శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యువ పారిశ్రామికవేత్త పురస్కారం-2020 కోసం నామినేషన్లకు ఆహ్వానం
దేశవ్యాప్తంగా ఉన్న వందలాది ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లకు ఆహ్వానం
Posted On:
15 MAY 2020 6:39PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన, గుర్‌గావ్‌లోని ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఐఎన్‌ఏఈ), ఐఎన్‌ఈఏ యువ పారిశ్రామికవేత్త పురస్కారం-2020 కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఈ పురస్కారం కింద ఎంపిక చేసిన అభ్యర్థికి లేదా ముగ్గురు వ్యక్తులకు మించని బృందానికి ప్రశంసాపత్రం, 2 లక్షల నగదు బహుమతిని ఇస్తారు.
ఏడాదిలో ఇద్దరు అభ్యర్థులకు అందించే అవార్డును, యువ ఇంజినీర్లలో ఆవిష్కరణ శక్తిని, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, గుర్తించడానికి ఏర్పాటు చేశారు. పరిశ్రమలో గుర్తించిన, అమలు చేసిన ఇంజినీరింగ్ ఆవిష్కరణలు, కొత్త విధానాలకు అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. జనవరి 1, 2020 నాటికి 45 ఏళ్లకు మించని భారతీయ పౌరులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు.
ఆవిష్కరణలు, వ్యవస్థాపకతకు కలిపి అవార్డులకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. విద్య/పరిశోధన సంస్థలు లేదా పరిశ్రమకు చెందిన యువ ఆవిష్కర్తల నూతన ఇంజినీరింగ్/సాంకేతిక ఆలోచనలు విజయవంతమైన అంకుర సంస్థలుగా మారితే, అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తారు.
ఐఎన్ఏఈ యువ పారిశ్రామికవేత్త పురస్కారం-2020కు నామినేషన్లు కోరుతూ, ఆ సంస్థ ఐఎన్‌ఏఈ సభ్యులకు లేఖను పంపింది. డీఎస్‌టీ మద్దతుతో నడుస్తున్న ఇంక్యుబేటర్లు, డీఎస్‌టీ మద్దతు ఉన్న "నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్" (ఎన్‌ఎస్‌టీఈడీబీ) ద్వారా పనిచేస్తున్న ఇంక్యుబేటర్లు, డీఎస్‌టీ మద్దతుతో పనిచేస్తున్న "సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్క్" (ఎస్‌టీఈపీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) మద్దతు ఉన్న ఇంక్యుబేటర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (DeitY) సాయంతో నడుస్తున్న ఇంక్యుబేటర్లు, ఎంఎస్‌ఎంఈల ద్వారా పనిచేస్తున్న ఇంక్యుబేటర్లు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతు ఉన్న ఇంక్యుబేటర్లు వంటి, దేశవ్యాప్తంగా ఉన్న 372 ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లకు లేఖలు అందాయి. వీటికితోడు, 29 ఐఐటీ రీసెర్చ్ పార్కులకు కూడా నామినేషన్లు కోరుతూ లేఖలు అందాయి.
ఐఎన్‌ఏఈ వెబ్‌సైట్‌లో నామినేషన్లను ప్రారంభించారు. నామినేషన్ల సమర్పణకు తుది గడువు జూన్ 30, 2020. ఆసక్తివున్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.inae.infor వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
(Release ID: 1624207)