సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఛాంపియ‌న్స్ పోర్ట‌ల్www.Champions.gov.in ను ప్రారంభించిన‌ ఎం.ఎస్‌.ఎం.ఇ మంత్రిత్వ‌శాఖ
ఇది సాంకేతిక‌ప‌రిజ్ఞానం స‌హాయంతో న‌డిచే కంట్రోల్ రూం, మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌
ఆధునిక ఐసిటి ఉప‌క‌ర‌ణాల ఆధారంగా హ‌బ్‌, స్పోక్ మొడ‌ల్‌లో కంట్రోల్ రూం నెట్‌వ‌ర్క్‌ల ఏర్పాటు
భార‌తీయ ఎంఎస్ఎంఇలు జాతీయ , అంత‌ర్జాతీయ ఛాంపియ‌న్లుగా గొప్ప‌గాఎదిగేలా చేయ‌డం దీని ల‌క్ష్యం

Posted On: 12 MAY 2020 11:15AM by PIB Hyderabad

కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వ‌శాఖ ఛాంపియ‌న్స్ పోర్ట‌ల్  పేరుతో www.Champions.gov.in టెక్నాల‌జీ ఆధారిత కంట్రోల్ రూమ్ క‌మ్ మేనేజే్‌మెంట్ సిస్ట‌మ్‌ను ప్రారంభించింది. ఈ సిస్ట‌మ్ అధునాత‌న ఐసిటి ఉప‌క‌ర‌ణాలు ఉప‌యోగించి భార‌తీయ ఎం.ఎస్.ఎం.ఇలు జాతీయ , అంత‌ర్జాతీయ ఛాంపియ‌న్లుగా ఎదిగేందుకు ఉప‌క‌రిస్తుంది.
ఈ చాంపియ‌న్స్ పోర్ట‌ల్‌, ఆధునిక ప్రాసెస్ వ్య‌వ‌స్థ‌తో ఔట్‌పుట్ పెంచ‌డం, జాతీయ‌స్థాయిలో ఈ సంస్థ‌ల బలాన్ని పెంచ‌డానికి  ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే ఈ పోర్ట‌ల్ పేరును ఛాంపియ‌న్స్ అని పెట్టారు.
   ఈ పోర్ట‌ల్‌కు ఛాంపియ‌న్ అన్నపేరును సూచించిన‌ట్టుగా , పోర్టల్ ప్రాథమికంగా చిన్న యూనిట్ల వారి  స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడం, వారిని ప్రోత్సహించడం,  మద్దతు ఇవ్వడం, సహాయం చేయడం , వాటిని చేయిప‌ట్టి ముందుకున‌డిపించ‌డం వంటివి చేస్తుంది. ఇది ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వ శాఖ  నిజమైన వన్-స్టాప్-షాప్ పరిష్కారం.
ఏప్రిల్ 30 సాయంత్రం ఎంఎస్‌ఎంఇ కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఇలకు సహాయపడటానికి  వాటిని, జాతీయ , అంతర్జాతీయ ఛాంపియన్లుగా ఎదిగేలా చేయ‌డానికి ఐసిటి ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఎకె శర్మ సూచించారు. దీని ప్రకారం, 2020 మే 9 న CHAMPIONS అని పిలువబడే సమగ్ర వ్యవస్థ ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించబడింది.
  ఇది టెక్నాలజీ ప్యాక్డ్ కంట్రోల్ రూమ్-కమ్-మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. టెలిఫోన్, ఇంటర్నెట్ , వీడియో కాన్ఫరెన్స్‌తో సహా ఐసిటి సాధనాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ , మెషిన్ లెర్నింగ్  సిస్టమ్ వంటి వాటి ద్వారా ప‌నిచేస్తుంది.. ఇది భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఫిర్యాదుల ప‌రిష్కార‌ పోర్టల్ CPGRAMS , ఎం.ఎస్‌.ఎం.ఇ మంత్రిత్వ శాఖ  ఇతర వెబ్ ఆధారిత విధానాలతో రియ‌ల్ టైమ్‌ ప్రాతిపదికన పూర్తిగా  అనుసంధానం చేయబడింది. మొత్తం ఐసిటి  నిర్మాణం ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్ఐసి సహాయంతో అంత‌ర్గ‌తంగ‌గానే  రూపొందింది. అదేవిధంగా, భౌతిక మౌలిక సదుపాయాలు  మంత్రిత్వ శాఖ డంపింగ్  రూమ్‌లో రికార్డు స‌మ‌యంలో సృష్టించడం జ‌రుగుతుంది.
 ఇందుకు సంబంధించిన‌   వ్యవస్థలో భాగంగా హబ్ , స్పోక్ మోడల్‌లో కంట్రోల్ రూమ్‌ల‌ నెట్‌వర్క్ ఏర్పాట‌వుతుంది.. హబ్ న్యూఢిల్లీలో , ఎం.ఎస్‌.ఎం.ఇ కార్య‌ద‌ర్శి, కార్యాలయంలో ఉంది.  రాష్ట్రాల‌లో స్పోక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన‌  వివిధ కార్యాలయాలు , సంస్థలలో ఉంటారు. ప్రస్తుతానికి, వ్యవస్థలో భాగంగా 66 రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాట‌య్యాయి.
     దీనికి సంబంధించిన‌ వివరణాత్మక ఆపరేటింగ్ విధానం జారీ చేయబడింది, అధికారులూ నియ‌మితుల‌య్యారు, వారికి   శిక్షణ ఇచ్చారు.
     మే 9 న,శ్రీ ఎకె శర్మ తన అధికారులు ,సిబ్బంది మధ్య ఛాంపియన్స్ వ్యవస్థ ను ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా దేశంలోని 120 ప్రదేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించారు
 ఈ ప్ర‌యోగాత్మ‌క  వ్యవస్థను ప్రారంభించేటప్పుడు, శ్రీ ఎకె శర్మ మాట్లాడుతూ, ఇది ఎం.ఎస్‌.ఎం.ఇ యూనిట్లకు  వాటిపై ఆధార‌ప‌డిన ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించబడింద‌ని అన్నారు. ఈ యూనిట్లకు,  ప్రజలకు త‌మ  సహాయం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.  ఈ సంస్థ‌ల‌కు  సహాయం చేయడానికి,వాటిని పున‌రుత్తేజితం చేయ‌డానికి, చైతన్యం నింపడానికి  తాము అన్నీ చేస్తామ‌న్నారు.(Release ID: 1623261) Visitor Counter : 159