ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అప్ డేట్
కఠిన నిబంధనలు పాటించడం ద్వారా నాణ్యమైన పిపిఇలు
దేశీయ ఉత్పత్తిసామర్థ్యం గణనీయంగా పెంపు: ప‌్రతిరోజూ 3 లక్షల కిట్లకు పైనే తయారీ
Posted On:
25 MAY 2020 11:42AM by PIB Hyderabad
వ్యక్తిగత సంరక్షణ పరికరాలైన (పిపిఇ) కవర్ ఆల్‌ల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వర్గం మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలలో పేర్కొన్న ఉత్పత్తులకు, కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న వాటికి ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తరఫున హెచ్ .ఎల్.ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (హెచ్ ఎల్ ఎల్) సంస్థ, ఉత్పత్తిదారులు, సరఫరా దారులనుంచి పిపిఇ కవర్ ఆల్‌లను సమీకరిస్తున్నది. అది కూడా టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన 8 ప్రయోగశాలలో ఏదైనా ఒక దానినుంచి ఈ కవర్ ఆల్‌లను పరీక్షింప చేసి , ఆమోదం పొందిన తర్వాతే వాటిని తీసుకుంటున్నారు. అంతే కాదు,కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన సాంకేతిక కమిటీ రూపొందించిన పరీక్షకు అవి నిలబడితేనే ఈ ఉత్పత్తులను స్వీకరిస్తున్నారు.
దీనికితోడు, హెచ్.ఎల్.ఎల్ తాను సరఫరా చేసే వాటి నుంచి యాదృచ్ఛికంగా కొన్ని నమూనాలను ఎంపిక చేసి పరీక్షిస్తోంది. ఇందుకు ఒక టెస్టింగ్ ప్రొటోకాల్‌ను రూపొందించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను సరఫరా చేసే కంపెనీలను అనర్హులుగా ప్రకటించి వాటి ఉత్పత్తులు ఇక స్వీకరించరు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ స్థాయిలో సేకరించే పిపిఇ కిట్ల విషయంలోకూడా మార్గదర్శకాలు ఉన్నాయి. టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ నామినేట్ చేసిన ల్యాబ్‌లలో పిపిఇల నాణ్యతను పరీక్షించేందుకు సూచించిన విధానాన్ని పాటించిన తర్వాతే వాటిని సేకరించాలని సూచించడం జరిగింది.
దీనికితోడు, ఈ ల్యాబ్‌లలో తమ ఉత్పత్తులను పరీక్షింప చేసుకుని ఆమోదం పొంది అర్హత సాధించిన తయారీదారులు ప్రభుత్వ ఈ మార్కెట్‌ప్లేస్ (జిఇఎం) లో నమోదు చేసుకోవచ్చు.పిపిఇ ల విషయంలో నాణ్యతా అర్హత సాధించిన తయారీదారులను జిఇఎం ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకొనే విధంగా టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ సూచిస్తుంది. దీనివల్ల ఆయా రాష్ట్రాలు పిపిఇ కిట్లను వీటినుంచి సేకరించడానికి వీలు కలుగుతుంది. టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన ప్రైవేటు రంగంలోని ఉత్పత్తుల జాబితాను కూడా ఎప్పటికప్పుడు టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
మన దేశం పిపిఇ కిట్లను , అలాగే ఎన్ -95 మాస్క్‌లను దేశీయంగా ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్నిగణనీయంగా పెంచుకుంది. ఫలితంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలను తగినంతగా తీరుస్తున్నారు. ప్రస్తుతం మన దేశం ప్రతిరోజూ, 3 లక్షలకు పైగా పిపిఇ కిట్లు, ఎన్-95 మాస్క్‌లను తయారు చేస్తోంది.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర సంస్థలకు సుమారు 111.08 లక్షల ఎన్-95 మాస్క్‌లు, 74.48 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ)లను అందజేయడం జరిగింది.
దీనికితోడు , పిపిఇ ల ను హేతుబద్ధంగా వాడేందుకు సంబంధించి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని https://mohfw.gov.in.లో చూడవచ్చు.
(Release ID: 1626769)
Visitor Counter : 312
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam