వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆహార ధాన్యాలు, నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటల ఉత్పత్తులపై మూడో ముందస్తు అంచనా
రికార్డు స్థాయిలో ఉత్పత్తులు వస్తాయని అంచనాలు
గత ఐదేళ్ల సగటును అధిగమించేలా ఉత్పత్తి ఉంటుందని లెక్కలు
Posted On:
15 MAY 2020 2:14PM by PIB Hyderabad
2019-20 సంవత్సరంలో, ముఖ్యమైన ప్రధాన పంటల ఉత్పత్తులపై మూడో ముందస్తు అంచనాను 'వ్యవసాయ, సహకార &రైతుల సంక్షేమ విభాగం' విడుదల చేసింది. రుతుపవనాల సమయంలో (జూన్ నుంచి సెప్టెంబర్, 2019 వరకు) దేశంలో సంచిత వర్షపాతం దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) కంటే 10 శాతం అధికంగా నమోదైంది. ఈ కారణంగా, 2019-20 సంవత్సరంలో ఎక్కువ పంటల ఉత్పత్తులను సాధారణ కంటే ఎక్కువగా అంచనా వేశారు. భవిష్యత్తులో వచ్చే కచ్చితమైన సమాచారం ప్రకారం ఈ అంచనాలు మారతాయి.
మూడో ముందస్తు అంచనా ప్రకారం, 2019-20లో ప్రధాన పంటల ఉత్పత్తులు ఇలా ఉంటాయి:
ఆహార ధాన్యాలు - 295.67 మిలియన్ టన్నులు (రికార్డ్)
బియ్యం - 117.94 మిలియన్ టన్నులు (రికార్డ్)
గోధుమలు - 107.18 మిలియన్ టన్నులు (రికార్డ్)
చిరుధాన్యాలు - 47.54 మిలియన్ టన్నులు (రికార్డ్)
మొక్కజొన్న - 28.98 మిలియన్ టన్నులు (రికార్డ్)
పప్పుధాన్యాలు - 23.01 మిలియన్ టన్నులు
కందిపప్పు - 3.75 మిలియన్ టన్నులు
శనగపప్పు - 10.90 మిలియన్ టన్నులు
నూనెగింజలు - 33.50 మిలియన్ టన్నులు (రికార్డ్)
సోయాబీన్ - 12.24 మిలియన్ టన్నులు
రాప్‌సీడ్, ఆవాలు - 8.7 మిలియన్ టన్నులు
వేరుశనగ - 9.35 మిలియన్ టన్నులు
పత్తి - 36.05 మిలియన్ బేళ్లు (బేల్‌కు 170 కిలోలు) (రికార్డ్)
జనపనార & గోగునార- 9.92 మిలియన్ బేళ్లు (బేల్‌కు 180 కిలోలు)
చెరకు - 358.14 మిలియన్ టన్నులు
2019-20 మూడో ముందస్తు అంచనా ప్రకారం, దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 295.67 మిలియన్ టన్నులుగా ఉండనుంది. 2018-19లో సాధించిన 285.21 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఇది 10.46 మిలియన్ టన్నులు ఎక్కువ. అంతేగాక, గత ఐదేళ్ళ సగటు ఉత్పత్తితో (2014-15 నుంచి 2018-19 వరకు) పోలిస్తే 25.89 మిలియన్ టన్నులు ఎక్కువ.
2019-20లో మొత్తం బియ్యం ఉత్పత్తిని రికార్డు స్థాయిలో 117.94 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఐదేళ్ల సగటు ఉత్పత్తి 109.77 మిలియన్ టన్నుల కంటే ఇది 8.17 మిలియన్ టన్నులు ఎక్కువ.
2019-20లో గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 107.18 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. 2018-19లో గోధుమ ఉత్పత్తితో పోలిస్తే ఇది 3.58 మిలియన్ టన్నులు ఎక్కువ. అంతేగాక, 96.16 మిలియన్ టన్నుల సగటు గోధుమ ఉత్పత్తి కంటే 11.02 మిలియన్ టన్నులు ఎక్కువ.
చిరుధాన్యాల ఉత్పత్తి అంచనా రికార్డు స్థాయిలో 47.54 మిలియన్ టన్నులు కాగా, 2018-19లో సాధించిన 43.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి కంటే 4.48 మిలియన్ టన్నులు ఎక్కువ. సగటు ఉత్పత్తి కన్నా 4.50 మిలియన్ టన్నులు అధికం.
2019-20లో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి 23.01 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఇది గత ఐదేళ్ల సగటు ఉత్పత్తి 20.82 మిలియన్ టన్నుల కంటే 2.19 మిలియన్ టన్నులు ఎక్కువ.
2019-20లో దేశంలో నూనెగింజల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 33.5 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. 2018-19లో సాధించిన 31.52 మిలియన్ టన్నుల ఉత్పత్తి కంటే ఇది 1.98 మిలియన్ టన్నులు, సగటు ఉత్పత్తి కంటే 4.1 మిలియన్ టన్నులు అధికం.
2019-20లో దేశంలో చెరకు ఉత్పత్తిని 358.14 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.
పత్తి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 36.05 మిలియన్ బేళ్లు (బేల్‌కు 170 కిలోలు)గా అంచనా వేశారు. 2018-19లో సాధించిన 28.04 మిలియన్ బేళ్ల ఉత్పత్తి కంటే ఇది 8.01 మిలియన్ బేళ్లు ఎక్కువ. జనపనార, గోంగునార ఉత్పత్తిని 9.92 మిలియన్ బేళ్లుగా (ఒక్కో బేల్ 180 కిలోలు)గా అంచనా వేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1624142)
Visitor Counter : 335