సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ-కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్టీఐ కేసులను రేపట్నుంచి విచారించనున్న సీఐసి

'ఇంటి నుండి న్యాయం' భావనకు మార్గం చూపనున్న కేసుల ఆన్ లైన్ విచారణ: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 14 MAY 2020 3:21PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనెర్),  పిఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ (ఇండిపెండెంట్ ఛార్జ్) మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) రేపట్నుంచి జమ్మూ కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) దరఖాస్తుదారుల కేసుల విచారణను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ బిమల్ జుల్కాతో ఈ రోజు సమావేశం అయిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్, లడఖ్‌కు చెందిన దరఖాస్తుదారులు ఇంటి నుంచి ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయవచ్చని, సిఐసికి విజ్ఞప్తుల కోసం ఎవరూ బయట ప్రయాణించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇది "జస్టిస్ ఫ్రమ్ హోమ్" అనే కొత్త సంస్కృతికి తెర లేపుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు తమ మొదటి అప్పీల్ ను అందుకు నిర్దేశించిన అధికారులకు దాఖలు చేసుకోవచ్చు. సీఐసి ముందు  విచారణ నిమిత్తం  ఇంటి నుండే రెండో అప్పీల్ ను చేసుకునే సౌకర్యం ఉంటుంది. అంతే కాకుండా దరఖాస్తుదారులు  ఎపుడైనా ఆర్టిఐ ని ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవచ్చు. 

 

Description: C:\Users\MHA\Desktop\IMG_0540.JPG

 

జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019, జమ్మూ కశ్మీర్ సమాచార హక్కు చట్టం 2009, వాటి కింద ఉన్న నియమాలు రద్దు అయ్యాయి.  31.10.2019 నుండి సమాచార హక్కు చట్టం 2005 అమలు చేయబడిన నిబంధనలు ఇక్కడ ఆమోదించబడ్డాయి. జమ్మూ కశ్మీర్ ఆర్‌టిఐ చట్టం 2009 నుండి కేంద్ర ఆర్టీఐ చట్టానికి సజావుగా మారడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డిఓపిటి, కేంద్ర సమాచార కమిషన్ కార్యాలయాలు సమిష్టి కృషితో తీసుకున్నాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ఫలితంగా 2020 మే 10 వరకు, జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి 111 రెండవ అప్పీళ్లు / ఫిర్యాదులు (తాజా కేసులు) సిఐసిలో నమోదయ్యాయని మంత్రి తెలియజేశారు. సిపిఐఓలు, ఎఫ్‌ఎఎలకు శిక్షణ ప్రణాళిక సిద్ధం చేశారు. డిఓపిటి కి చెందిన ఆర్టిఐ ఆన్‌లైన్ పోర్టల్ పై జె అండ్ కె, లడఖ్ ప్రాధికారత నమోదు అవుతుంది. 

ప్రస్తుతం, సమాచార కమిషనర్లు అందరు కేసులను విచారిస్తున్నారు, సిఐసి ప్రధాన కార్యాలయం 33% అధికారిక సిబ్బందితో పనిచేస్తోంది. సీనియర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు తమ కార్యాలయం నుండి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారిస్తున్నారు.

 

                                                                         <><><><><>



(Release ID: 1623827) Visitor Counter : 119