మంత్రిమండలి

ఎన్ బి ఎఫ్ సి లు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్రవ్యత్వ సమస్యకు ప్రత్యేక పథకానికి కాబినెట్ ఆమోదం

Posted On: 20 MAY 2020 2:19PM by PIB Hyderabad

ప్రత్యేక ద్రవ్యత్వ పథకం ప్రారంభించటానికి ఆర్థిక మంత్రిత్వశాఖ చేసిన  ప్రతిపాదనకు  ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్  ఆమోదం తెలియజేసింది. ఈ పథకం కింద నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి)లతో బాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ( హెచ్ఎఫ్ సి లు) తమ ద్రవ్యత్వాన్ని మెరుగుపరచుకోగలుగుతాయి

ఆర్థిక ప్రభావం:

ప్రభుత్వం మీద నేరుగా రూ. 5 కోట్ల ప్రభావం ఉంటుంది. అది స్పెషల్ పర్పస్ వెహికిల్ ( ఎస్ పి వి) లో వాటా రూపంలో ఉంటుంది. గ్యారెంటీ అమలులోకి వచ్చేవరకూ తప్ప అంతకు మించి ప్రభుత్వం మీద ఎలాంటి భారమూ పడదు. అయితే, అమలులోకి రాగానే గ్యారెంటీ పరిమితికి లోబడి మాత్రమే బకాయి మొత్తానికి ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. గ్యారెంటీ పరిమితి మొత్తం రూ.30,000 కోట్లుగా నిర్ణయించమైంది. అవసరాన్నిబట్టి ఈ మొత్తాన్ని పెంచవచ్చు.

పథకం వివరాలు:

నాన్ బాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు నగదు సమస్యలు ఎదుర్కోకుండా చూసేందుకు ప్రభుత్వం ఒక నిబంధనావళి ప్రతిపాదించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక ద్రవ్యత్వ పథకం రూపొందించింది. బకాయి పడ్డ అప్పుల నిర్వహణకోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి దాని ప్రత్యేక సెక్యూరిటీలను భారతీయరిజర్వ్ బాంక్ ( ఆర్ బి ఐ) మాత్రమే  కొనుగోలు చేస్తుంది. భారత ప్రభుత్వం దానికి హామీదారుగా ఉంటుంది. అలా అమ్మిన సెక్యూరిటీల ద్వారా వచ్చిన మొత్తాన్ని  నాన్ బాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా స్వల్పకాలిక ఋణాలకోసం వాడుకుంటాయి.  ఈ పథకాన్ని ఆర్థిక సేవల విభాగం పర్యవేక్షిస్తుంది. మార్గదర్శకాలను కూడా అదే విభాగం విడుదల చేస్తుంది.

కార్యాచరణ క్రమం

రాని బకాయిల నిర్వహణ కోసం ఒక పెద్ద  ప్రభుత్వ రంగ బ్యాంకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేస్తుంది, అది వడ్దీతో కూడిన ప్రత్యేల సెక్యూరిటీలను జారీచేస్తుంది. రిజర్వ్ బాంక్ మాత్రమే సెక్యూరిటీల కొనుగోలు చేసే ఆ సెక్యూరిటీలకు భారత ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. ఆ విధంగా అవసరానికి అనుగుణంగా జారీచేసే సెక్యూరిటీల బకాయి రూ. 30,000 కోట్లకు మించకుండా చూస్తూ అవసరాన్నిబట్టి పెంచుకుంటూ పోతుంది. స్పెషల్ పర్పస్ వెహికిల్ జారీ చెసిన సెక్యూరిటీలను రిజర్వ్ బాంక్ కొనటం ద్వారా వచ్చే మొత్తాన్ని స్వల్పకాలిక రుణాల చెల్లింపుల కోసం వాడతారు.  స్వల్పకాలిక అంటే అర్హులైన ఎన్ బి ఎఫ్ సి లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో మూడు నెలల పరిమితి లోపు గడువు ఉన్న పెట్టుబడులు మాత్రమే.

ప్రభావం:

పాక్షిక ఋణ హామీ పథకంలో వివిధ ప్రభుత్వ రంగ బాంకులు, నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బహుళ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఇందులో నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ చరాస్తులను అమ్మవలసి వస్తుంది. ఆ విధంగా ప్రభుత్వ రంగ బాంకులనుంచి నిధులు పొందుతాయి. అయితే, ఇప్పుడు ప్రతిపాదించిన పథకం వల్ల స్పెషల్ పర్పస్ వెహికిల్ కు, నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మధ్య దగ్గరి దారి ఏర్పడినట్టవుతుంది. చరాస్తుల అమ్మకానికి పాల్పడకుండా నగదు సమకూర్చుకునే వెసులుబాటు కలుగుతుంది.  అదే సమయంలో  అవి జారీచేసే బాండ్స్ కు మెరుగైన రేటింగ్ వస్తుంది. ఈ పథకం అమలు చాలా సులభతరంగా ఉండటంతోబాటు నాన్ బాంకింగ్ రంగం నుంచి నిధుల ప్రవాహానికి సాయపడుతుంది.

 

ప్రయోజనాలు:

నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అదనపు ద్రవ్యత్వం కల్పించటం మీద 2020-21 బడ్జెట్ ప్రసంగంలో  ప్రకటించిన విధంగా  పాక్షిక ఋణ హామీ పథకం ( పి సి జిన్ ఎస్ ) ద్వారా  విధి విధానాలు రూపొందించవలసి ఉంది. దీనివలన ఇప్పటిదాకా ప్రభుత్వం, రిజర్వ్ బాంక్ తీసుకున్న  ద్రవ్యత్వ చర్యలకు ఇది అదనంగా ఉపయోగపడుతుంది. ఈ పథకం నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాస్ సంస్థలు రుణాలివ్వటానికి వనరులు కల్పించటం ద్వారా వాస్తవ ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది.

నేపథ్యం:

నాన్ బాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అదనపు ద్రవ్యత్వం కల్పించటం మీద 2020-21 బడ్జెట్ ప్రసంగంలో  ప్రకటించిన విధంగా పాక్షిక ఋణ హామీ పథకం ( పి సి జిన్ ఎస్ ) ద్వారా  విధి విధానాలు రూపొందించవలసి ఉంది.  పైన పేర్కొన్న బడ్జెట్ హామీని దృష్టిలో ఉంచుకోవటంతోబాటు    కోవిడ్ -19 కారణంగా ఉత్పన్నమైన పరిస్థితి నేపథ్యంలో అర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయవలసిన అత్యవసర పరిస్థితి నెలకొన్నది.(Release ID: 1625438) Visitor Counter : 315