వ్యవసాయ మంత్రిత్వ శాఖ

10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన‌177 కొత్త మండీల‌ను వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన‌ ఈ-నామ్ ప్లాట్‌ఫాంతో అనుసంధానం

రైతుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రం క‌లిగించేందుకు ఈ నామ్ ప్లాట్‌ఫాంను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు -శ్రీ‌న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్

Posted On: 11 MAY 2020 2:24PM by PIB Hyderabad

వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేయడానికి, రైతులు తమ పండించిన ఉత్పత్తులను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించడానికి వీలుగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు 177 కొత్త మండీలను జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) తో అనుసంధానం చేశారు. ఈ రోజు విలీనం చేసిన మండీలు: గుజరాత్ (17), హర్యానా (26), జమ్మూ,కాశ్మీర్‌ (1), కేరళ (5), మహారాష్ట్ర (54), ఒడిశా (15), పంజాబ్ (17), రాజస్థాన్ (25), తమిళనాడు (13), పశ్చిమ బెంగాల్ (1). ప్ర‌స్తుతం 177 అదనపు మండిలను ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా మొత్తం ఈ నామ్‌ మండిల సంఖ్య 962 కు చేరింది.
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొత్త మండీలను ప్రారంభించిన శ్రీ తోమర్, రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ నామ్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని స‌మ‌ర్ధంగా ఉప‌యోగించుకునేందుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఈ నామ్ పోర్ట‌ల్‌ను రూపొందించారు.
అంత‌కు ముందు దేశ‌వ్యాప్తంగా 17 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సంబంధించి 785 మండీల‌ను ఈ నామ్‌తో అనుసంధానించారు. వీటిని 1.66 కోట్ల మంది్ రైతులు, 1.30 ల‌క్ష‌ల‌మంది ట్రేడ‌ర్లు ,71,911 మంది క‌మిష‌న్ ఏజెంట్లు వినియోగిస్తున్నారు. 2020 మే 9 నాటికి ఈ నామ్ ప్లాట్‌ఫారం ల ద్వారా 3.43 కోట్ల మెట్రిక్ ట‌న్నులు,37.93 ల‌క్ష‌లసంఖ్య‌గ‌ల స‌ర‌కు (వెదురు,కొబ్బ‌రి) ఉమ్మ‌డిగా సుమారు 1 ల‌క్ష కోట్ల రూపాయ‌వ‌ల విలువ‌గ‌లిగిన‌ది ట్రేడ్ అయింది.
 ఇనామ్ ప్లాట్‌ఫామ్ ద్వారా  1.25 లక్షలకు పైగా రైతులకు 708 కోట్ల‌రూపాయ‌ల విలువ‌గ‌ల డిజిట‌ల్ చెల్లింపులు చేశారు.. ఈనామ్  , మండి లు,  రాష్ట్ర సరిహద్దులను దాటి వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.  మొత్తం 236 మండీలు 12 రాష్ట్రాలలో అంత‌ర్ మండీ వాణిజ్యంలో పాల్గొన్నాయి., 13 రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు అంతర్రాష్ట్ర వాణిజ్యంలో పాల్గొన్నాయి. రైతులు దూర ప్రాంతంలోని వ్యాపారులతో నేరుగా సంభాషించడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం, ఆహార ధాన్యాలు, నూనె గింజలు, ఫైబర్స్, కూరగాయలు , పండ్లతో సహా 150 వస్తువులు ఈనామ్‌లో  ట్రేడ్ అవుతున్నాయి. ఈ నామ్ ప్లాట్‌ఫాంపై 1,005 ఎఫ్‌పిఓలు రిజిస్ట‌ర్ అయ్యాయి. రూ .7.92 కోట్ల విలువైన 2900 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను  ట్రేడ్  చేశాయి.
   కోవిడ్-19 లాక్‌డౌన్ స‌మ‌యంలో మండీల‌లో ర‌ద్దీ లేకుండా చూడ‌డానికి  కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి 2020 ఏప్రిల్ 2న ఎప్‌.పిఒ ట్రేడ్ మాడ్యూల్‌, లాజిస్టిక్ మాడ్యూల్ ఈ ఎన్‌డ‌బ్ల్యుఆర్ ఆధారిత వేర్ హౌస్ మాడ్యూల్ ల‌ను ప్రారంభించారు. అప్ప‌టి నుంచి 15 రాష్ట్రాల‌కు చెందిన 82 ఎఫ్‌.పి.ఒలు ఈనామ్ ప్లాట్‌ఫాంపై ట్రేడింగ్ చేశాయి. ఇవి ట్రేడ్ చేసిన మొత్తం స‌ర‌కు 12048 క్వింటాళ్లు కాగా , వీటి విలువ రూ 2.22 కోట్లు. 9 లాజిస్టిక్ స‌ర్వీస్ అగ్రిగేట‌ర్లు ఈనామ్‌తో భాగ‌స్వాముల‌య్యారు దీనికింద 2,31,300  మంది ట్రాన్స్‌పోర్ట‌ర్లు 11,37,700 ట్ర‌క్కుల‌ను ఈ నామ్ ను ఉప‌యోగించుకునే వారికి ర‌వాణాసేవ‌లు అందించేందుకు అందుబాటులో ఉంచారు.
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) అనేది భారత ప్రభుత్వం  చేప‌ట్టిన‌ అత్యంత ప్రతిష్ఠాత్మక ,విజయవంతమైన పథకం, ఇది వ్యవసాయ ఉత్ప‌త్తుల‌ కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను రూపొందించడానికి ప్రస్తుతమున్న ఎపిఎంసి మండిస్‌ను నెట్‌వర్క్ చేస్తుంది. మార్కెట్లు, కొనుగోలుదారులు  అమ్మకందారుల మధ్య సమాచార అసమానతను తొలగించడం , వాస్తవ డిమాండ్  సరఫరా ఆధారంగా రియ‌ల్‌టైమ్‌ ధరల ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది.
 శ్రీ  న‌రేంద్ర సింగ్ తోమర్ 1 మే 2020 న ,7 రాష్ట్రాల నుండి 200 ఈనామ్ మండిలను ఏకీకృతం చేసారు. ఇందులో  కర్ణాటకను కూడా కొత్త‌గా ఈనామ్ లో చేర్చారు.భారతీయ రైతులకు సహాయం చేయడానికి దీనిని చేప‌ట్టారు. దీనికితోడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కర్ణాటకకు చెందిన ఆర్ ఇ ఎం ఎస్ ( యూనిఫైడ్ మార్కెట్ పోర్ట‌ల్ -యుఎంపి), ఈనామ్ పోర్టల్  మధ్య ఇంటర్-ఆపరేబిలిటీని ప్రారంభించారు. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఇంటర్-ఆపరేబిలిటీ ఫీచర్‌ను ఉపయోగించి, రెండు ప్లాట్‌ఫారమ్‌ల వ్యాపారులు,  రైతులకు వ్యాపారం కోసం ఎక్కువ మార్కెట్లను యాక్సెస్ చేయడానికి ఇది అవకాశం క‌ల్పిస్తుంది.
 ఈనామ్ తొలిద‌శ విజ‌యాల‌ను గ‌మ‌నించిన‌ట్ట‌యితే ( 585 మండీల‌ను స‌మీకృతం చేయ‌డం), అది ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున విస్త‌ర‌ణ దిశ‌గా సాగుతోంది. త‌న ప‌రిధిని మ‌రింత విస్త‌రించుకుంటూ అద‌నంగా 415 మండీల‌ను 2020 మే 15 లోగా ఈ నామ్ ప్లాట్‌ఫామ్‌లో చేర్చ‌బోతున్న‌ది. దీనితో ఈనామ్ మండీల‌సంఖ్య 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల‌తో క‌లిపి మొత్తం 1000 ఈనామ్ మండీలు అవుతుంది. ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త అయిన ఒక దేశం, ఒక మార్కెట్ ను సాధించ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది.
భారతదేశంలో వ్యవసాయ ఉత్ప‌త్తుల‌ కోసం ప్రస్తుత మండిల‌ను “వన్ నేషన్ వన్ మార్కెట్” తో అనుసంధానించే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా గ‌ల‌ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ , నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) ను 14 ఏప్రిల్ 2016 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారత ప్రభుత్వ వ్యవసాయ  రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నామ్‌ను అమలు చేయడానికి స్మాల్ ఫార్మ‌ర్స్‌ అగ్రిబిజినెస్ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఐసి) లీడ్ ఏజెన్సీగా ఏర్ప‌డింది.

స‌రుకుల రాక‌, నాణ్యత ,ధరలు, వాణిజ్య ఆఫర్‌లకు ప్రతిస్పందించే సదుపాయం , ఎలక్ట్రానిక్ చెల్లింపు  నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లేట్టు చూడ‌డం , మెరుగైన మార్కెట్ అందుబాటు కోసం వారికి సహాయపడే అన్ని ఎపిఎంసి సంబంధిత సమాచారం, సేవలకు  నామ్‌ పోర్టల్ సింగిల్ విండో సేవను అందిస్తుంది.



(Release ID: 1622976) Visitor Counter : 379