ప్రధాన మంత్రి కార్యాలయం

ఆయుష్మాన్ భారత్ యొక్క ఒక కోటవ లబ్ధిదారు తో సంభాషించిన ప్రధాన మంత్రి

ఆయుష్మాన్ భారత్ తో సంబంధితులైన వైద్యులు, నర్సులు మరియు ఇతరులందరి కృషి కి ఆయన ప్రశంస లు పలికారు

తక్కువ ఖర్చు లో ఉన్నతమైన నాణ్యత కలిగిన వైద్య సంరక్షణ మరియు పోర్టబిలిటీ లు ఆయుష్మాన్ భారత్ తాలూకు అతి పెద్ద లబ్ధి అని పేర్కొన్న ప్రధాన మంత్రి

Posted On: 20 MAY 2020 11:31AM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి ని మించిపోయినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

ఈ సంఖ్య 1 కోటి ని అధిగమించడం భారతదేశం లో ప్రతి ఒక్కరి ని గర్వపడేటట్టు చేస్తుంది అని ప్రధాన మంత్రి ట్విటర్ లో వరుస గా పొందుపరచిన వాక్యాల లో భాగం గా పేర్కొన్నారు. 

‘‘రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో ఈ యొక్క కార్యక్రమం అంత మంది జీవనం పైన ఒక సానుకూల ప్రభావాన్ని ప్రసరింప చేసింది.  లబ్ధిదారులందరి ని మరియు వారి కుటుంబాల ను నేను అభినందిస్తున్నాను.  వారి కి మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

ఆయుష్మాన్ భారత్ తో సంబంధితులైనటువంటి వైద్యులు, నర్సులు మరియు ఇతరులందరి ప్రయాస లను ఆయన ప్రశంసించారు.

‘‘వారి ప్రయత్నాలు ఈ యోజన ను ప్రపంచం లో అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం గా తీర్చిదిద్దాయి.  ఈ కార్యక్రమం భారతీయుల లో అనేక మంది యొక్క, ప్రత్యేకించి పేద ప్రజల యొక్క మరియు ప్రాథమిక సౌకర్యాల నుండి వంచితులైన వారి యొక్క విశ్వాసాన్ని చూరగొన్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, అతి పెద్ద ప్రయోజనాలలో పోర్టబిలిటీ ఒకటి అని తెలిపారు.

శ్రీ మోదీ తన యొక్క మరొక ట్వీట్ లో, ‘‘లాభితుల కు వారు నమోదు చేసుకొన్న ప్రాంతంలోనే కాకుండా భారతదేశం లోని ఇతర ప్రాంతాల లో సైతం అగ్రగామి నాణ్యత కలిగినటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి వైద్యపరమైన సంరక్షణ ను పొందేందుకు అవకాశం ఉన్నది.  ఇంటి కి దూరం గా పని చేసే వారికి గాని, లేదా తమ స్వస్థలం కానటువంటి నివాసిత ప్రాంతం లో పేరు ను నమోదు చేసుకొన్న వారి కి గాని ఇది ఎంతో సహాయకారి గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

వర్తమాన పరిస్థితి లో ఆయుష్మాన్ భారత్ యొక్క లబ్ధిదారుల తో తాను మమేకం కాలేకపోతున్నానని ప్రధాన మంత్రి అన్నారు.  అయినప్పటికీ, ఆయుష్మాన్ భారత్ తాలూకు ఒక కోటవ లబ్ధిదారు అయిన మేఘాలయ నివాసి పూజ థాపా తో టెలిఫోన్ లో ఆయన సంభాషించారు.
 


(Release ID: 1625442) Visitor Counter : 372