సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా పిలుపునిచ్చిన ఎం.ఎస్.ఎం.ఈ. కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ

Posted On: 20 MAY 2020 5:21PM by PIB Hyderabad

కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పరచడమే కాకుండా, విదేశీ పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు సాగాలని ఎం.ఎస్.ఎం.ఈ.లు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి పిలుపునిచ్చారు. ఈ రంగానికి ప్రధాని ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని మధ్యస్థ, చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగించుకుని తిరిగి కార్యక్రమాల్లోకి రావాలని ఆయన తెలిపారు. ఈ రోజు నాగ్ పూర్ నుంచి రెండు వేర్వేరు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కాన్ఫరేషన్ ఆఫ్ ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి, ఈ ప్యాకేజీ స్థానిక స్వదేశీ పరిశ్రమను నూతన మార్గంలో శక్తివంతం చేస్తుందని తెలిపారు.

శ్రీ గడ్కరీ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి గణనీయంగా సహాయపడుతుందని తెలిపారు. మార్చి 31 నాటికి దాదాపు 6 లక్షల ఎం.ఎస్.ఎం.ఈ.లను పునర్నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ సంఖ్యను మరో 25 లక్షల వరకూ చేర్చనున్నారు. 10 వేల కోట్ల రూపాయల విలువైన మొత్తాన్ని ఇతర నిధులు జోడించి 50 వేటల కోట్ల మేర శక్తివంతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎం.ఎస్.ఎం.ఈ. లిక్విడిటీని ఈక్విటీ మార్కెట్ తో అనుసంధానించడం గురించి మంత్రి మాట్లాడారు. స్టాక్ మార్కెట్ బలంలో 7.5 శాతం పంచుకోవడం ద్వారా మంచి రేటింగ్ ఉన్న ఎం.ఎస్‌.ఎం.ఈ. యూనిట్లకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. అన్ని ఎం.ఎస్‌.ఎం.ఈ. బకాయిలను 45 రోజుల్లోగా నిర్ణయాల దిశగా ముందుకు తీసుకుపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, పెద్ద పరిశ్రమను కూడా ఇదే విధంగా చేయమని సూచించారు. ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు దాదాపు 40 వేల కోట్ల రూపాయల చెల్లింపులను విడుదల చేయడానికి మంత్రిత్వ శాఖ సమాధాన్ పోర్టల్ సహాయపడిందని ఆయన తెలియజేశారు. పెద్ద యూనిట్లకు సరఫరా ఆర్డర్ ఆధారంగా అటువంటి యూనిట్లకు రుణాలు అందించే పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎం.ఎస్‌.ఎం.ఈ. రంగానికి నిర్వచనం మార్చడంపై దృఢ నిశ్చయంతో ఉన్న కేంద్రమంత్రి, ఈ రంగంలో  పెట్టుబడి పరిమితిని పెంచడం పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఫలితంగా బ్యాంకుల నుంచి ఫైనాన్స్ పొందడం సులభం అవుతుందని, ఈ సవరణను ఈ రంగం చాలాకాలంగా డిమాండ్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా, గ్లోబల్ టెండర్ నిబంధనను సడలించడం చాలా గొప్ప దశ అని ఆయన తెలిపారు.

భూమి ధరలు తక్కువగా ఉన్న ప్రతిపాదిత ఢిల్లీ -ముంబై గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే చుట్టూ పారిశ్రామిక నడవలను ఏర్పాటు చేసే దిశగా యోచించాలని శ్రీ గడ్కరీ పరిశ్రమ ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రతిపాదనలన్నింటికీ తాను సిద్ధంగా ఉన్నానని, ఈ దిశగా పరిశ్రమకు సహాయం చేస్తానని తెలిపారు.

***



(Release ID: 1625638) Visitor Counter : 203