మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

'స్వ‌యం' వేదిక‌పై జులై సెమిస్ట‌ర్ నుంచి 82 యూజీ, 42 పీజీ నాన్-ఇంజినీరింగ్ ఎంఓఓసీలు కోర్సులు అందుబాటులోకిః మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'

- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రస్తుత ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ నిబంధనల ప్రకారం విద్యార్ధులు ఈ కోర్సుల్ని అభ్య‌సించి క్రెడిట్లు పొందవచ్చుః మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి

Posted On: 21 MAY 2020 5:53PM by PIB Hyderabad

వివిధ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో న‌మోదైన‌ విద్యార్థులు 'స్వయం' కోర్సుల‌ను అభ్య‌సించ‌వ‌చ్చ‌ని, ఆయా కోర్సులను పూర్తి చేయడం ద్వారా త‌గిన‌ క్రెడిట్లను కూడా పొందవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రస్తుత ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ నిబంధనల ప్రకారం విద్యార్ధులు త‌గిన‌ క్రెడిట్లను పొందవచ్చని మంత్రి తెలిపారు. యూజీసీ ఇప్ప‌టికే 82 అండర్ గ్రాడ్యుయేట్ మ‌రియు 42 పోస్ట్ గ్రాడ్యుయేట్ నాన్-ఇంజినీరింగ్ ఎంఓఓసీ కోర్సుల‌కు సంబంధించిన జాబితాను యూజీసీ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ఉప ‌కుల‌ప‌తులు, ఆయా క‌ళాశాల‌ల‌కు చెందిన ప్రిన్సిపాల్స్‌తో పంచుకున్న‌ట్టుగా మంత్రి తెలిపారు. వ‌చ్చే జులై మాసం నుంచి ఆయా కోర్సులు  స్వ‌యం వేదిక‌పై www.swayam.gov.in అందించ‌బ‌డుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు. బయో కెమిస్ట్రీ / బయో టెక్నాలజీ / బయోలాజికల్ సైన్సెస్ & బయో ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, లా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కామర్స్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, గ‌ణితం, చ‌రిత్ర‌‌, హిందీ, సంస్కృతం వంటి స‌బ్జెక్టుల‌లో ఈ కోర్సులు  అందుబాటులో ఉండ‌నున్నట్టు మంతి తెలిపారు. ప్రస్తుతం నెల‌కొని ఉన్న కోవిడ్‌-19 మ‌హమ్మారి దృష్టాంతం నేప‌థ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, జీవితకాల అభ్యాసకులు, సీనియర్ సిటిజన్స్ మరియు గృహనిర్వాహకులు త‌దిత‌రులు త‌మ అభ్యాసక‌ పరిధులను విస్తృతం చేసుకోవ‌డానికి స్వ‌యం కోర్సుల్లో న‌మోదై త‌గు ప్రయోజనాలు పొందవ‌చ్చ‌ని తెలిపారు. స్వయం (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక విద్యా కార్యక్రమం. విద్యావిధానంను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డం, స‌మానత్వం మ‌రియు నాణ్య‌త అనే మూడు కార్డినల్ సూత్రాల‌ను సాధించే దిశ‌గా దీనిని రూపొందించారు. 


(Release ID: 1625873) Visitor Counter : 259