రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మురియాట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ధరను రూ.19000 నుండి రూ.17500 లకు తగ్గించిన ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్)
Posted On:
15 MAY 2020 4:44PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) మురియాట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రసుత్తం ఉన్న ఒక్క ఎంటీ ఎంఓపీ ధరను రూ. 19000 నుంచి రూ. 17500 లకు తగ్గించాలని ఐపీఎల్ నిర్ణయించింది. అంటే ఈ చర్యలతో ఒక్క సంచీ ఎంఓపీ ధర దాదాపు రూ.75 మేర తగ్గనుంది. తాజా తగ్గింపు ఈ నెల 18వ తేదీ నుంచి అమలులోకి రానుంది. మొక్కల పెరుగుదల మరియు నాణ్యతకు పొటాషియం క్లోరైడ్ అని కూడా పిలువబడే మురియాట్ ఆఫ్ పొటాష్ ఎంతో అవసరం. ప్రోటీన్లు మరియు చక్కెరల ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల్లో నీటి పరిమాణాన్ని నిర్వహించడం తద్వారా ఇది చిత్తుడిప్రతి నుండి రక్షిస్తుంది. ఇది మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆకులు వాటి ఆకారం శక్తిని కలిగి ఉండేలా చేస్తుంది. గత ఏడాది కాలంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారకపు విలువ గణనీయంగా బలహీనపడటంతో పాటు ఎంఓపీపై ప్రభుత్వ రాయితీని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎంటీకి రూ. 604కి సవరించినప్పటికీ రైతుల కోసం ధరను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ తెలిపింది.
రైతుల ఇన్‌పుట్ వ్యయం తగ్గుతుంది..
భారతీయ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) సంస్థ ఎండీ డాక్టర్ పీఎస్ గెహ్లౌట్ మాట్లాడుతూ ఈ చర్య ఎరువుల సమతుల్య వినియోగానికి దారితీస్తుందనే అంశాన్ని తాము హృదయపూర్వకంగా నమ్ముతున్నామని తెలిపారు. తమ చర్యతో ఎరువుల కోసం రైతుల వ్యయాన్ని తగ్గించడం మరియు సాగు దిగుబడిని పెంచడం అనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని ఉపకరిస్తుందని తెలిపారు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఎరువులను శాస్త్రీయంగా మరియు అవసరం మేరకే వాడడాన్ని ప్రోత్సహించేందుకు కంపెనీ ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుందని అన్నారు.
అభినందించిన మంత్రి సదానంద గౌడ..
ప్రస్తుత విపత్కర సమయంలో రైతులకు సహాయం చేసే విధంగా డాక్టర్ పీఎస్ గెహ్లౌట్, ఐపీఎల్
యాజమాన్యం తీసుకున్న ఈ చర్యను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అభినందించారు. కోవిడ్ -19 కాలంలో ఎంఓపీ ధరల తగ్గింపు రైతులకు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.
తక్కువ ఇన్‌పుట్ వ్యయం వ్యవసాయ ఉత్పత్తి రైతుల ఆదాయం పెరుగుదలకు దారితీస్తుందని అన్నారు.
(Release ID: 1624214)
Visitor Counter : 311