మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

హిందీలో ఇగ్నో అందించనున్నఆన్ లైన్ మాస్టర్ కోర్సును ప్రారంభించిన కేంద్ర హెచ్ఆర్ డి మంత్రి

Posted On: 20 MAY 2020 8:10PM by PIB Hyderabad

ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహణలోని ఎంఏ (హిందీ) ఆన్ లైన్ కోర్సును మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ “నిశాంక్” ఫేస్ బుక్ లైవ్ సెషన్ ద్వారా బుధవారం ప్రారంభించారు. “పఢే ఇండియా ఆన్ లైన్” కార్యక్రమాన్ని ఇలాంటి కోర్సులు పటిష్ఠం చేస్తాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి అన్నారు. అలాగే ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించడంలో ఇగ్నో కృషిని ప్రశంసించారు. మన దేశంలోనే కాకుండా మారిషస్, ఫిజీ, సురినామ్ వంటి దేశాల్లో హిందీకి గల ప్రాధాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

జాతీయ డిజిటల్ లైబ్రరీ (ఎన్ డిఎల్), స్వయం, స్వయంప్రభ, దీక్ష వంటి కార్యక్రమాలు, ఇతర వేదికలు దేశంలో లక్షలాది మందికి డిజిటల్ విద్య అందించడానికి సహాయకారిగా ఉన్నాయని, ఆ దిశగానే ఇగ్నో తీసుకున్న చర్య ఆ కార్యక్రమాలకు మరింత ఊపు ఇస్తుందని మంత్రి అన్నారు. విద్యావసతులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఆన్ లైన్ విద్యను అందుబాటు ధరల్లో విస్తరించడానికి ప్రభుత్వ కట్టుబాటును ప్రకటిస్తూ ఈ విషయంలో ఇగ్నో కీలక పాత్ర తోసిపుచ్చలేనిదని ఆయన పునరుద్ఘాటించారు.

ఇగ్నో ప్రవేశపెట్టిన ఇతర ఆన్ లైన్ కోర్సుల గురించి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసఱ నాగేశ్వరరావు వివరించారు. అలాగే ఆన్ లైన్ లో ఉన్నత విద్యా వ్యాప్తికి చేపట్టిన పలు చొరవలను మంత్రికి వివరించారు.

మంత్రి మార్గదర్శకత్వం, అనుమతి, ప్రోత్సాహం లేనిదే ఎంఏ హిందీ ఆన్ లైన్ కోర్సు సాధ్యం అయ్యేది కాదని ఇగ్నో ప్రో విసి ప్రొఫెసర్ సత్యకామ్ అన్నారు. హిందీ భాష, సాహిత్యాలను ఎంతో  ప్రోత్సహించే వ్యక్తి విద్యామంత్రి కావడం తనకు, తన బృందానికి ఆనందదాయకమని ఆయన చెప్పారు.
 
ఎంఏ హిందీతో పాటు గాంధీజీ, శాంతి అధ్యయనాలు అనే అంశం ఎంఏ, పర్యాటక అధ్యయనాలపై బిఏ కోర్సులు  కూడా ఆన్ లైన్ ఎంఏ కోర్సు ప్రారంభించినట్టు అరబిక్ భాష, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ల్లో సర్టిఫికెట్ కోర్సులు కూడా ఇగ్నో ప్రారంభించింది. 

www.iop.ignouonline.ac.in పోర్టల్ ద్వారా ఇగ్నో ఆన్ లైన్ కోర్సులు అందిస్తోంది. వాటిలో వీడియోలు, ఆడియో లెక్చర్లు, ట్యుటోరియల్స్ ఉన్నాయి. వెబ్ సైట్ పై క్లిక్ చేయడం ద్వారా వాటిని పొందవచ్చు. ఇగ్నోకు చెందిన జ్ఞానదర్శన్ టివి చానల్, జ్ఞానధార,  ఫేస్ బుక్ వంటి ఆన్ లైన్ వేదికల ద్వారా ఈ సెషన్లలో పాల్గొనవచ్చు.
 

***



(Release ID: 1625756) Visitor Counter : 180