యు పి ఎస్ సి

పరీక్షల కొత్త క్యాలెండర్‌ను జూన్ 5వ తేదీ సమావేశం అనంత‌రం ప్ర‌క‌టించ‌నున్న యూపీఎస్‌సీ

Posted On: 20 MAY 2020 6:49PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షల మూడవ దశ తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) బుధ‌వారం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. తాజాగా ప‌లు ఆంక్షల పొడిగింపుల‌ను గమనించిన క‌మిష‌న్‌, ప్రస్తుతానికి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదనే  నిర్ణ‌యానికి వ‌చ్చింది. కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాలు ప్రకటించిన ప్రగతిశీల సడలింపులను కమిషన్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంది. నాలుగో ద‌శ లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితిని మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. గత రెండు నెలలుగా వాయిదా వేసిన ఆయా పరీక్షలు మరియు ప‌లు ఇంటర్వ్యూలను గురించి అభ్యర్థులకు కొంత స్పష్టత ఇచ్చేందుకు గాను కమిషన్ జూన్ 5వ తేదీన జ‌ర‌గ‌బోయే తదుపరి సమావేశంలో పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను జారీ చేయ‌నుంది. జూన్ 5, 2020 న కమిషన్ సమావేశం తరువాత కొత్త పరీక్షల వివ‌రాల‌తో కూడిన క్యాలెండర్‌ను యూపీఎస్‌సీ త‌న వెబ్‌సైట్‌లో ప్రచురించ‌నుంది. (Release ID: 1625573) Visitor Counter : 125