సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

గర్భిణీ అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు హాజరు కాకుండా సిబ్బంది వ్య‌వ‌హారాలు, శిక్షణ శాఖ (డిఓపిటి) మినహాయింపు

దివ్యాంగులకు కూడా కార్యాలయాల హాజరుకు ఇదే తరహా మినహాయింపు

Posted On: 20 MAY 2020 8:16PM by PIB Hyderabad

గర్భిణులైన మహిళా అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు హాజరు కావడానికి సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డిఓపిటి)  మినహాయింపు ఇచ్చింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి వ్యవహారాల కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా); ప్రధానమంత్రి కార్యాలయంలో   సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదులు, పింఛన్ల శాఖ, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు ఒక సర్కులర్ జారీ చేయడం జరిగిందని, కేంద్రప్రభుత్వంలోని భిన్న మంత్రిత్వశాఖలు,  రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు దాన్ని ఆచరిస్తాయని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇప్పటికే మెటర్నిటీ సెలవుపై లేని మహిళా గర్భిణీ ఉద్యోగులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అలాగే దివ్యాంగులకు కూడా కార్యాలయాలకు హాజరు కావడానికి అదే తరహా మినహాయింపు ఇచ్చారు.

ఒకే సారి రెండు రకాల తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్న ప్రభుత్వోద్యోగులు, లాక్ డౌన్ నాటికే ఏవైనా వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు సిజిహెచ్ఎస్/  సిఎస్ (ఎంఏ) నిబంధనల ప్రకారం చికిత్స చేస్తున్న వైద్యుని ప్రిస్క్రిప్షన్ సమర్పించడం ద్వారా ఇదే తరహా మినహాయింపు పొందవచ్చు.

ఒకే సారి రద్దీని నివారించేందుకు అన్ని శాఖలు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పోయే సమయంలో దశలవారీ రాకపోకల సమయం అనుసరించడం తప్పనిసరి. అలాగే ఉద్యోగులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు; ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటలు;  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్యన మూడు పనివేళలు అనుసరించాలని  ఆయా శాఖల అధిపతులకు ఆదేశాలివ్వడం జరిగింది. 

విభిన్న శాఖల డిప్యూటీ సెక్రటరీ, ఆ పై హోదా గల అధికారులు అన్ని పని దినాల్లోనూ కార్యాలయాలకు హాజరు కావలసి ఉంటుంది. అంతకన్నా తక్కువ హోదా గల అధికారులు, సిబ్బంది అందరూ రోజు విడిచి రోజు సగం మంది వంతున హాజరు కావాలి. కార్యాలయాలకు రాని వారు ఇంటి నుంచే పని చేస్తూ టెలిఫోన్ లోను, ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉండాలి.

లాక్ డౌన్ కాలం అంతా పూర్తి కట్టుబాటుతో విధులు కొనసాగించినందుకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బందిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.  కార్యాలయాలు తెరిచే రోజుల్లో సాధారణంగా పని చేయని వారంతపు దినాల్లో కూడా తమ శాఖ సిబ్బంది కొంత మంది ఇంటి నుంచే పని చేసినట్టు ఆయన చెప్పారు.

కార్యాలయాలన్నీ సాధారణంగా పని చేసేలాల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని, అదే సమయంలో అధికారుల సంక్షేమం, భద్రతను విస్మరించలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
 



(Release ID: 1625757) Visitor Counter : 205