మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“ హునార్ హాత్” సెప్టెంబర్ 2020 నుంచి“ లోకల్ నుంచి గ్లోబల్ ” థీమ్‌తో పునఃప్రారంభం
దేశంలోని మారుమూల ప్రాంతాలలో అద్భుత నైపుణ్యంగల చేతి వృత్తుల కళాకారులు , హస్త కళాకారులకు మంచి మార్కెట్‌ను కల్పించేంది “ హునార్ హాత్” . ఇది అరుదైన, అద్భుతమైన దేశీయ హస్తకళా ఉత్పత్తులకు ఒక విశ్వసనీయ బ్రాండ్ గా రూపుదిద్దుకుంది : కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి
“ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని చేతివృత్తుల నిపుణులు, హస్తకళానిపుణులు పెద్ద మొత్తంలోఅరుదైన అత్యంత సుందర ఉత్పత్తులు తయారు చేశారు. తదుపరి జరగబోయే “హునార్ హాత్” సందర్భంగా వీటిని ప్రదర్శనకు అమ్మకానికి తీసుకురానున్నాం :ముక్తార్ అబ్బాస్ నక్వి
“ ప్రజలలో ఆరోగ్యంపట్ల అవగాహన పెంచేందుకు “ ఆందోళనకు నో చెప్పండి, ముందస్తు జాగ్రత్తకు యస్ అనండి” అన్న నినాదంతో ప్రజలలో ఆరోగ్యంపట్ల అవగాహన పెంచేందుకు “జాన్ భి, జహాన్ భి” ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు” :ముక్తార్ అబ్బాస్ నక్వి
“ ఈసారి“ హునార్ హాత్” ఉత్పత్తులను ప్రజలు డిజిటల్, ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.”: ముక్తార్ అబ్బాస్ నక్వి
Posted On:
23 MAY 2020 11:00AM by PIB Hyderabad
కరోనా మహమ్మారి కారణంగా ఐదు నెలల విరామం తరువాత “హునార్ హాత్” సెప్టెంబర్ 2020 నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చేతి వృత్తుల వారు, హస్తకళాకారులకు సాధికారత కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఈసారి “లోకల్ టు గ్లోబల్” థీమ్ తో ఇంతకు ముందుతో పోలిస్తే పెద్ద సంఖ్యలో హస్తకళాకారులతో దీనిలో పాల్గొననున్నారు.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి “హునార్ హాత్” నిర్వహణ గురించి వివరిస్తూ, ఇది గత 5 సంవత్సరాలలో 5 లక్షల మందికిపైగా చేతివృత్తుల వారు, హస్తకళాకారులు, పాకశాస్త్రప్రవీణులు, ఈరంగాలతో అనుసంధానమైన సుమారు 5 లక్షల మందికి పైగా ఉపాధిని, ఉపాధి అవకాశాలు కల్పించిందని, ప్రజలలో వీరికి మంచి ఆదరణ లభించిందని అన్నారు.
“హునార్ హాత్” దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నైపుణ్యం గల చేతివృత్తులవారు, హస్తకళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, అత్యంత అద్బుతమైన రీతిలో దేశీయంగా చేతితో తయారైన అరుదైన కళారూపాలకు నమ్మకమైన బ్రాండ్ ను కల్పిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్వహించిన హునార్ హాత్ ను ఆకస్మికంగా సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దేశీయంగా చేతివృత్తులవారు, హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనియాడి ఎంతగానో ప్రోత్సహించారు.
ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ కళాకారులను అభినందిస్తూ మాట్లాడారు.“ కొద్ది రోజుల క్రితం నేను ఢిల్లీలో హునార్ హాత్ కు వెళ్లాను. అక్కడ దేశ గొప్ప సంప్రదాయాలు , సంస్కృతులు, వంటలు, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలు వీటన్నిటినీ అక్కడ చూడగలిగాను. అక్కడ సంప్రదాయ దుస్తులు, హస్తకళారూపాలు, కార్పెట్లు, వంటపాత్రలు, వెదురు, ఇత్తడి ఉత్పత్తులు, పంజాబ్ కు చెందిన ఫుల్‌కరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అద్భుతమైన తోలు ఉత్పత్తులు, తమిళనాడు సుందరమైన పెయింటింగ్స్, ఉత్తరప్రదేశ్ ఇత్తడి ఉత్పత్తులు, భడోహి కార్పెట్లు, కచ్‌కు చెందిన రాగి కళారూపాలు, ఎన్నో వాద్య పరికరాలు, వాటిచుట్టూ ఎన్నెన్నో కథలు ఈ విధంగా భారత దేశ కళలు , సంస్కృతిని ప్రతిబింబిస్తూ అది అత్యద్భుతంగా ఉంది. అంతే కాదు, ఆ కళాకారులకు తమ కళపట్ల గల గౌరవం, దానిని కాపాడుకోవాలన్నవారి తపన, నైపుణ్యం పట్ల ప్రేమ వంటివి ఎంతో ప్రేరణాత్మకమైనవి.”
“హునార్ హాత్ అనేది కళాకారులు తమ నైపుణ్యాలను ,పనితనాన్ని ప్రదర్శించే అద్భుత వేదిక. ఇది కళాకారుల కలలకు రెక్కలు తొడుగుతుంది. ఈ వేదిక వద్ద దేశ భిన్నత్వాన్ని గుర్తించకుండా ఉండడం అసాధ్యం, అంతేకాదు,
హస్తకళలను ప్రదర్శించడంతోపాటు భారతదేశంలోని భిన్న వంటకాలనూ ఇక్కడ రుచి చూడవచ్చు. ఒకే లైనులో ఇడ్లీ-దోశ, చోళె-భతురె, దాల్- బాతి, ఖమాన్- ఖాండ్వి...ఇలా ఒకటేమిటి అన్నీ ఇక్కడ రుచి చూడవచ్చు. నేను బీహార్ కు చెందిన రుచికరమైన లిట్టి- చోఖాను బ్రహ్మాండంగా ఆస్వాదించాను. దేశవ్యాప్తంగా ఈ తరహా ఎగ్జిబిషన్లు , ప్రదర్శనలు ఎప్పటకప్పుడు నిర్వహించడం జరుగుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశం గురించి తెలుసుకోవడానికి ఇలాంటి వాటికి హాజరుకండి. స్వయంగా అనుభూతి పొందండి.దీనివల్ల మీరు దేశ కళలు, సంస్కృతికి సంబంధించి విస్తృత కాన్వాస్‌లో భాగం కాగలుగుతారు. తద్వారా కష్టపడి పనిచేసే హస్తకళాకారులు, చేతి వృత్తులవారిని ,ప్రత్యేకించి మహిళల ప్రగతికి, సుసంపన్నతకు మీరు దోహద పడినవారౌతారు. ” అని ప్రధానమంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా ఇటీవల అమలులో ఉన్న లాక్‌డౌన్ సమయంలో చేతివృత్తుల వారు, హస్తకళాకారులు పెద్ద ఎత్తున అరుదైన దేశీయ కళారూపాలను తయారు చేశారు. వారు తదుపరి జరిగే “హునార్ హాత్” లో వీటిని ప్రదర్శించి, వాటిని విక్రయించేందుకు తీసుకురానున్నారు.
“హునార్ హాత్” లో సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత, పారిశుధ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు , మాస్క్‌ల వినియోగం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది.
దీనితోపాటు ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు “జాన్ భి,జహాన్ బి” పెవిలియన్ ఏర్పాటు కానుంది.“ ఆందోళనకు నో చెప్పండి, ముందస్తు జాగ్రత్తకు యస్ అనండి” అన్న నినాదంతో దీనిని నిర్వహించనున్నారు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2 డజన్లకు పైగా “హునార్ హాత్”ల ను దేశవ్యాప్తంగా నిర్వహించింది. దీనితో లక్షలాది హస్తకళాకారులు, చేతివృత్తులవారికి ఉపాది,ఉపాధి అవకాశాలు వీటి ద్వారా కల్పింపబడ్డాయి.
రానున్న రోజులలో “హునార్ హాత్” లను చండీఘడ్, ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జైపూర్, హైదరాబాద్, ముంబాయి, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, డెహ్రాడూన్, పాట్నా, నాగపూర్, రాయ్‌పూర్,పుదుచ్చేరి, అమృత్‌సర్, జమ్ము, సిమ్లా, గోవా, కోచి, గౌహతి, భువనేశ్వర్, అజ్మీర్, అహ్మదాబాద్, ఇండోర్, రాంచి, లక్నో , మరికొన్ని ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు.
ఈసారి “హునార్ హాత్”లోని ఉత్పత్తులను ప్రజలు డిజిటల్, ఆన్‌లైన్ ద్వారా కూడా కోనుగోలు చేయవచ్చని శ్రీ నక్వి చెప్పారు.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ కళాకారుల పేర్లను , దేశీయంగా వారు తయారు చేసే ఉత్పత్తులను “ జిఇఎం ” (గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్)పై రిజిస్టర్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. పెద్ద ఎత్తున వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు పలు ఎగుమతుల ప్రోత్సాహక మండలులు ఆసక్తి కనబరుస్తున్నాయి. తిరిగి “హునార్ హాత్” నిర్వహించబోతుండడం పట్ల లక్షలాది నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, చేతివృత్తుల వారు సంతోషంతో ఉ న్నారని, ఎంతో ఆసక్తితో ఉన్నారని శ్రీ నక్వి తెలిపారు.
(Release ID: 1626398)
Visitor Counter : 333
Read this release in:
Bengali
,
Punjabi
,
Marathi
,
Assamese
,
Odia
,
Urdu
,
English
,
Manipuri
,
Hindi
,
Tamil
,
Malayalam