రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కాలుష్య ఉద్గార మరియు శబ్ద ప్రమాణాల సమ్మతికి సంబంధించి మోటారు వాహన నిబంధనలను సవరించడానికి సూచనల‌కు ఆహ్వానం

Posted On: 15 MAY 2020 4:48PM by PIB Hyderabad

ఉద్గార మరియు శబ్ద ప్రమాణాలకు అనుగుణంగా మోటారు వాహన నిబంధనలలో ప్రతిపాదిత సవరణపై సాధారణ ప్రజానీకంతో పాటు భాగ‌స్వామ్యప‌క్షాల వారంద‌రి నుంచి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సూచనలు, మ‌రియు అభిప్రాయాల‌ను ఆహ్వానించింది.
దీనికి సంబంధించిన గత 11న ఒక నోటిఫికేషన్ జారీ చేయబడింది. దీనిని www.morth. gov.in అనే వెబ్‌సైట్‌లో వీక్షించ‌వ‌చ్చు. ఫార‌మ్ నంః 22 స‌వ‌ర‌ణ‌కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 292 (ఈ) మే 11, 2020 జారీ చేయ‌బ‌డింది. రోడ్ వ‌ర్తీనెస్ సర్టిఫికేట్ విష‌య‌మై ఈ-రిక్షా లేదా ఈ-కార్టులు తయారీదారు లేదా దిగుమతిదారు లేదా రిజిస్టర్డ్ ఈ-రిక్షా లేదా ఈ-కార్ట్ అసోసియేషన్ వారు జారీ చేసిన ఉద్గార మరియు శబ్ద ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్ర‌తిపాదించారు. ఈ ఫార‌ములో సరళత కొరకు ఇప్పటికే ఉన్న రెండు పట్టికలను ఒకే పట్టికలోకి మార్చ‌డంతో పాటుగా తదుపరి దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని కాలుష్య పారామితులను కూడా జోడించ‌డ‌మైంది. ఈ విషయంలో సూచనలు లేదా వ్యాఖ్యలను జాయింట్ సెక్రటరీ (ఎంవీఎల్), రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, రవాణా భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ -110001 (ఈ-మెయిల్: jspb-morth[at]gov[dot]in) కు జూన్
10వ తేదీ, 2020 వరకు పంపించ‌వచ్చు.

 



(Release ID: 1624205) Visitor Counter : 160