గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్‌పై పోరాటంలో కీలకపాత్ర వహించిన అజ్మీర్ స్మార్ట్ సిటీ వార్ రూమ్ ఫైర్ టెండర్ల వినియోగంతో వివిధ ప్రాంతాలు క్రిమిరహితం
Posted On:
23 MAY 2020 4:40PM by PIB Hyderabad
అజ్మీర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎఎంసి) మార్చి 2, 2020 నుంచే సానుకూల చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మార్చి 11 నుంచి మరింత కఠిన చర్యలు తీసుకుంది. అదే రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) నొవెల్ కరోనా వైరస్ ( కోవిడ్ -19) వ్యాప్తిని అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించింది.
ఎఎంసి, నగర్ నిగమ్ వద్ద కోవిడ్ -19 వార్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ అజ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నేతృత్వంలో ఏర్పడిన ఈ వార్ రూమ్ లో గల వైద్య, పోలీసు అధికారులు కోవిడ్ -19 పరిస్థితిని గమనించి , కోవిడ్ వైరస్ పౌరులకు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన తదుపరి చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన ముందస్తు జాగ్రత్త చర్యలకు అనుగుణంగా పౌరులలో కోవిడ్ -19 పై కింది అంశాలపై అవగాహన కల్పించేందుకు వివిధ వినూత్న వ్యూహాల అమలు , ప్రణాళికా రూపకల్పనకు ఈ వార్ రూమ్ కీలకంగా వ్యవహరిస్తో్ంది:
-అనారోగ్యంతో ఉన్న వారికి దగ్గరగా ఉండకండి, ఆరు అడుగుల దూరం పాటించండి.
-మీ కళ్ళు, ముక్కు, నోటిని అపరిశుభ్ర చేతులతో తాకకండి.
-అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
-దగ్గినపుడు, చీదినపుడు టిస్యూ పేపర్ అడ్డుపెట్టుకుని, దానిని జాగ్రత్తగా చెత్తకుండీలో వేయండి.
-తరచూ చేతులతో తాకే వస్తువులను వాటి ఉపరితలాలను ప్రతిరోజూ క్రిమిసంహారకాలతో శుభ్రం చేయండి.
ఎక్కువమంది తాకేందుకు అవకాశం ఉన్న కౌంటర్లు, టేబుల్ టాప్‌లు, డోర్ నాబ్‌లు, బాత్‌రూమ్‌లో బిగించిన వస్తువులు, టాయిలెట్లు, ఫోన్‌లు, కీబోర్డులు, కంప్యూటర్ టాబ్లెట్‌లు,టేబుళ్ళ వంటి వాటిని తరచూ శుభ్రం చేయాలి.
మీ చేతులను తరచూ సబ్బు , నీటితో శుభ్రంగా కడగండి. సబ్బు, నీరు సమయానికి అందుబాటులో లేకపోతే కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ ను వాడాలి. చేతులను పూర్తిగా శుభ్రం చేయాలి.
-జనసమ్మర్థం గల ప్రాంతాలకు దూరంగా ఉండండి. సామూహికంగా కలుసుకునేందుకు వెళ్ళకండి
- ఆయా ఉపరితలాలు మురికిగా ఉంటే వాటిని శుభ్రం చేయండి. క్రిమి సంహారకం చల్లడానికి ముందు డిటర్జంట్ లేదా సబ్బు , నీటితో కడగండి.
వ్యాధి లక్షణాలు కనపడితే శరీర ఉష్ణోగ్రతను గమనించండి
ఏవైనా మందులు తీసుకున్నలేదా ఎక్సర్‌సైజు చేసిన 30 నిమిషాల లోపు శరీర ఉష్ణోగ్రతను చూడకండి. ఎందుకంటే దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తక్కువగా చూపించే అవకాశం ఉంది.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అజ్మీర్ సిటీ పాలనా యంత్రాంగం తీసుకున్న కీలక చర్యలు కింది విధంగా ఉన్నాయి :
పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పిఎ)- కోవిడ్ -19 కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి సమాచారం ఇస్తున్నారు. అజ్మీర్ మున్సిపల్ కార్పొరేసన్ అగ్నిమాపక విభాగం, పారిశుధ్య విభాగం సేవలను కూడా ఇందుకు వినియోగించుకుంటున్నారు.
అజ్మీర్లో పరిస్థితిని ఎప్పటికప్పడు గమనించేందుకు కలెక్టర్, కమిషనర్ వివిధ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలనుంచి నేరుగా వారి స్పందనను తెలుసుకుంటున్నారు.
ఆహారం, ఆశ్రయం: ఆశ్రయం లేని వారిని ప్రత్యేక సిటీ షెల్టర్‌కు తరలించారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో వండిన ఆహారం, నిత్యవసరాలు సమకూరుస్తున్నారు. వార్ రూమ్ లో ఆహారం అవసరమైన వారి నుంచి అభ్యర్థనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.
క్రమిసంహారకం చల్లేందుకు అగ్నిమాపక శకటాల వినియోగం: నగరంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్లు, బస్ స్టాప్ లు,రైల్వే స్టేషన్లు, వివిధ సంస్థలు, ఆస్పత్రి క్యాంపస్‌లు, షాపులు, తదితరాలను క్రిమిరహితం చేసేందుకు నగరానికి చెందిన అగ్నిమాపక దళం పెద్ద అగ్నిమాపక పరికరాల సహాయంతో క్రమి సంహారకాలు పిచికారీ చేస్తోంది. అలాగే నగరం మొత్తం, వార్డులు, వీధులను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసేందుకు చిన్న పరికరాలను వాడుతున్నారు.
కోవిడ్ -19 హెల్ప్‌లైన్ నెంబర్: కోవిడ్ -19 హెల్ప్‌లైన్ నెంబర్‌ను అజ్మీర్ సిటీ స్థాయిలో ఏర్పాటు చేసి దానిని వార్ రూమ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఆహార అవసరాలు తెలియజేవచ్చు, అలాగే క్రిమిసంహారకాల పిచికారి అవసరాలు, పారిశుధ్య అవసరాల గురించి తెలియజేయవచ్చు.
సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా: క‌్రిమిసంహారకాలు పిచికారీ , పారిశుధ్య కార్మికుల కార్యకలాపాలకు సంబంధించి జిపిఎస్ ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్ కు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
క్వారంటైన్ సదుపాయాల ఏర్పాటు :నగరంలో క్వారంటైన్ సదుపాయాలు కల్పించేందుకు ప్రైవేటు సంస్థలు, హోటళ్ళను వినియోగించుకోవడం జరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌లను గుర్తించి వారని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఐసిసిసి- అభయ్ కమాండ్, కంట్రోల్ సెంటర్: దీనిని సిటీ పోలీసు, ట్రాఫిక్ డిపార్టమెంట్ వినియోగిస్తోంది. సిసిటివి కెమెరా ఫుటేజ్ దీని ద్వారా లభిస్తుంది. ప్రజల కదలికలను, ట్రాఫిక్ కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు గమనించడానికి వీలు కలుగుతుంది.
వలసకార్మికుల చేరవేత:
వలసకార్మికుల అంతర్ రాష్ట్ర ప్రయాణానికి లేదా అంతర్ నగర ప్రయాణానికి ఈ -పాస్‌లు జారీచేసేందుకు రాజ్ కాప్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ పాస్‌లను రాజస్థాన్ వెలుపలకు వెళ్ళదలచిన వ్యక్తులకు లేదా అజ్మీర్ రాదలచిన వ్యక్తులకు సిటీ అధికారులు అనుమతి మంజూరు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చిక్కుకుపోయిన వలస కార్మికులు రాజ్ కోవిడ్ ఇన్‌ఫో యాప్ ద్వారా , ఈ మిత్ర వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకోవచ్చు. రిజిస్టర్ చేయించుకున్న వారిని భద్రంగా వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. దర్గా షరీఫ్ అజ్మీర్ సందర్శనకు వచ్చిన యాత్రికులు ఎవరైనా లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయి ఉంటే వారిని గుర్తించి, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వారిని వారి స్వస్థలాలకు రైళ్ళు , బస్సుల ద్వారా పంపడం జరుగుతోంది.
***
(Release ID: 1626447)
Visitor Counter : 276