కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ఆశయాన్ని సాకారం చేసే దిశగా పనిచేయాలని భారతీయ తపాలా శాఖను కోరిన - శ్రీ రవి శంకర్ ప్రసాద్.

దేశవ్యాప్తంగా 2,000 టన్నులకు పైగా మందులు మరియు వైద్య పరికరాలను అందించిన - భారతీయ తపాలా శాఖ

ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం (ఎఇపిఎస్) ఉపయోగించి ఖాతాదారుల ఇంటివద్ద 1500 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.

Posted On: 22 MAY 2020 7:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ఆశయాన్ని సాకారం చేసే దిశగా పనిచేయాలని,  కేంద్ర కమ్యూనికేషన్లు, చట్టము, న్యాయము, ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్,  చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరళ్ళు మరియు ఇండియా పోస్ట్ సీనియర్ అధికారులను ఆదేశించారు.   కోవిడ్-19 సంక్షోభ సమయంలో తపాలా శాఖ కార్యకలాపాలు మరియు ప్రయత్నాలను కేంద్ర మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్ రావు ధోత్రే, తపాలా శాఖ కార్యదర్శి శ్రీ పి.కె. బిసోయి , తపాలా సేవల డైరెక్టర్ జనరల్  శ్రీమతి అరుంధతీ ఘోష్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆయా సర్కిళ్ల ప్రధాన కార్యాలయాల నుండి ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరళ్ళు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.    

ఈ వీడియో కాన్ఫరెన్స్ మొదటి "మేక్ ఇన్ ఇండియా" వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ సి-డాట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. అలాగే, ఇది వీడియో కాన్ఫరెన్స్ పరిష్కారం యొక్క మొదటి విజయవంతమైన ట్రయల్ రన్.

ఇండియా పోస్ట్ యొక్క కోవిడ్ ప్రయత్నాల ముఖ్యాంశాలు:

*          దేశవ్యాప్తంగా 2,000 టన్నులకు పైగా మందులు మరియు వైద్య సామగ్రిని బుక్ చేసి, అవసరమైన వ్యక్తులు మరియు ఆసుపత్రులకు పంపిణీ చేయడం జరిగింది. 

*          ప్రతిరోజూ 25,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, 75 టన్నులకు పైగా ఉత్తరాలను మరియు పార్శిళ్లను బట్వాడా చేసే ప్రక్రియను బలోపేతం చేసేందుకు  రోడ్డు రవాణా నెట్ వర్క్ ను ప్రవేశపెట్టడం జరిగింది. 

*           ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం (ఎఇపిఎస్) ను ఉపయోగించి సుమారు 85 లక్షల మంది లబ్ధిదారులకు తమ ఇంటి వద్ద వద్ద సుమారు 1, 500 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 

*          760 కోట్ల రూపాయల విలువైన వివిధ ఆర్థిక పథకాల కింద 75 లక్షల ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు (ఇఎంఓ) చెల్లించడం జరిగింది. 

*          1100 కోట్ల రూపాయల మేర ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) చెల్లింపులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

*          సుమారు 6 లక్షల ఆహార, రేషన్ ప్యాకెట్లను కూలీలు, మునిసిపల్ కార్మికులు మొదలైనవారికి స్వంత విరాళాల ద్వారా మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది.

సిపిఎంజి పోస్టల్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చేపట్టిన కార్యకలాపాలను ఈ సందర్భంగా వివరించారు.  వివిధ సర్కిళ్లు కూడా తాము చేపట్టిన విభిన్న కార్యకలాపాలలో రాణించాయి.  ఆ వివరాలు :

*          గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశ్ సర్కిళ్లు వివిధ ఫార్మాస్యూటికల్ మరియు ఔషధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి రవాణా సంబంధమైన పరిష్కారాలను సూచించాయి. 

*          బీహార్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ మరియు తెలంగాణ ఆర్థిక చేరికలో ప్రముఖ రాష్ట్రాలు.

  *           ఉత్తర, ఈశాన్య మరియు దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా  ఉండేలా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్ర సర్కిళ్లు మంచి పనితీరు కనబరచాయి. 

*          హర్యానా, కర్ణాటక, కేరళ సర్కిళ్లు ప్రజల నుండి సేవా అభ్యర్థనను స్వీకరించడానికీ, తిరిగి వాటిని నెరవేర్చడానికి ఉపయోగపడే యాప్ లను అభివృద్ధి చేశాయి. 

సేవల వితరణ మరియు ప్రాంతీయ ప్రత్యేకతలను ప్రోత్సహించే కొన్ని వినూత్న నమూనాల గురించి కూడా సి.పి.ఎం.జి.లు ఈ సందర్భంగా వివరించాయి.: 

*            మాతా వైష్ణో దేవి ఆలయం నుండి ప్రసాదం మరియు కశ్మీర్ నుండి కుంకుమ పువ్వుల పంపిణీని జమ్మూ & కశ్మీర్ సర్కిల్ ఖరారు చేసింద

*            పంజాబ్ తన రాష్ట్రంలోని తపాలా కార్యాలయాల ద్వారా మరియు సిఎస్‌సి ల సహకారంతో భారతీయ ఔషధాల బుకింగ్ మరియు పంపిణీని ప్రోత్సహిస్తోంది.

*         “ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్”  అనే పధకం ద్వారా బీహార్  147 కోట్ల రూపాయలను 11.65 లక్షల మందికి వారి ఇళ్ల వద్ద డబ్బును అందజేసింది. 

ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధాని దృష్టిని సాకారం చేసే దిశగా కేంద్ర మంత్రి తన అభిప్రాయాలను ప్రకటిస్తూ.  సిపిఎంజిలు మరియు ఇండియా పోస్ట్ యొక్క సీనియర్ అధికారులు సహకరించాలని కోరారు. కోవిడ్ అనంతర పరిస్థితిలో తమ శాఖ అనుసరించవలసిన ప్రాధాన్యతా అంశాలను ఈ విధంగా వివరించారు:

*          దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయుర్వేదం, యునాని, సిద్ధ మొదలైన భారతీయ వైద్య విధానాలకు చెందిన ఔషధాల రవాణా అవసరాలు తీర్చడం కోసం కృషి చేయాలి. 

*         వలసదారుల డేటాబేస్, వారి నైపుణ్య సమితులు, వారి ఖాతాలను తెరవడం మరియు ఎమ్.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ. మరియు ఇతర ప్రభుత్వాల క్రింద చెల్లింపులను సులభతరం చేయడానికి "డాకియా" మొదటి వనరుగా మారాలి. 

*      భారతీయ సరఫరా చెయిన్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఇండియా పోస్ట్ ఒక వ్యూహాత్మక ప్రణాళికనుక్షేత్ర స్థాయి నుండి సలహాలు తీసుకుని రూపొందించవలసిన అవసరం ఉంది. దీని ద్వారా టెలి-మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తులుహస్తకళలు, శిల్పకళా ఉత్పత్తులు మరియు ఇతర స్థానిక ప్రత్యేక వస్తువులను తయారుచేసేవారి నుండి అంతిమ కొనుగోలుదారునకు మధ్యవర్తి ప్రమేయం లేకుండా అందజేయడానికి అవకాశం ఉంటుంది

*          కోవిడ్ కాలంలో మందులు మరియు అవసరమైన వస్తువుల పంపిణీ ద్వారా పొందిన అనుభవాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఈ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

*          "కోవిడ్ వారియర్స్"  గా  పోస్టల్ ఉద్యోగులు మరియు అధికారులు నిర్వహించిన పాత్రను మంత్రి ఈ సందర్భంగా  ప్రశంసించారు.

ఈ కార్యక్రమం ముగింపులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విస్తారమైన పోస్ట్ ఆఫీస్ నెట్‌వర్క్ మరియు సాంకేతిక శక్తితో పాటు ఆర్థిక చేరిక మరియు బలమైన సప్లై చెయిన్ తో అనుబంధంగా డిజిటల్ సాంకేతికత సహకారంతో  సాధారణ భారతీయునికి మరింత సాధికారతనందించవలసిన అవసరం ఉందని నొక్కిచెప్పారు, 

****


(Release ID: 1626403) Visitor Counter : 235