గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో పోరాడటానికి భాగల్పూర్ స్మార్ట్ సిటీ వినూత్న సాంకేతిక కార్యక్రమాలను ఉపయోగిస్తోంది.

Posted On: 13 MAY 2020 5:17PM by PIB Hyderabad

భాగల్పూర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ (బి.ఎస్.సి.ఎల్.) వివిధ కార్యక్రమాలను ఉపయోగించి కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో నగర పరిపాలనకు సహకరిస్తోంది. బి.ఎస్.సి.ఎల్.  చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో -  అవగాహనను వ్యాప్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం;  లాక్ డౌన్ సమయంలో అనుభవాన్ని పంచుకోవడం కోసం వినూత్న ఐ.ఈ.సి. చర్యలు; బలహీన జనాభా కోసం ఆశ్రయాల ఏర్పాటు మరియు నిత్యావసర వస్తువులు, ఆహారం సరఫరా;  సానిటైజర్ల తయారీ మరియు పంపిణీ, మాస్కులుగ్లౌజులు పంపిణీ, డిస్-ఇన్ఫెక్షన్ టన్నెల్ వంటి ఇతర రక్షణ చర్యలు చేపట్టడం ఉన్నాయి

మార్గనిర్దేశం మరియు అవగాహనను వ్యాప్తి చేయడానికి, కోవిడ్ కు వ్యతిరేకంగా నగరం చేసే పోరాటానికి బి.ఎస్.సి.ఎల్. కు మద్దతు కు ఐ.ఈ.సి. మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మూలస్తంభంగా ఉంది. 

“మేరా భగల్పూర్” మొబైల్ యాప్  ప్రారంభించటానికి  బి.ఎస్.సి.ఎల్. మద్దతు ఇచ్చింది.  అవగాహనను కల్పించడానికి,  ఒకే సమయంలో ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి, ఈ మహమ్మారి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంపొందించడానికి,  ప్రజలను నిమగ్నం చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. 

“మేరా భగల్పూర్” మొబైల్ యాప్ లో ఈ కింద వివరించిన సౌకర్యాలు ఉన్నాయి.  

 

·       కోవిడ్-19 పై ప్రతీరోజు నగరానికి సంబంధించి తాజా సమాచారం. 

 ·       కోవిడ్-19 తో పోరాటంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు. 

 ·       ప్రభుత్వ శాఖల ముఖ్యమైన ప్రకటనలు 

 ·       వైద్యుల జాబితా. 

 ·       అన్ని ప్రభుత్వ శాఖల అత్యవసర నెంబర్లు 

 ·       స్వచ్చంద కార్యకర్తల జాబితా. 

 ·       క్విక్ కాంటాక్ట్ 

·       బి.ఎస్.సి.ఎల్. ఛానెల్

సరైన సందేశాలు వ్యాప్తి చెంది, అవి జనాభాకు చేరుకోవడానికి,  రేడియో మరియు ఎఫ్.ఎమ్. ఛానల్ యొక్క శక్తిని బి.ఎస్.సి.ఎల్. సమర్థవంతంగా  వినియోగించుకుంది.  బి.ఎస్.సి.ఎల్. ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తూ, కోవిడ్-19 తో ఎలా పోరాడాలనే దాని గురించి ఎఫ్.ఎమ్. ఛానల్ ద్వారా పౌరులతో మాట్లాడుతున్నారు.  దీనికి అదనంగా, ఎఫ్.ఎం.ఛానల్, ఈ-రిక్షా లతో పాటు ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారం  నగర పరిపాలన విషయాలను అదుపులో ఉంచడానికి ,  పౌరుల్లో  భయాందోళనలను తొలగించడానికి నగర పాలనాయంత్రాంగానికి సహాయపడుతోంది.  

"లాక్ డౌన్ కే పన్నీ" అనేది బి. ఎస్.సి.ఎల్. , దాని క్రియాశీల నాయకత్వం తీసుకున్న మరొక వినూత్న ఐ.ఇ.సి. కార్యక్రమం.  లాక్ డౌన్ సమయంలో ఎదురయ్యే  వివిధ అనుభవాల ఆధారంగా కొత్త కథనాన్ని పంచుకోవడం కోసం,  బి.ఎస్.సి.ఎల్. “లాక్ ‌డౌన్ కే పన్నీ” అనే ట్యాగ్‌లైన్‌తో కథ చెప్పే సిరీస్‌ను ప్రారంభించింది.  ప్రతి కథలో ఒక సానుకూల సందేశం ఉంటుంది.  ఇది పౌరుడి నైతికతను పెంపొందించడానికీ,  ఆత్మపరిశీలన చేసుకోడానికీ, అతను లేదా ఆమెలో నిబిడీకృతమై ప్రతిభను వెలికి తీయడానికీ సహాయపడుతుంది.  గృహిణులు కుటుంబం కోసం చేసిన త్యాగాల ప్రశంసలు,  ప్రకృతితో మమేకం కావడానికి వారిని ప్రేరేపిస్తాయి. కుటుంబంతో బంధాన్ని మెరుగుపరుస్తాయి.  భారతీయ సంస్కృతిపై అవగాహనను పెంచుతాయి. 

బి.ఎస్.సి.ఎల్. ఆహార పంపిణీని చేపట్టి,  నగరం అంతటా ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేసింది.  కొనసాగుతున్న జాతీయ లాక్ డౌన్ కారణంగా, అనేక పట్టణాలలోని పేదలు మరియు బి.పి.ఎల్. కుటుంబాల వారు  రోజువారీ అవసరాలకు కిరాణా సామాగ్రిని కొనడానికి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి తక్షణ సహాయం అవసరం. వీరిలో చాలా మంది రోజువారీ కూలి పనులు చేసుకునే వారు ఉన్నారు.  భాగల్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్తించబడిన ప్రాంతాల్లో  నాలుగు ఆహార పంపిణీ కేంద్రాల ఏర్పాటు చేసి నిర్వహించడానికి  బి.ఎస్.సి.ఎల్. మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత, నగరంలో ఇళ్లులేని ప్రజలకు మద్దతుగాభాగల్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ 10 షెల్టర్లను ఏర్పాటుచేసిందిఆరికి ఉచితంగా ఆహారం అందజేసింది. 

ఇంకా, హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తికి సహకరించడానికి బీఎస్సీఎల్ చొరవ తీసుకుంది.  ప్రభుత్వ శాఖలు, కరోనా యోధులకు, ఇతర ప్రజలకు శానిటైజర్ ను పంపిణీ చేశారు.  గ్లోవ్ లు, మాస్కుల కొరతను తీర్చడానికి వాటిని తయారుచేసే యంత్రాలను, కార్మికులను భాగల్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు బి.ఎస్.సి.ఎల్సమకూర్చారు.  ప్రభుత్వ శాఖలుకరోనా యోధులు, ప్రజలకు బి.ఎస్.సి.ఎల్. మాస్కులు, హ్యాండ్ గ్లోవ్ లు పంపిణీ చేసింది. 

హాని కలిగించే బహిరంగ ప్రదేశాలలో క్రిమి సంహారకాలు ఉండేలా చూడటానికి,  బిఎస్‌సిఎల్ క్రిమిసంహారక సొరంగాన్ని తయారుచేసి,  ఆరోగ్య కార్యకర్తలు,  రోగులు,  పౌరులందరినీ శుభ్రపరచడానికి మయగంజ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ‌లో  ఏర్పాటు చేశారు. 

 

 

****



(Release ID: 1623734) Visitor Counter : 207