హోం మంత్రిత్వ శాఖ

స్ట్ర‌క్చ‌ర‌ల్ రిఫార్మ్స్‌ కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించిన నిర్మాణాత్మ‌క సంస్క‌ర‌ణ‌లను ప్ర‌శంసించిన కేంద్ర హో్ంమంత్రి అమిత్ షా

బ‌ల‌మైన‌,భ‌ద్ర‌మైన,సాధికార‌త క‌లిగిన భార‌త్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముందున్నఅత్యంత ప్రాధాన్య‌తా అంశం: అమిత్ షా
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంత్ర‌మైన రిఫ్మార్మ్‌, పెర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్ అన‌ది గ‌త 6 సంవ‌త్స‌రాలుగా భార‌త దేశ అద్భుత ప్ర‌గ‌తికి కీల‌కంగా ఉంటూ వ‌చ్చింది.: హోంమంత్రి

Posted On: 16 MAY 2020 8:02PM by PIB Hyderabad

 

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లాసీతారామ‌న్ ఈరోజు ప్ర‌క‌టించిన నిర్మాణాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌ను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్ర‌శంసించారు. ఈరోజు ప్ర‌క‌టించిన కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించి  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి  శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతార‌మ‌న్ కు  కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాన్నారు ఈ నిర్ణ‌యాలు త‌ప్ప‌కుండా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ,  అలాగే ఆత్మ‌నిర్భ‌ర బార‌త్ దిశ‌గా మ‌నం సాగిస్తున్న కృషిని బ‌లోపేతం చేస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంత్ర‌మైన రిఫార్మ్‌, పెర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్ లు గ‌త 6 సంవత్స‌రాల‌లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని ఆయ‌న అన్నారు.
 బొగ్గు రంగంలో భార‌త‌దేశాన్ని స్వ‌యం సమృద్ధం చేసేందుకు మున్నెన్న‌డూ లేని రీతిలో తీసుకున్న చ‌ర్య‌ల‌కు ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రిని అభినందించారు. బొగ్గురంగంలో మౌలిక స‌దుపాయాల అభివృద్దికి రూ 50,000 కోట్ల రూపాయ‌ల నిధి ఏర్పాటు, వాణిజ్య మైనింగ్  ప్రారంభం వంటివి స్వాగ‌తించ‌ద‌గిన విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ని ఆయ‌న అన్నారు. ఇవి ఈ రంగంలో మ‌రింత పోటీ, పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకురానున్నాయ‌న్నారు.
"రక్షణ తయారీ రంగంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్‌.డి.ఐ) పరిమితిని 74 శాతానికి పెంచడం , ఎంపిక‌చేసిన‌ ఆయుధాలు, ప్లాట్‌ఫారమ్‌ల దిగుమతిని ఆయా సంవత్సరాల  వారీగా రూపొందించిన టైమ‌టేబుల్ ప్ర‌కారం నిషేధించడం  'మేక్ ఇన్ ఇండియాను బ‌లోపేతం చేస్తుంది.  అలాగే మన దిగుమతి భారాన్ని తగ్గిస్తుంది". బలమైన, సురక్షితమైన , సాధికార‌త‌ కలిగిన భారతదేశం, శ్రీ న‌రేంద్ర మోడీ ప్రభుత్వం ముందున్న అత్యంత‌ ప్రాధాన్యతా అంశ‌మ‌ని , హోంమంత్రి అన్నారు.
ఏవియేషన్ రంగానికి ఊపునిచ్చే భవిష్యత్ నిర్ణయాలకు , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోడీకి, హోంమంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. "ఎయిర్ స్పేస్ వినియోగంపై ఆంక్షలను సడలించడం ద్వారా, మన విమానయాన రంగానికి సంవత్సరానికి సుమారు 1000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా, భారతదేశాన్నిఎయిర్ క్రాఫ్ట్‌ MRO కోసం ప్రపంచ హ‌బ్ గా మార్చడానికి ఎం.ఆర్‌.ఒ కోసం పన్ను విధానాల‌ను హేతుబద్ధం చేయడం జ‌రిగింది" అని ఆయన అన్నారు.
   అంతరిక్ష, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ప్రైవేటు రంగాల ఉనికిని పెంచే నిర్ణయం గురించి హోంమంత్రి మాట్లాడుతూ, సామాజిక మౌలిక సదుపాయాలలో ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంచడానికి రూ .8100 కోట్లు పునరుద్ధరించిన వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి ఈరోజు తీసుకున్న‌ నిర్ణయాలకు ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీని నేను అభినందిస్తున్నాను అని శ్రీ అమిత్ షా అన్నారు.  అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగం పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ద్వారా వారు భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో సహ ప్రయాణికులు కావ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు.



(Release ID: 1624551) Visitor Counter : 158