పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పి.ఎమ్.యు.వై. లభిదారులతో సంభాషించిన - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.

పి.ఎమ్.జి.కే.వై. కింద ఇంతవరకు 6.28 కోట్ల కంటే ఎక్కువ ఉచిత సీలిండర్లను పొందిన - పి.ఎమ్.యు.వై. లబ్ధిదారులు

పి.ఎమ్.యు.వై. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డి.బి.టి. ద్వారా 8,432 కోట్ల రూపాయలు బదిలీ.

కోవిడ్-19 సమయంలో తమకు ఉపశమనం కలిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు.

Posted On: 16 MAY 2020 12:53PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు వెబినార్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 1500 కు పైగా పి.ఎమ్.యు.వై. లభ్డిదారులు, గ్యాస్ పంపిణీ దారులు, ఓ.ఎం.సి. అధికారులతో సంభాషించారు. 

ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పి.ఎమ్.యు.వై.) విజయవంతంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందని శ్రీ ప్రధాన్ తెలియజేశారు.  ఈ పధకం 8 కోట్ల మందికి పైగా పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజల జీవితాల్లో మెరుగుదలకు దారి తీసింది.  కోవిడ్-9 ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపిందనీ, ధనికులను కూడా తప్పించలేదని మంత్రి అన్నారు. భారతదేశం వివిధ మార్గాల ద్వారా ఈ మహమ్మారిపై పోరాడుతోంది.  అదే సమయంలో, పేద, అణగారిన ప్రజల ప్రయోజనాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.  ఉపశమనం కోసం అనేక సహాయక చర్యలు ప్రకటించడం జరిగింది.  ఈ సంక్షోభం ప్రారంభంలోనే మోడీ ప్రభుత్వం  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. పి.ఎమ్.యు.వై. లబ్ధిదారులకు మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సీలిండర్లు అందజేయాలని ఈ పధకంలో ఒక ముఖ్యమైన అంశము. ఈ పధకాన్ని పొందడానికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) ద్వారా 8.432 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఆయన చెప్పారు ఇంతవరకు 6.28 కోట్ల కంటే ఎక్కువ మంది పి.ఎమ్.యు.వై. లబ్ధిదారులు ఉచిత సీలిండర్లు పొందారు

ఎల్.పి.జి.  సిలిండర్ల ఉత్పత్తి, దిగుమతి మరియు పంపిణీని కొనసాగించడంలో, సంక్షోభ సమయంలో మరియు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో సందర్భానికి తగినట్లు కృషి చేసిన ఓ.ఎమ్.సి.  అధికారుల పాత్రను మంత్రి ప్రశంసించారు.  అనేక ఇతర దేశాలతో పోలిస్తే, కోవిడ్ -19 తో జరిగిన పోరాటంలో భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని ఆయన అన్నారు.  సరైన సమయంలో ధైర్యంగా, సరైన నిర్ణయాలు తీసుకున్నందుకు, ఈ  గొప్పతనమంతా  ప్రధానమంత్రికీ, ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచి, ప్రతిస్పందిస్తున్న దేశ ప్రజలకు   దక్కుతుందని ఆయన అన్నారు. సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ఉపయోగించడం మొదలైన ప్రభుత్వ సూచనలను ప్రజలు ఖచ్చితంగా పాటిస్తున్నారని ఆయన అన్నారు.  దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిని పునరుద్ధరించడానికి సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.  కోవిడ్-9 కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భారత ఆర్ధిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రికీ, ఆర్ధిక మంత్రికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు.   సమాజంలోని అన్ని రంగాలు, సమాజంలోని వివిధ విభాగాలకు ఈ ప్యాకేజీ కింద ఉపశమనం లభిస్తున్నట్లు ఆయన చెప్పారు.  దేశంలో ఆత్మనిర్భార్ అభియాన్‌ను ప్రారంభించాలన్న ప్రధానమంత్రి ప్రకటనను కూడా ఆయన స్వాగతించారు, ఇది దేశంలో దేశీయ తయారీని ప్రోత్సహించి, మనల్ని స్వావలంబన దిశగా చేస్తుంది.

అనంతరం, పి.ఎమ్.యు.వై. లబ్ధిదారులు తమ అనుభవాలను వివరించారు.  అసాధారణ సంక్షోభ సమయంలో తమను జాగ్రత్తగా చూసుకున్నందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  చాలా పేదరికంలో ఉండి కూడా,  ఏవిధంగా మొదటిసారి వారు గ్యాస్ కనెక్షన్ పొందినదీ చాలా మంది ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారుగ్యాస్ కనెక్షన్,  సిలిండర్ కలిగి ఉండడం వారి జీవితాలను ఏ విధంగా మార్చిందీ వారు వివరించారు.  తమ ఇళ్లలో ఎల్.పి.జి.  సిలిండర్లు  ఉండడం వల్ల తమ జీవితాలు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, భద్రంగా ఉండడంతో పాటు,  ఇంధన సేకరణ కోసం కష్టపడకుండా, ఉచిత నాణ్యమైన సమయం కలిసివస్తోందని వారు పేర్కొన్నారు.   ఇప్పుడు కూడా చాలా తక్కువ వ్యవధిలో సిలిండర్ రీఫిల్ పొందుతున్నామని, వారిలో చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.   సీలిండర్ల సరఫరాలో నిర్విరామంగా సేవలందిస్తున్న కరోనా యోధులకు వారు ధన్యవాదాలు తెలిపారు. 

***** 



(Release ID: 1624478) Visitor Counter : 177