రైల్వే మంత్రిత్వ శాఖ

19 రోజుల్లో "శ్రామిక్ ప్రత్యేక" రైళ్ల ద్వారా మొత్తం 21 లక్షలకు పైగా ప్రయాణీకులను తమ స్వంత రాష్ట్రాలకు కు చేర్చడం ద్వారా భారతీయ రైల్వేలు మరో రికార్డు సాధించాయి

2020 మే నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా మొత్తం 1595 "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లు నడిపాయి.


ప్రయాణీకులకు ఉచితంగా భోజనం, త్రాగు నీరు అందజేశారు.

Posted On: 19 MAY 2020 7:37PM by PIB Hyderabad

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస, కూలీలు యాత్రీకులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర వ్యక్తులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వంత రాష్ట్రాలకు చేర్చాలన్న దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల నేపథ్యంలో, భారతీయ రైల్వేలు "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లను నడపాలని నిర్ణయించింది. 

2020 మే నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలనుండి  మొత్తం 1595 "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లు నడిచాయి.   21 లక్షల మందికి పైగా ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణించి తమ స్వంత రాష్ట్రాలుకు చేరుకున్నారు.  

ఈ 1,595 ప్రత్యేక రైళ్లు - ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి కేంద్రపాలితప్రాంతం, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.  

ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్లు - ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్, మణిపూర్, మిజోరాం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి వివిధ రాష్ట్రాలలో తమ ప్రయాణాన్ని ముగించాయి.  

రైలు ఎక్కే ముందు ప్రయాణీకులందరినీ క్షుణ్ణంగా  పరీక్షించారు.  ప్రయాణ సమయంలో, ప్రయాణీకులందరికీ, ఉచితంగా భోజనం, త్రాగునీరు అందజేశారు. 

****



(Release ID: 1625209) Visitor Counter : 172