రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి కోవింద్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన ఏడు దేశాల కొత్త రాయబారులు
తమను తాము పరిచయం చేసుకున్న కొత్త రాయబారులు/హై కమిషనర్లు
భారత చరిత్రలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రెడెన్షియల్స్ సమర్పణ
Posted On:
21 MAY 2020 1:03PM by PIB Hyderabad
భారత్‌లో కొత్తగా నియమితులైన... డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సెనెగల్, ట్రినిడాడ్&టొబాగో, మారిషస్, ఆస్ట్రేలియా, కోట్ డి ఐవోరీ, రువాండా దేశాల రాయబారులు, హై కమిషనర్లు తమ నియామకానికి సంబంధించిన క్రెడెన్షియల్స్‌ను భారత రాష్ట్రపతికి సమర్పించారు.
తమను తాము పరిచయం చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రెడెన్షియల్స్ సమర్పణ, పరిచయ కార్యక్రమం జరిగింది.
ఈ విధంగా డిజిటల్ మాధ్యమంలో పరిచయ కార్యక్రమం సాగడం రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే ప్రథమం. కొవిడ్-19 సృష్టించిన సమస్యలను అధిగమించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి సాయపడుతోందని చెప్పారు. డిజిటల్ రూపంలో జరిగిన ఈ పరిచయ వేడుకను, దిల్లీలోని దౌత్య సమాజంతో భారత్‌కు ఉన్న సంబంధాలలో ప్రత్యేక రోజుగా రాష్ట్రపతి అభివర్ణించారు. భారత ప్రజలతోపాటు, ప్రపంచ పురోగతి కోసం డిజిటల్ రంగంలో ఉన్న అపరిమిత అవకాశాలను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
కొవిడ్-19 సంక్షోభం గతంలో ఎన్నడూ ఎదురుకాని సవాళ్లను ప్రపంచం ఎదుట ఉంచిందని, ప్రపంచ దేశాల మధ్య మరింత ఎక్కువ సహకారానికి పిలుపునిచ్చిందని రాయబారులను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ చెప్పారు. కొవిడ్‌పై పోరాటంలో తోటి దేశాలకు సాయపడడంలో భారత్ ముందు వరుసలో ఉందని వెల్లడించారు.
రాష్ట్రపతికి క్రెడెన్షియల్స్ సమర్పించిన రాయబారులు/ హై కమిషనర్లు:
1. మిస్టర్ చో హుయ్ చోల్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి
2. మిస్టర్ అబ్దుల్ వహాబ్ హైదరా, సెనెగల్ రిపబ్లిక్ రాయబారి
3. డాక్టర్ రోజర్ గోపాల్, ట్రినిడాడ్&టొబాగో రిపబ్లిక్ హై కమిషనర్
4. శ్రీమతి శాంతిబాయ్ హనూమన్‌జీ, మారిషస్ రిపబ్లిక్ హై కమిషనర్
5. మిస్టర్ బారీ రాబర్ట్ ఓ ఫారెల్, ఆస్ట్రేలియా హై కమిషనర్
6. M. N’DRY ఎరిక్ కామిల్లె, రిపబ్లిక్ ఆఫ్ కోట్ డి ఐవోరీ రాయబారి
7. జాక్వెలిన్ ముకాంగిరా, రువాండా రిపబ్లిక్ హై కమిషనర్
డిజిటల్ మాధ్యమంలో జరిగిన ఈ పరిచయ కార్యక్రమం, భారతదేశ డిజిటల్ దౌత్య కార్యక్రమాలకు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
*****
(Release ID: 1625759)
Visitor Counter : 338