మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ‌ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఒడిశా విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం భావోద్వేగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా హెల్ప్‌లైన్ “భరోసా” ను ప్రారంభించారు

Posted On: 11 MAY 2020 5:47PM by PIB Hyderabad

కోవిడ్ మ‌-19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో విద్యార్ధుల ఇబ్బందుల‌ను త‌గ్గించేందుకు , కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ది శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆప్ ఒడిశా హెల్ప్ లైన్‌ భ‌రోసాను  , దాని హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 08046801010ను వ‌ర్చువ‌ల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈరోజు న్యూఢి్ల్లీలో ఆవిష్క‌రించారు.  ఒడిశా లోని అన్ని విశ్వ‌విద్యాల‌యాల విద్యార్థుల‌కు సంజ్ఞానాత్మ‌క భావోద్వేగ పున‌రావాస సేవ‌లను క‌ల్పించ‌డం ఈ హెల్ప్‌లైన్ ల‌క్ష్యం. ఓడిశా రాష్ట్ర డిపార్ట‌మెంట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ మంత్రి డాక్ట‌ర్ అరుణ్ కుమార్ సాహూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆప్ ఒడిశా వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ ఐ.రామ‌బ్ర‌హ్మం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.
ఈ సందర్భంగా శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారి విరుచుకుప‌డిన  కారణంగా దేశం క్లిష్ట‌ దశలో ఉందని అన్నారు. ప్రధాన‌మంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో, ఈ అంటువ్యాధిని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయ‌న‌ ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడంలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కొత్త అక‌డెమిక్ క్యాలెండర్ , వర్చువల్ ఎడ్యుకేషన్ ప‌ద్ధ‌తికి సంబంధించి తీసుకున్న చర్యలపై ఆయన వివ‌రించారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల‌కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా ప్రారంభించిన హెల్ప్‌లైన్ ఆ దిశగా గొప్ప ముంద‌డుగు అని ఆయన నొక్కి చెప్పారు.  అధికారికంగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించి, విద్యార్థులు  వారి తల్లిదండ్రుల ప్రయోజనం కోసం హెల్ఫ్‌లైన్ నెంబ‌ర్‌ను వెల్ల‌డించారు. హెల్ప్‌లైన్ ను ప్రారంభించే  కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు ,వైస్ ఛాన్సలర్లు, వివిధ సంస్థల అధిపతులు, రిజిస్ట్రార్లు , ఒడిశాలోని వివిధ సంస్థల ఫ్యాకల్టీలకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భరోసా చొరవను అనుస‌రించాలని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ,ఇతర ఉన్నత విద్యాసంస్థలను ఆయన కోరారు.
కోవిడ్ -19 నేపథ్యంలో బాధిత విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి న సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఒడిశా(సియుఒ) చేస్తున్న ప్ర‌య‌త్నాలు, హెల్ప్‌లైన్ ‘భరోసా’  ప్రధాన లక్ష్యం, దాని సేవలను సియుఒ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐ. రామబ్రహ్మం వివ‌రించారు. సియుఒ హెల్ప్‌లైన్ ‘భరోసా’ ఒడిశాలోని ఏ విశ్వవిద్యాలయంలోని ఏ విద్యార్థి  సమస్యలనైనా పరిష్కరిస్తుందనే విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే,సియుఒ హెల్ప్‌లైన్ కు  పైలట్ దశలో 400 కి పైగా కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు. లాంఛ‌నంగా ఈరోజు సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఒడిశా భ‌రోసా ను ప్రారంభించ‌డానికి ముందు ఇందుకు సంబంధించి
త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కోరాపుట్ జిల్లా క‌లెక్ట‌ర్‌, స్పెష‌ల్ మేజిస్ట్రేట్ శ్రీ మ‌దుసూద‌న్ మిశ్రా కీల‌క‌పాత్ర పోషించారు.  
ఒడిశా ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సాహూ, ఒడిశా సెంట్రల్ యూనివర్శిటీ ప్రయత్నాలను ప్రశంసించారు .కోవిడ్ -19 సమయంలో బాధలో ఉన్న విద్యార్థులకు ఇది సహాయపడ‌గ‌ల‌ద‌న్న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

 



(Release ID: 1623110) Visitor Counter : 244