హోం మంత్రిత్వ శాఖ

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తుఫాను సంసిద్ధతను సమీక్షించేందుకు క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన‌ ఎన్‌సీఎంసీ సమావేశం

Posted On: 16 MAY 2020 5:26PM by PIB Hyderabad

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తుఫాను విష‌య‌మై సంసిద్ధతను గురించి స‌మీక్షించేందుకు గాను క్యాబినెట్‌ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) స‌మావేశం ఈ రోజు జ‌రిగింది. బంగాళాఖాతం స‌ముద్రంలో పొంచి ఉన్న తుఫాను సన్నాహాలను సమీక్షించే దిశ‌గా ఈ స‌మావేశం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తుఫానుగా మారే అవకాశం ఉందని ఇది మే 20 నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మ‌ధ్య తీరంను దాటే అవకాశం ఉందని భార‌త వాతావర‌ణ శాఖ (ఐఎండీ) స‌మావేశం అందించి‌న నేప‌థ్యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఐఎండీ స‌మాచారం మేర‌కు భారీ నుండి అతి భారీ వర్షపాతంతో పాటుగా అధిక వేగంతో కూడిన గాలులు మరియు భారీ స‌ముద్ర‌పు అల‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సమావేశంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, తుఫాను వల్ల ఉత్ప‌న్న‌మ‌య్యే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తమ సంసిద్ధతను తెలిపారు. దీనికి తోడు తుఫాన్ కార‌ణంగా మత్స్యకారులను చేప‌ల వేట‌కు సముద్రంలోకి ప్రవేశించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. ముంద‌స్తు చ‌ర్య‌ల‌లో భాగంగా తుఫాను షేల్ట‌ర్ల‌ను సిద్ధం చేశారు. ప్ర‌భావిత ప్రాంతాల‌లోని వ్యక్తులను త‌ర‌లించేందుకు ఆయా ‌ప్రాంతాలు గుర్తించబడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్, సాయుధ దళాలు మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తంగా ఉండ‌డంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. వారు తమను తాము తగినంతగా ప్రతిపాదిస్తున్నారు. కేంద్ర హోం వ్య‌వ‌హ‌రాల శాఖ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత కేంద్ర సంస్థలతో నిరంత‌రాయంగా సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. ఈ స‌మావేశంలో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి ప్రస్తుత పరిస్థితిని స‌మీక్షించారు. దీనికి తోడు సహాయక చర్యలకు సంసిద్ధతను కూడా తెలుసుకున్నారు. అవసరం మేర‌కు త‌గు  విధంగా తక్షణ సహాయం అందించాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు అలాగే ఐఎండీ, ఎన్‌డీఎంఏ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్ర‌భావిత రాష్ట్రాల‌ ప్రభుత్వాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.



(Release ID: 1624520) Visitor Counter : 169