హోం మంత్రిత్వ శాఖ

వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులను, వారి స్వస్థలాలకు స‌త్వ‌రం తరలించడానికి వీలుగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎక్కువ ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడపడంలో రైల్వేకి సహకరించండి: రాష్ట్రాల‌కు సూచించిన కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ‌

Posted On: 11 MAY 2020 12:07PM by PIB Hyderabad


  ‘శ్రామిక్’ ప్రత్యేక రైళ్లు, బ‌స్సుల‌లో వలస కార్మికులను పంపేందుకు అన్ని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ ప్రభుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి 2020 మే 10న నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ కు అధ్య‌క్ష‌త వ‌హించారు. .
ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌కారం, వ‌ల‌స‌కార్మికులు రోడ్డువెంట‌, రైల్వే ట్రాక్‌ల వెంట త‌మ‌స్వ‌స్థ‌లాల‌ల‌కు న‌డ‌చి వెళ్ళ‌కుండా చూడాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కోరింది. ‘శ్రామిక్’ ప్రత్యేక రైళ్లు, బస్సులు వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అందువల్ల, వారు తమ స్వస్థలాలకు ‘శ్రామిక్’ ప్రత్యేక రైళ్లు లేదా బస్సుల్లో ఎక్కడానికి అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించ‌వ‌చ్చు.  అప్పటి వరకు వలస కార్మికుల‌కు త‌గిన సూచ‌న‌లు చేసి సమీపంలోని షెల్ట‌ర్ హౌస్‌ల‌కు త‌ర‌లించ‌వచ్చు.
 వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వేగంగా తరలించడానికి వీలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కువ సంఖ్యలో ‘శ్రామిక్’ ప్రత్యేక రైళ్లను నడపడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు రైల్వేలతో సహకరించాలని హోంమంత్రిత్వ‌శాఖ సూచించింది.
వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపున‌కు సంబంధించి అధికారిక స‌మాచారం కింది లింక్ లో చూడ‌వ‌చ్చు.



(Release ID: 1622907) Visitor Counter : 152