వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

రూ.1710 కోట్ల టర్నోవర్ సాధించిన సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (సీడ‌బ్ల్యూసీ)

- రూ.35.77 కోట్ల‌ మధ్యంతర డివిడెండ్‌ను కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు అందజేత‌

Posted On: 22 MAY 2020 5:45PM by PIB Hyderabad

2019-20 సంవ‌త్స‌రానికి గాను సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (సీడ‌బ్ల్యూసీ) అత్యధికంగా రూ.1710 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ నేప‌థ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శ్రీ‌వాస్త‌వ ఈ రోజు రూ.35.77 కోట్ల విలువైన‌ మ‌ధ్యంత‌ర డివిడెండ్ చెక్కును కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు అంద‌జేశారు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండేతో పాటుగా మంత్రిత్వ శాఖ మరియు సీడ‌బ్ల్యూసీ యొక్క ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఆయ‌న ఈ చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ సీడ‌బ్ల్యూసీ మేటి ప‌నితీరును ప్ర‌శంసించారు. 2019-20 సంవ‌త్స‌రానికి గాను సీడ‌బ్ల్యూసీ త‌న పెయిడ‌ప్ క్యాపిట‌ల్‌లో @95.53 శాతం మేర మధ్యంతర డివిడెండ్‌ను ప్ర‌క‌టించింది. గ‌త ఏడాది సంస్థ 72.20 శాతం మ‌ధ్యంత‌ర డివిడెండ్‌ను స‌ర్కారుకు చెల్లించింది. సంస్థలో భార‌త ప్ర‌భుత్వం క‌లిగి ఉన్న 55 శాతం ఈక్విటీకి స‌మానంగా సీడ‌బ్ల్యూసీ రూ.35.77 కోట్ల మేర మ‌ధ్యంత‌ర డివిడెండ్‌ ప్ర‌క‌టించింది. కాగా మొత్తంగా సంస్థ రూ.64.98 కోట్ల మేర మ‌ధ్యంత‌ర డివిడెండ్‌ను ప్ర‌క‌టించింది. సీడ‌బ్ల్యూసీ 2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించిన తుది డివిడెండ్‌ను వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో సంస్థ ప్ర‌క‌టించ‌నుంది.



(Release ID: 1626374) Visitor Counter : 167