శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ ఛాలెంజ్ కోవిడ్ -19 పోటీలో (C3) లో పాల్గొంటున్న సామాన్య ప్రజల శాస్త్రసాంకేతిక ఆధారిత వినూత్న పరిష్కారాలు మార్పు తీసుకువావడానికి సిద్ధంగా ఉన్నాయి.
Posted On:
17 MAY 2020 6:02PM by PIB Hyderabad
నేషనల్ ఇన్నొవేషన్ పౌండేషన్ - ఇండియా (ఎన్.ఐ.ఎఫ్) శాస్త్ర సాంకేతిక విభాగానికి చెందిన స్వతంత్ర సంస్థ. ఇది కోవిడ్-19 సవాలు పొటీ(సి3) ద్వారా శాస్త్ర సాంకేతిక ఆధారిత పలు వినూత్న పరిష్కారాలను గుర్తించింది. ఈ ప్రచారం 31 మార్చి నుంచి 10 మార్చి 2020 వరకు నిర్వహించారు. వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు సాధించ కలిగిన పౌరులు ఎవరైనా ప్రస్తుత మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ఆలోచనలు పంచుకునేందుకు దీనిని నిర్వహించారు.
ఆసక్తిగల పౌరుల నుంచి వచ్చిన ఇలాంటి ఆలోచనలను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు అవసరమైన ఇంక్యుబేషన్, మెంటారింగ్ మద్దతును ఎన్.ఐ.ఎఫ్ కల్పిస్తుంది. ఈ ప్రచారం కింద మందుకు వచ్చిన వాటిలో ఒకటి, చేతులు కడుగుకోవడానికి, చేతులను క్రమిరహితం చేసుకోవడానికి కాలుతో పనిచేయించే పరికరం, మరొకటి, శానిటైజేషన్‌కు ఉపయోగించే వినూత్న స్ప్రేయర్. ఈ రెండు వినూత్న ఆవిష్కరణలకు ఈ ప్రచారం కింద మద్దతునివ్వడం జరిగింది.
ఆలోచనల ను పెంపొందించడానికి, మరింత వ్యాప్తి చెందేలా చేయడానికి ఎన్‌ఐఎఫ్ ఇంక్యుబేషన్, మెంటరింగ్ మద్దతును అందిస్తోంది. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన శ్రీ ముప్పరాపు రాజు చేతిని శుభ్రపరచడం , కడగడం కోసం కాలితో నిర్వహించే పరికరాన్ని రూపొందించారు, ఇది ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితులలో వాతావరణంలో కాంటాక్ట్‌లెస్ పరికరాల అవసరానికి వీలుగా ఇది ఒక సమయానుకూల పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఇది చేతిని తాకకుండా, కాలితో తొక్కడం ద్వారా పరికరాన్ని ఆపరేట్ చేయడం ద్వారా సబ్బు , నీటిని పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. తత్ఫలితంగా, దీనిని వినియోగించేవారు , శానిటైజర్ , సబ్బు లేదా నీటిని చేతితో తాకాల్సిన అవసరం లేదు, ఇవి ఈ పరికరంలో భాగంగా ప్రత్యేక కంటైనర్లలో తగినంతగా నిల్వ ఉంటాయి.దీని విలువ పెంపు కోసం , ఉత్పత్తి అవసరాలను నెరవేర్చడంలో ఈ ఆవిష్కర్తకు ఎన్ఐఎఫ్ మద్దతును ఇచ్చింది.
ఇక మరో ఆవిష్కరణ విశాలమైన ప్రదేశాలు అంటే రోడ్లు, సమాజంలోని వివిధ ప్రదేశాలు, తలుపులు,, గోడలు వంటి పెద్ద ప్రాంతాలను శుభ్రపరచడానికి లేదా కడగడానికి ఉపయోగపడే ఒక వినూత్న స్ప్రేయర్ రూపకల్పన. ఈ స్ప్రేయర్‌లో అల్యూమినియం రెండు రేడియల్ ఫాన్లు ఒకదానికొకటి ఎదురుగా కదులుతాయి . ఇందులోని ఒక్కొక్క ఫ్యాను రెండు వ్యతిరేక దిశలలో గాలిని పీల్చుకుంటుంది ఆ తర్వాత ఈ గాలిని అధిక పీడనంతో నాజిల్ ద్వారా చిన్న చిన్న బిందువులతో బయటకు వస్తుంది. ఈ ప్యానల్ 180 డిగ్రీలు తిరిగినపుడు ఇది భూమి నుంచి 15 అడుగుల ఎత్తుగోడను కూడా కవర్ చేయగలదు. 15 హార్స్ పవర్ (హెచ్‌పి) ట్రాక్టర్ ను దీనిని పనిచేయించడానికి వాడవచ్చు. ఈ స్ప్రేయర్‌ను వాడి రోడ్లు, సొసైటీలలో మెషిన్‌నుంచి 30 అడుగుల దూరం వరకు , 15 అడుగుల ఎత్తువరకు స్ర్పే చేయవచ్చు. అంటే ఈ యంత్రం ద్వారా సమాంతరంగా 30 అడుగులు, 15 అడుగుల ఎత్తు ప్రదేశాన్ని శుభ్రం చేయవచ్చు. ఫలితంగా కాంపౌండ్ లు, తలుపులు వంటివాటిని స్ప్రేయర్‌తో సులభంగా శుభ్రపరచవచ్చు. విశాలమైన ప్రదేశంలోను, ఇరుకైన ప్రదేశంలోనూ శానిటైజ్ చేయడానికి వీలుగా నాజిల్‌లను రూపొందించారు.
కోవిడ్ -19 పరిష్కారాలు చర్యలలో మన పౌరుల భాగస్వామ్యం, యాజమాన్యం సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయడం అనేది ఎన్.ఐ.ఎఫ్ ఛాలెంజ్ లో ముఖ్యమైనది. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన వారి ఆలోచనలకు ఇది గుర్తింపు, ప్రోటోటైపింగ్ సహాయం ఆచరణకు వీలు కల్పించడం ద్వారా మన క్షేత్రస్థాయి ఆవిష్కర్తలు వ్యవస్థాపకులను బలోపేతం చేస్తుంది.. అని డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
ఈ స్ప్రేయర్‌ను మహారాష్ట్రలోని సాతన, నాసిక్ తదితర ప్రదేశాలలో వాడుతున్నారు.
కోవిడ్ -19 పరిష్కారల ఆవిష్కరణల పోటీ (సి3)లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దీనివల్ల శాస్త్ర సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు సాధించి ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో దేశానికి సహాయపడడానికి అవకాశం కలుగుతోంది
కోవిడ్ -19 సాంకేతిక పరిజ్ఞానం ఔచిత్యం , వీటిని రూపొందించిన, ప్రోటోటైప్ చేసిన చివరికి సామాజిక , వాణిజ్య వ్యాప్తికి అందుబాటులోకి తెచ్చిన వేగం వీటన్నింటినీ గమనించినపుడు ఎన్.ఐ.ఎఫ్ క ఛాలెంజ్ కోవిడ్ -19 పోటీ సి-3 ని సామాన్య ప్రజలు బాగా అంగీకరించారనే వాస్తవాన్నిఇది నిర్ధారిస్తుంది. వినూత్న ఆవిష్కరణలు దేశాన్ని ప్రస్తుత సంక్షోభాన్ని జయించటానికి సహాయపడతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.
( మరిన్ని వివరాలకు , సంప్రదించండి తుషార్ గార్గ్ tusharg@nifindia.org మొబైల్ : +91-9632776780. )
(Release ID: 1624831)
Visitor Counter : 229