు (ఎన్.ఆర్.సి.లకు) సిఫారసు చేయాలనీ గట్టిగా చెప్పారు. 

ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో జరిగిన వివరణాత్మక చర్చ మరియు సమాలోచనల ప్రకారం రాష్ట్రాలు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరడం జరిగింది. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : technicalquery.covid19[at]gov[dot]in ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva. కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ)  ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి : https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

*****



(Release ID: 1627041) Visitor Counter : 199