ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నియంత్రణ స్థితిని సమీక్షించడానికి మండోలి కొవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్
వ్యక్తిగత పరిశుభ్రత, శ్వాసకోశ సంబంధిత అత్యున్నత విధానలను పాటించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కోవిడ్ -19పై అంతిమ పోరాటంలో సత్ఫలితాలనిస్తాయి: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
10 MAY 2020 7:19PM by PIB Hyderabad
కోవిడ్ -19 నిర్వహణ స్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు న్యూ ఢిల్లీలోని మాండోలి జైలులోని కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) ను సందర్శించారు. ఆసుపత్రి సంసిద్ధత కోసం తగిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మాండోలిసిసిసి పోలీస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను కోవిడ్ -19 ప్రత్యేక కేంద్రంగా మార్చారు. దీనిని తేలికపాటి,
అత్యంత తేలికపాటి కోవిడ్ -19 లక్షణాలు కలిగిన రోగులకోసం తగినన్ని ఐసోలేషన్ గదులు , పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ -19 కేంద్రంగా మారింది.
ఈ సందర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, “కోవిడ్ -19 ని ఎదుర్కొనేందుకు తగినన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలు సౌకర్యాలు దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మూడు రకాలు. అవి ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్ (DCH లు), ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు (DCHC లు) ,కోవిడ్ సంరక్షణ కేంద్రాలు (CCC లు). వీటిలో తగినంత సంఖ్యలో ఐసోలేషన్ పడకలు, ఐసియు పడకలు , ఇతర సౌకర్యాలు ఉన్నాయి.” అని అన్నారు.
ఇలాంటి సదుపాయాల గురించి తెలియజేస్తూ ఆయన, దేశవ్యాప్తంగా 855 కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించడం జరిగిందని, ఇందులో 1,65,723 బెడ్లు ఉన్నాయన్నారు,( 1,47,128 ఐసొలేషన్ బెడ్లు,+ ఐసియుబెడ్లు), 1984 ప్రత్యేక కోవిడ్ హెల్త్ సెంటర్లలో 1,31,352 బెడ్లు (1,21,403 ఐసొలేషన్ బెడ్లు, +9,949 ఐసియు బెడ్లు), 4,362 కోవిడ్ కేర్ కేంద్రాలలో 3,46,856 బెడ్లు ఉన్నాయన్నారు. ఢిల్లీలో 17 కోవిడ్ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని ఇవి 5,000 బెడ్ల సామర్ధ్యంతో ఉన్నాయని చెప్పారు.
“గత కొద్ది రోజులుగా, నేను ఎయిమ్స్ ట్రామా సెంటర్,ఢిల్లీ, ఎల్‌ఎన్‌జెపి, ఆర్‌ఎంఎల్, సఫ్దర్‌జంగ్, ఎయిమ్స్ జాజ్జర్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్‌హెచ్‌ఎంసి వంటి వివిధ కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను సందర్శిస్తున్నాను. ఈసారి నేను ఈ మాండోలికోవిడ్ కేర్ సెంటర్‌ను సందర్శించి, ఈ సెంటర్ చేసిన ఏర్పాట్లను స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నాను ”అని ఆయన అన్నారు.
మండోలి సిసిసి లొ 12 టవర్లు ఉన్నాయని వీటిలో 575 మంద కోవిడ్ -19 పేషెంట్లను సంరక్షిస్తున్నట్టు డాక్టర్ హర్షవర్దన్ కు ఈ పర్యటన సందర్బంగా తెలియజేశారు.టవర్ -1ను సందర్శించి ఆయన జమ్ము కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాంలకు చెందిన పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన డాక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు. వారు సిసిసిలోని ఏర్పాట్ల గురించి డాక్టర్ హర్షవర్దన్‌కు వివరించారు. “ఇంతకు ముందు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన పేషెంట్లు , కోలుకుని ఇప్పుడు పరీక్షించగా నెగటివ్ లోకి వచ్చారని , త్వరలోనే వీరందరూ తమ ఇళ్లకు వెళ్ళి మరింత సుదీర్ఘ, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపనున్నట్టు తెలిసి నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
ముసుగులు లేదా ఫేస్ కవర్లు ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం భౌతిక దూరాన్ని పాటించడం వంటివాటి ప్రాధాన్యతను , డాక్టర్ హర్ష్ వర్ధన్ నొక్కి చెప్పారు., "ఈ అలవాట్లు కోవిడ్ -19 తో పాటు ఇతర వ్యాధులను కూడా ఎదుర్కోవడంలో మనకు సహాయపడతాయి.” అని అన్నారు. "స్మాల్ పాక్స్ ,పోలియో నిర్మూలనకు గతంలో ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని, మనందరం కలిసి కరోనావైరస్ పై పోరాడదాం, దాన్ని ఓడిద్దాం ”అని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు.
రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర సంస్థలకు సుమారు 72 లక్షల ఎన్ -95 మాస్క్‌లు, సుమారు 36 లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ) అందించినట్లు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అదేవిధంగా పేషెంట్లకు వాడుతున్న ఆరోగ్య సంరక్షణ పరికరాల గురించి తెలియజేస్తూ, “ ఈరోజు నాటికి క్రియాశీల కోవిడ్ -19 నిర్దారిత కేసుల ఆధారంగా చికిత్స పొందుతున్న, కోవిడ్ కేసులలో 2.48శాతం మందికి మాత్రమే ఐసియు సౌకర్యం అవసరమని గుర్తించామన్నారు. వారిలో 1.94 శాతం మందికి ఆక్సిజన్ సరఫరా అవసరమని,, కేవలం 0.40% మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరమని ” ఆయన చెప్పారు.
దేశంలో కోవిడ్ నిర్దారణ పరీక్షా సామర్ధ్యం , దాని స్థితి గురించి మాట్లాడుతూ, “ ఇప్పటివరకూ మనకు 343 ప్రభుత్వ ప్రయోగశాలలు , 129 ప్రైవేట్ ప్రయోగశాల చైన్ సంస్థలు ఉన్నాయి. పరీక్షా సామర్థ్యం రెండింటిలోనూ పెరిగింది, ఇవాల్టికి ప్రతిరోజూ 95,000 పరీక్షలను నిర్వహించవచ్చు. నిన్ననే 86,368 పరీక్షలు నిర్వహించాం. నిన్నటి వరకు మేము 16,09,777 పరీక్షలు నిర్వహించాము. ” అని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
కోవిడ్ -19ను ను ఎదుర్కోవటానికి రాష్ట్రాల కృషికి తోడుగా. గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటి 10 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలను కూడా పంపుతున్నట్లు డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలియజేశారు.
దేశంలో కోవిడ్ -19ను అదుపుచేసిన తీరు గురించి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, “లాక్ డౌన్‌కు ముందు, 2020 మార్చి 25 న, 3 రోజుల వ్యవధిలో కేసుల నమోదు రెట్టింపు రేటు 3.2 ఉండగా, ఏడు రోజుల వ్యవధిలో ఇది 3.0 , 14 రోజుల వ్యవధిలో 4.1. ఈ రోజు ఇది 3 రోజుల విండోపై 12.0, ఏడు రోజుల విండోపై 10.1, అలాగే14 రోజుల విండోలో కొలిచినప్పుడు 11.0 వద్ద ఉంది. అదేవిధంగా, మరణాల రేటు 3.3శాతం వద్ద ఉండగా, రికవరీ రేటు 30.7శాతాని కి మెరుగుపడింది. లాక్‌డౌన్ కారణంగా పరిస్థితి మెరుగుపడింది. ఇది కోవిడ్ -19 రోగులకు అందించే ఆరోగ్య సంరక్షణ నాణ్యతను కూడా ప్రతిబింబిస్తుంది. ” అండ మాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా , నగర్ హవేలి, గోవా, జమ్ము కాశ్మీర్, లడఖ్, మణిపూర్, ఒడిశా, మిజోరాం, పుదుచ్చేరి - 10 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటల్లో కొత్త కేసు ఏదీ నమోదు కాలేదు. అంతేకాకుండా, డామన్ డయ్యు, సిక్కిం, నాగాలాండ్ , లక్షద్వీప్ - ఈ4 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ”అని ఆయన అన్నారు
ప్రపంచంలోని 20 దేశాలలో గరిష్ట కేసులు నమోదయ్యానయని వీటి మొత్తం జనాభా భారతదేశ జనాభాతో సమానమని అన్నారు. అంటే 135 కోట్లు . ఆ దేశాలు భారతదేశంతో పోలిస్తే దాదాపు 84 రెట్లు ఎక్కువ కేసులను నమోదు చేశాయన్నారు. ఇక మరణాల రేటు విషయానికి వస్తే టాప్ 20 దేశాలలో భారతదేశంలో సంభవించిన మరణాల కంటె 200 రెట్లు ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చురుకైన, ముందస్తు గ్రేడెడ్ విధానం వల్ల భారతదేశంలో ఈ వ్యాధి నిరోధకత సాధ్యమైందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
మండొలి సిసిసికి డాక్టర్ హర్ష్ వర్ధన్ పర్యటన సందర్భంగా, జిల్లా మేజిస్ట్రేట్, షాదారా,,డిసిపి, షాహదరా శ్రీ సంజీవ్ కుమార్ తో పాటు , సీమాపురి ఎస్డిఎం,మండోలిసిసి నోడల్ ఆఫీసర్ కూడా అయిన శ్రీ పంకజ్ భట్ నగర్ హాజరయ్యారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(Release ID: 1622806)
Visitor Counter : 273