ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అత్యధిక కోవిడ్-19 కేసులున్న 30 పురపాలక ప్రాంతాల అధికారులతో మాట్లాడిన ఆరోగ్య శాఖ కార్యదర్శి

కోవిడ్-19 నివారణ, నిర్వహణ చర్యలపై సమీక్ష

కోలుకున్న వారి శాతం 35.09% కి పెరుగుదల

Posted On: 16 MAY 2020 6:55PM by PIB Hyderabad

దేశంలో ప్రబలిన కొవిడ్-19 కేసుల్లో 80% వాటా కలిగి అత్యంత ప్రభావం చూపుతున్న 30 మున్సిపల్ ప్రాంతాల మున్సిపల్ కమిషనర్లు, ఆ ప్రాంతాలున్న జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్డి శ్రీ రాజేష్ భూషణ్, ఇతర అధికారులు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లోని 30 మున్సిపల్ ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు. 

పట్టణ ప్రాంతాల్లో కోవిడ్-19 నిర్వహణ కు తాజాగా మార్గదర్శకాలు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలలో అత్యధిక స్థాయిలో కోవిడ్-19 వ్యాప్తి చెందడానికి మూల కారణాలు, మరణాలు, డబ్లింగ్ రేటు, మిలియన్ మందిలో ఎంతమందికి పరీక్షలు జరుగుతున్నాయి, భౌతిక దూరం పాటించడంలో అవలంభిస్తున్న విధానాలు,  ప్రమాద హేతువులు వంటి వివరాలను కేంద్ర రాష్ట్ర అధికారులు లోతుగా పరిశీలనలు చేశారు.  

కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించడానికి భౌగోళిక ప్రాంతాల స్పష్టమైన విభజన, వాటిలో నివాస ప్రాంతాలు, వారికి వ్యాధి సోకె ప్రమాదకర పరిస్థితులు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలని కేంద్ర అధికారులు మున్సిపల్ ప్రాంతాల అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అత్యంత జనసమ్మర్ధం ఉన్న వాడలు, వీధుల్లో తీసుకునే చర్యలే మనకు సవాళ్లుగా ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా అత్యధిక స్థాయిలో కోవిడ్-19 పై దృష్టి సారించి, ఆయా ప్రాంతాలలో ఇతర సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. రాబోయేది వర్షాకాలం కావడంతో ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తెలిపారు. విశ్వాసాన్ని నమ్మకాన్ని పాదుగొల్పాలని కేంద్ర అధికారులు స్థానిక అధికారులకు సూచించారు. మంచి ఫలితాలు చూపుతున్న కొన్ని ప్రయోగాలను కూడా అధికారులు ఈ సందర్బంగా తెలిపారు. ఈ ప్రయత్నాల్లో వివిధ సామజిక వర్గాల నాయకుల సహకారం కూడా చాల అవసరమని కేంద్ర అధికారులు తెలిపారు. 

ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 30,150 మంది కోలుకున్నారని, గడచినా 24 గంటల్లోనే 2233 మంది వ్యాధి నుండి బయటపడ్డారని అధికారులు వివరించారు. కోవిడ్-19కి సంబంధించి అధికారికమైన, విశ్వసనీయ సమాచారం, సలహాల కోసం : https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA సైట్ ద్వారానే తెలుసుకోవాలని అధికారులు తెలిపారు. కోవిడ్-19కి సంబంధించిన సాంకేతిక సమస్యల పరిష్కారానికి  technicalquery.covid19[at]gov[dot]in ;ఇతర సమస్యలకు ncov2019[at]gov[dot]in ; మరియు @CovidIndiaSeva ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.హెల్ప్ లైన్ నంబర్లు  : +91-11-23978046 లేదా 1075 (Toll-free). రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెల్ప్ లైన్ నంబర్లు తెలుసుకోవాలంటే చూడాల్సిన సైట్: 

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

*****



(Release ID: 1624570) Visitor Counter : 161