ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

రెవిన్యూ షేరింగ్ పై బొగ్గు / లిగ్నైట్ అమ్మకం కోసం బొగ్గు మరియు లిగ్నైట్ గనులు / బ్లాకులు వేలం వేయడానికి అనుసరించవలసిన విధివిధానాల అమలును మంత్రి మండలి ఆమోదించింది.

బొగ్గు నుండి గరిష్ట ఆదాయానికి ఆధారపడటం నుండి మార్కెట్లో గరిష్ట బొగ్గును త్వరగా అందుబాటులోకి తెచ్చే విధానంలో ఒక నమూనా మార్పు

ఈ విధానం తగినంత పోటీని అనుమతిస్తుంది, ఇది బ్లాకుల మార్కెట్ ధరలను కనుగొనటానికి మరియు బొగ్గు బ్లాకులు వేగంగా అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది

మైనింగ్ లీజు ప్రాంతంలో బొగ్గు బెడ్ మీథేన్ యొక్క వాణిజ్య వినియోగాన్ని అనుమతించారు.

బొగ్గు గనుల నుండి ముందుగా బొగ్గు ఉత్త్పత్తి చేసిన పక్షంలో రెవిన్యూ షేర్ చెల్లింపుల్లో రాయితీ ఇస్తారు.

పరిశుభ్రమైన బొగ్గు ఎంపిక - గ్యాస్ తయారుచేయడానికి లేదా ద్రవ రూపంలో వినియోగం లేదా విక్రయానికి రాయితీ.

భారీ పెట్టుబడి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది.

అనియంత్రిత రంగాల అనుసంధాన వేలంలో కోకింగ్ బొగ్గు అనుసంధానం యొక్క పదవీకాలం 30 సంవత్సరాల వరకు పెంచబడింది.

Posted On: 20 MAY 2020 2:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్ధిక వ్యహారాల క్యాబినెట్ కమిటీ రెవిన్యూ షేరింగ్ పై బొగ్గు / లిగ్నైట్ అమ్మకం కోసం బొగ్గు మరియు లిగ్నైట్ గనులు / బ్లాకులు వేలం వేయడానికి అనుసరించవలసిన విధివిధానాలను ఆమోదించింది. 

ఈ విధానంలో రెవిన్యూ వాటా ఆధారంగా వేలం వేస్తారు.  వేలందారులు ప్రభుత్వానికి చెల్లించే రెవిన్యూ వాటా శాతం ను వేలంలో పేర్కొనవలసి ఉంటుందిరెవిన్యూ వాటాలో ప్రారంభ ధర 4 శాతంగా  ఉండాలి.     రెవెన్యూ వాటా 10 శాతం వరకు  0.5 శాతం చొప్పున గుణిజాలలో వేలం అంగీకరిస్తారు. ఆ తర్వాత రెవిన్యూ వాటాలో 0.25 శాతం చొప్పున గుణిజాలలో వేలాన్ని అంగీకరిస్తారు. బొగ్గు గని నుండి బొగ్గు విక్రయం మరియు/లేదా వినియోగంపై ఎటువంటి పరిమితి ఉండదు

మార్కెట్లో గరిష్ట బొగ్గును త్వరగా అందుబాటులో ఉంచడానికి ఈ పద్దతి ఆధారితమైనది. ఇది తగినంత పోటీని కూడా అనుమతిస్తుంది.  ఇది బ్లాకుల మార్కెట్ ధరలను కనుగొనటానికీ  మరియు బొగ్గు బ్లాకులు వేగంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది.  బొగ్గు నిక్షిప్తాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అధిక పెట్టుబడులు ముఖ్యంగా మైనింగ్ రంగంలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని కల్పిస్తాయి. అదేవిధంగా, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. 

విజయవంతమైన బిడ్డర్ నెలవారీ చెల్లింపులు చేయవలసి ఉంటుంది,   చెల్లింపులను ఉత్పత్తిలో భాగంగా పరిగణిస్తారు :

i.    రెవిన్యూ భాగంలో శాతంగా పరిగణిస్తారు (ఫైనల్ బిడ్)

ii.    ఆ నెలలో చట్టబద్ధమైన రాయల్టీ చెల్లించాల్సిన బొగ్గు పరిమాణం మరియు 

iii.  అంచనా ధర లేదా వాస్తవ ధర ఏది ఎక్కువైతే అది.

బొగ్గు గని యొక్క అంచనా భౌగోళిక నిల్వల విలువలో 0.25% ముందుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలి.  అయితే, చెల్లించవలసిన ముందస్తు మొత్తం పైన పేర్కొన్న పద్ధతిలో వాస్తవ గణన ప్రకారం లేదా క్రింద పేర్కొన్న గరిష్ట పరిమితి ప్రకారం, ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాలి. : -

గనిలో భౌగోళిక నిల్వలు 

 

(మెట్రిక్ టన్నుల లో ) 

ముందుగా చెల్లించవలసిన మొత్తంలో 

గరిష్ట పరిమితి (రూపాయలు- కోట్లలో )

200 వరకు 

100

200 పైన 

500

మైనింగ్ లీజు ప్రాంతంలో ఉన్న సిబిఎం యొక్క వాణిజ్య వినియోగాన్ని కూడా ఇది అనుమతిస్తుంది.

ఈ పద్దతి బొగ్గు గని నుండి బొగ్గును ముందస్తుగా ఉత్పత్తి చేసే సంఘటనలలో, అదేవిధంగా,  మరియు బొగ్గు గని నుండి వార్షిక ప్రాతిపదికన గ్యాసిఫికేషన్ లేదా ద్రవీకరణ కోసం వినియోగించిన లేదా విక్రయించిన బొగ్గు మొత్తం పరిమాణం ఆధారంగా,  ఆదాయ వాటాలో రిబేటులను అందించడం ద్వారా విజయవంతమైన బిడ్డర్‌కు ప్రోత్సాహకాలను అందిస్తుంది.   

బొగ్గు గనుల వేలం / కేటాయింపుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం బొగ్గు గనులు ఉన్న రాష్ట్రాలకు వస్తుంది.  ఈ పద్దతి వెనుకబడిన ప్రాంతాల పెరుగుదల మరియు అభివృద్ధికీ, అదేవిధంగా, గిరిజనులతో సహా అక్కడ నివసించే వారికి ఉపయోగపడుతుంది.   పెరిగిన ఆదాయం వారికెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దేశంలోని తూర్పు భాగంలోని రాష్ట్రాలు ముఖ్యంగా ఈ విధానం ద్వారా  ప్రయోజనం పొందుతాయి

అనియంత్రిత రంగాల అనుసంధాన వేలంలో కోకింగ్ బొగ్గు అనుసంధానం యొక్క పదవీకాలం 30 సంవత్సరాల వరకు పెంచబడింది.

 

 

******


(Release ID: 1625424) Visitor Counter : 247